పులకింతల పున్నాగలు ఏ వాకిట కురిసినా తొలకరించు తొలి పలుకులు ఏ నోటన పలికినా పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుబాళింపు కనుసన్నల జాజిపూలు పల్లవించు కావ్యాలే ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నో ఈ వంకన నింగి తాకు సింగిణీల విల్లంబులు…
Author: swatee sripada
కావలసింది…
వసంతాలు తెగనరుక్కుంటూ ఎడారుల్లో పొర్లిపొర్లి ఏడ్చే సంస్కృతి మాది రాచబాటలా పరిచిన ప్రేమ పూల తివాచీ మదమెక్కిన మత్తగజంలా ఒళ్ళుమరచిన అహంతో చిందర వందర చేసి మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే సంప్రదాయం మాది నిన్నా మొన్నా ఆపై కనుచూపు సారించినంత…
ఎక్కడో అరవాలిన హరివిల్లుపై
ఎక్కడో అరవాలిన హరివిల్లుపైనీలి నీలి సోయగాల నిమ్నగలోఊహల జలకాల పై నీ చల్లని చిరునవ్వువెలుగురేఖ నెలవంకై నిలిచిందా? అది మరీ అంతదూరమా? ఈ గాలి ఇలా అలలు అలలుగా తెరలు తెరలుగాఅలవోకల చిరు స్పర్శలు అలరింపుల చందనాలుకవ్వించే ఆకు చాటు కమనీయపు పులకింతలు…
ఎప్పటినుంచో …..
ఎప్పటినుంచో నాకు తెలుసు ఇప్పటి ఈ రోజులు ఎక్కడో పొంచిఉన్నాయని ఎప్పటినుంచో తెలుసు మరి ! బాల్యం ఇసుక తిన్నెలమీద భవిష్యత్తు ఓనమాలు రాసుకునేప్పుడే తెలుసు బలపం పట్టుకున్నసుకుమారపు వేలికొసల్లో ఎన్ని ఉపద్రవాల సూది మొనలు గుచ్చుకుంటాయో అపుడో ఇపుడో ఆత్మీయత…
చెలీ నీ జ్ఞాపకాలే
నా కనుపాపల పల్లకీ నెక్కించి స్వప్నవీధులగుండా గుండె నెత్తావులను వెదజల్లుతూ నేను నలుగురినై జీవితం పందిట్లోకి మోసుకుపోతాను నా గాఢ పరిష్వంగం వెచ్చదనాన ఒదిగి పొదిగిన నిన్ను ప్రేమాధి రోహణ అనుభూతుల్లో జగమంతా ఊరేగిస్తానుఅలసి సొలసి నిట్టూర్పుల సెగలో చలికాచుకుంటూ కందిన…
ఎక్కడ నీ చిరునామా?
నిశ్శబ్దంగా నీ సంతకం చరిత్ర అలల పల్లకీనెక్కి లోకసంచారం చేస్తూనేవుంటుంది.నీతి పద్యాల పాదాలు అరువడిగి యుగాల పుటలనిండా శిలా శాసనాల చిత్ర పటాల్ను ఆవిష్కరిస్తూనే పోతుంది. అవాస్తవికత అద్దాల్లో అందని ప్రతిబింబమై వగలు పోతూనేవుంటుంది. స్వప్న ద్వీపాల్లో సంచరించేకలల కౌగిలి కొలువులా…
ఇవ్వాల్టి మనిషి
ఇవ్వాల్టి మనిషి నిర్లిప్తత కప్పుకు నిద్రపొతున్న వెసూవియస్ నో చిరునవ్వు ఉపరితలం కింద పొగలుకక్కుతున్న సప్తసముద్రాల పాదారసాన్నో చిటపటలాడే నిప్పురవ్వలను గుప్పిట్లో బిగించి శరవేగంతో చుట్టుకుంటున్న అగ్నికీలల్ను లోలోనే అదిమి పట్టి ఆకుపచ్చ వెలుగుల్ను గుమ్మరించేఅడవితల్లినో ఆటవిక స్వభావాన్ని సింహ గర్జ్జనల…
సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట
సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట ఆకు రాల్చిందంటె అమ్మాయి శిల్పమే చిగురు తొడిగిందంటే చెక్కిళ్ళ అందమే చిగురు చిగురున మొగ్గ చిన్నారి కనురెప్ప గాలి కదలికలన్నీ సరిగమల గమకాలు సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట పూసింది…
అమ్మను తేలు కుట్టిన ఆరాత్రి – Telugu translation of Nissim Ezekiel’s poem
అమ్మను తేలు కుట్టిన ఆరాత్రి నాకింకా గుర్తుందిపదిగంటలపాటు ఎడతెరిపిలేని వానఅతన్ని బియ్యం బస్తా వెనకాలకు తోలిందిఆ చీకటి గదిలో కౄరంగా కొండి విదిలించి–విషం వదిలించుకునిమళ్ళీ వాన నెదుర్కొందుకు వెళ్ళిపోయాడు.దౌష్ట్యపు విషానికి విరుగుడుగావందలమార్లు భగవన్నామం స్మరిస్తూరెక్కలపురుగుల గుంపుల్లాబిలబిల్లాడుతూ వచ్చిన గ్రామస్థులుకొవ్వొత్తులతో దీపాలతో తేలు…
నేను
నిట్టూర్పుల నిప్పు కణికల్ను కనురెప్పల పొత్తిళ్ళలో దాచి అందమైన నా పాలరాతి సుందర వనానికి పచ్చల మణిహారాల్లా చిరునవ్వుల సొగసులను పొదుగుతూఅలసిసొలసిన నా చూపుల చెక్కిళ్ళపై అలవోక పలకరింపుగా చిరు గాలి నును స్పర్శ పుట్టిన మరుక్షణం నుండీ రాగ బంధాల…