డేటింగ్ -రాయలవారిది ఏ కులం?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

డేటింగ్

సహజీవనం, డేటింగ్ మాటలు ఈ రోజుల్లో సర్వసాధారణ మాటలు అయిపోయాయి. టీ,కాఫీ, టిఫిన్ లానే ఇప్పటి కుర్రకారికి డేటింగ్ కూడా జీవితం లో ఒక భాగమయింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా వ్యాపించింది. బాద్యతలు లేని ప్రేమ అని నిర్వచనం చెబుతున్నారు. ఈ మద్య సహజీవనానికి సుప్రీం కోర్ట్ కూడా ఆమోదం తెలిపిందట. 

నాకు తెలిసిన చాలా మంది వివాహితులు వారి జీవితం లోని అసంత్రుప్తి ని చూసాను.అలాగే సహజీవనం చేస్తూ సంతోషంతో ఉన్నవారూ వున్నారు. ఏది నిజం? ఏది నిజం కాదు?

ఇంతకూ విషయమేమిటంటే – “డేటింగ్ పై మీ అభిప్ర్రాయం ఏమిటి?” అని నాకు తెలిసిన కొంత మంది ని అడిగాను సరదాగా. కొంతమంది తెలుగు అబ్బాయిలను అడిగాను. “టైం పాస్ కైతే పర్వాలే”దట. తెలుగు అమ్మాయిలు ఆయితె “మనకు అంత సీన్ లేదు భాయి!” అని జవాబిచ్చారు. మరి కొంత మంది సౌత్ మిత్రుల్ని అడిగాను. “whats wrong?” అన్న వాళ్ళూ వున్నారు. కొందరమ్మాయిలు “పెళ్లికి రెడీ ఐతేనే డేటింగ్ కు ఓకే అంటాం” అన్నారు. ఒకానొక నార్త్ మిత్రుర్రాలైతే ఇది పెద్ద విషయమే కాదన్నట్ట్లు సోడా పంచింది.

ఇటీవలే ఇటువంటి ఒక పెళ్ళిలో అమ్మాయి తరుపున నేను సాక్షి సంతకం చేసాను. ఇప్పటి వరకు అయితే వాళ్ళు బాగానే వున్నారు. కాలం మారిపోతుంది. మన జీవన శైలీ మారింది. ఇంకా మారుతుంది. ఇంకా 10సంవత్సరాల తర్వాత మన సమాజం ఎలా వుంటుందో మన ఊహ కు అందని సంగతి.


కృష్ణదేవరాయలది ఏ కులం?

ఈ మధ్య ఒక తెలుగు సినిమా వచ్చిందట. దాని పేరు దేవరాయ. ఇక మన వాళ్ళ ముసుగులు చించుకోవటం మొదలు పెట్టారు. “రాయలు మా కులపోడు” అంటే “కాదు, మా కులపోడు” అని.

ఊరేగింపులు,కోపాలూ తాపాలూ …..

నాకో అనుమానం , ఆ ఊరేగింపు లోని వారల్లో ఎంత మందికి రాయల గురించి తెలుసు? ఆయన ఎప్పుడు జన్మించారు? ఆయన ఏమి చేసారు? నిజానికి ఫలానావారు మన కులపోడు అని చెప్పుకోవడం ఎంత సబబు అనంటారు? సరె వాళ్ళ రీజన్స్ వారికి ఎలాగూ వుంటాయి అనుకోండి! 

మన గురించి చెప్పుకోడానికి ఏమిలేని వాడే నేను ఫలానా వారి కొడుకుని అని పరిచయం చేసుకొంటాడు, అదీ లేనివాడు ఫలానా ఫలనా వాడికి సోదరుణ్ణి అంటాడు, అదీ కుదరనప్పుడు ఆ పెద్దమనిషికి అల్లుణ్ణి లేదా మేనల్లుణ్ణి అని తన పరిచయం చేసుకోంటాడూ అట! అదీ కుదరనప్పుడు “నేను ఫలానా వీరుడి లేదా హేరో గారి కులపొణ్ణి” అని తన పరిచయం చెసుకుంటారు తన గురించి ఏమి లేని కొందరు మహానుభావులు. వీరిది పాపం కీర్తి కోసం క్రాస్ రోడ్ అన్నమాట. 

ఇప్పుడు మనకి అర్జెంటుగా మనుషుల్ని మనసుల్ని కలిపే తనం కావాలి.


 

Your views are valuable to us!