అన్నీ వార్తలే!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ మధ్య అన్నీ వార్తలే కదా

1.

ఇప్పుడు మనం ఆటలాడటం మర్చిపోయి చాలా కాలం అయింది.

ఎవరో ఎక్కడో ఆడుతుంటారు, ఇక్కడ మనం టీ.వి లో చూస్తుంటాము బాబయ్యా! 

ఆడేవారూ ఆటకోసం ఆడరు సోదరా!

వాళ్ళు డబ్బూ, మందూ, స్త్రీల కోసం ఆడతారట చెల్లమ్మా!

అయినా ఫిక్సింగ్ ఎక్కడ లేదు చెప్పు నాయనా?

క్రికెట్ ఫిక్సింగ్….బెట్టింగ్…..

ముందుగా ’స్త్రీ’శాంత్ వంటీ పిత్త పరికలు ముందు దొరికాయి…ఆ తర్వాత దారా సింగ్ సుపుత్రుడు…నెమ్మదిగా సిమెంట్ శ్రీనివాసుల అల్లుడూ… చివరికి శిల్పా, కుంద్రాలు…

తీగ నుండి డొంక దాకా డబ్బు…సెక్స్…మందూ…అన్నీ ముడిపడీ…..

ధనమోచ్చిన మదమొచ్చును మదమొచ్చిన మాత్సర్యమొచ్చునని ఎప్పుడో సుమతి కారుడు అన్నట్లు…ఇదంతా ఆధునిక గ్లోబల్ గందరగోళంలో చాలా మామూలుగా మారిపోయాయి కదా!

ఇంకా పెద్ద పెద్ద తిమింగాలు బయటపడినా ఆశ్చర్యం ఉండదు బ్రదర్! వాళ్ళది ఫిక్సింగ్ మైండులైతే మనవి ఇమ్యూన్డ్ బాడీలు!

2.

టు బి ఆర్ నాట్ లోనే మొత్తం ఉంది అంటాడు జీన్ పాల్ సాత్ర్.

మనకు కావల్సినది ఎంచుకోవడంలో మనం తరుచూ విఫలం అవుతూ వుంటాం కదా..కళాకారులం కదా మళ్ళీ మళ్ళీ మోసపోతుంటాం. మనల్ని కళాకారులే మోసం చేస్తారు..వీలు దొరికితే మనమూ కళాత్మకంగా మోసగిస్తాం. కుదరకపోతే గుర్తింపు రాలేదని నెపం మరొకరిపై వేసి ఏడుస్తుంటాం చిన్నా!

జియా ఖాన్ ఆత్మహత్య కూడా ఇంతే. మోసం చేసిన వాడు హాయిగా వున్నాడు.. మోసపోయిన తను బలైంది. మోసం చేయటానికి అవకాశం లేకపోతే మోసపోతాం అని మాకియవిల్లి వచ్చి కొత్తగా చెప్పల్సిన అవసరం లేదు.

సూరజ్ పంచోలి మోసం చేసాడు అని వార్తల కధనం. కాని నిజానికి ఆ రంగమే అంత కాదా?

టూ బి ఆర్ నాట్ నిర్ణయం జియా ఖాన్ దే! తన నిర్ణయానికి తనే మోసపోయింది. మోసాన్ని తట్టుకొని ఉంటే బతికిపోయేది.

ఇప్పటి నీతి ఇదే….టూ బి కేర్ఫూల్ మిత్రమా!!

3.

ఎంత వారలైనా….

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మని నియంత ఒక వెలుగు వెలిగాడు. తర్వాత చరిత్ర మనకు తెలుసు.

అలాగే ఎన్.టి. రామారావ్ గారు. ఆయనంతటి వారూ చివరికి ఎలా వెళ్ళిపోయారో అందరికి తెలుసు. గతంలో వెలిగిన వాజ్ పేయి గారు ఇప్పుడు ఎక్కడ వున్నారో ఎవరికి తెలుసు?

బి.జె.పి యే తనుగా బతికిన అద్వాని గారి ప్రస్తుత పరిస్తితిని చూస్తుంటే మరో అడ్రస్స్ గల్లంతు అయ్యే సూచనలు సమీపంలో వున్నట్లుగా వుంది.

ఇప్పుడే అందిన వార్త: గురువు గారు రాజీనామాను ఉపసంహరించుకున్నారట.

మరో తాజావార్త: కదిలిస్తే చాలు నీతిశతకాలు సహస్రాది గా వినిపించే డా.దాసరి నారాయన రావ్ గారు సైతం భారీ బొగ్గు కుంభకోణపు బోనులో చిక్కి “బొగ్గుల పులి”గా మారారట (బొగ్గుల పులి కర్టసీ ఈనాడు దినపత్రిక వారిది)

మరి నీతల మాటేమిటో? మన నేతల తీరేమిటో?

“సంభవం…మీకే సంభవం…” అని పేరడీలు రాసుకొని నవ్వేసుకొందాం బ్రదర్!

Your views are valuable to us!