ఊఁ….

ఊసులన్నింటినీ మూటకట్టేసుకున్న ఏకాక్షరి… మాటకీ మౌనానికీవారధిలా….  పెదవి దాటని పలకరింపుసమస్త భావనల మేళవింపుఎద లోతుల్లో ఉదయించిఅర్ధాంగీకారంగా అస్తమించేఊంకారం…. తప్పటడుగుల తొలి ఆహార్యంచరమాంకపు చిన్న శబ్దం….. బాసకూ, బాసటకూ ప్రేరకమైభాషాభావాలకతీతమైమనసుకి మాత్రమేఅర్ధమయ్యే ఏకైక నుడికారం! చిరునవ్వుకు శ్రీకారమైసిరిమల్లెల మణిహారమైకొంటెతనంతో ఆకారమైఒంటరితనంలో ఓంకారమై…. వినిపించేది…

జీవితంలో…

రేడియో సరిగ్గా పాడడంలేదు…మనిద్దరి మధ్యా గులాబి రంగు మాటలు దొర్లి చాన్నాళ్ళైంది. నువ్వు దేవుణ్ణి అతిగా నమ్ముతావు.కనబడకనే కొట్టుకొనే గుండెలా..నేను టీకప్పులో బుడగల్ని లెక్కపెట్టుకొంటానుచాక్లెట్ రేపర్ విప్పుతోన్నప్పటి పిల్లవాని మనసులా.. కొన్నిసార్లు అన్నీ బాగున్నట్టే వుంటుందిటీవీలో నచ్చిన ప్రోగ్రామ్, మొబైల్లో లేటెస్ట్…

ద్వైతం

ఉచ్ఛ్వాస నిశ్వాసాల రోలర్ కోస్టర్‌లో ద్వైతం కన్పడుతోంది స్పష్టంగా… నాణానికి చెరోవైపు అతుక్కున్న రెండు పార్శ్వాల్లా అదే ద్వైతం! శల్య సారధ్యంలా జీవిత రధానికి భార్యాభర్తలిద్దరూ ద్వైతమే. ప్రేమ బండికి పెళ్లనే రెండు జోడెద్దులు అవసరమే అదే ద్వైతం మళ్ళీ. అభినందించే…