గతే శోకో న కర్తవ్యో, భవిష్యం నైవ చింతయేత్
వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః
అర్థం: గతం గురించి శోకించడం వ్యర్థం, భవిష్యత్తు గురించి చింతించడం అనవసరం. వర్తమానాన్ని అనుసరించి విచక్షణతో మెలగాలి.
****
ఆవకాయ.కామ్ ఈరోజు నుంచి సరికొత్త రూపంలో మీ ముందుకు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది.
గతమంతా ఘనకీర్తి కాకపోయినా ఆవకాయ.కామ్ హతభాగ్యం మాత్రం కాదు. వేలాది పాఠకులు గత మూడు సంవత్సరాలుగా ఆదరించారు. యాభైకి పైగా రచయితలు, 2,300 పైగా రచనలను పొందుపరిచారు.
అతి తక్కువ వనరులతో, సాంకేతిక సహకారం, హంగులు దాదాపుగా లేకుండా వున్నా, ఆవకాయ.కామ్ అంతర్జాల తెలుగు ప్రజల మనసులలో తనకు తగ్గట్టుగా స్థానం సంపాదించుకోగలిగింది. ఆ స్థానాన్ని నిలుపుకోవలన్న తపన తప్ప భవిష్యత్తు పై ఎలాంటి చింతా లేదు.
“స్థితస్య క్షేమ పరిపాలనం ” అన్నట్టు ఉన్నదాన్ని క్షేమంగా చూసుకోవడం ముఖ్యమే కానీ వర్తమానకాల వీచికల్లో కాళ్ళు తేలిపోకుండా స్థిరంగా నిలవడం మరెంతో అవసరం. అలా నిలవడానికి, నెటిజన్లకు మరింత చేరువ కావడానికి కొత్త హంగుల్ని, నూత్న సాంకేతిక ప్రగతుల్ని తనలోకి ఆహ్వానించుకుంది ఆవకాయ.కామ్.
ఈ కొత్త రూపానికి శిల్పులు – పాఠకులు, శ్రేయోభిలాషులే.
అడుగడునా మాకు అందిన సలహాలు, సూచనలు, హెచ్చరికలు మొదలైన వాటిని క్రోడీకరించి, కోడీకరించగా ప్రభవించినదే www.newaavakaaya.com
క్రితం రచనలన్నీ www.aavakaaya.com లోనే ఉంచడం జరిగింది.
ఈ మార్పును మీరందరూ ఆమోదిస్తారని, ఎప్పటిలానే ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తూ….
శుభాభినందనలతో
ఆవకాయ.కామ్ సంపాదక బృందం
“నేలతో నీడ అన్నది” పాటకి COVID-19 theme తో మేము చేసిన parody ప్రయత్నాన్ని చూడండి: https://youtu.be/KRgEz5k3H7I