ఆమెను చూస్తేనే ఏవగింపు అసహ్యం ఛీత్కారాలు చీదరింపులు కానీ ఆమె ఎందఱో తల్లుల బిడ్డలకు అమ్మ కన్నతల్లి వద్దనుకుని బిడ్డను విసిరేసినా ఆమె మాత్రం అక్కున చేర్చుకుని దిక్కులనే అంబరాలు కట్టి మురిసిపోతుంది ఆ వీధి శునకాల, వరాహాల జోలపాటలతో లాలిస్తుంది పసికూనలకే కాదు…
Author: Veena
గుప్పెడు మనసు
గుప్పెడంతే ఉన్నానంటూనే ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది అనుభవాల వ్యవసాయం చేసి అనుభూతుల పంట…