దిలీప్ కుమార్ దేవదాసు ఎందుకు పోయింది?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

దిలీప్ కుమార్ దేవదాసు ఎందుకు పోయింది?

బెంగాలీ రచయిత శరత్ రాసిన నవల “దేవదాసు” బహుశా చాలా భారతీయ భాషల్లో సినిమాగా తీసి వుంటారు. కానీ, అక్కినేని తెలుగు దేవదాసు ఆడీనంత మరేదీ ఆడి ఉండదు.

హిందీలో బిమల్ రాయ్ దర్శకత్వంలో దేవదాసుగా దిలీప్ కుమార్ సినిమా వచ్చింది. దిలీప్ మిగిలిన సినిమాలతో పోలిస్తే దేవదాసు హిట్టు కాలేదట. మంచి పాటలు వున్నాయి, మంచి సంగీతమూ వుంది. దానికి తోడు ’ట్రాజెడీ కింగ్’ దిలీప్ కుమార్ ఉండనేవున్నాడు.అన్నీటికి మించి బిమల్ రాయ్ దర్శకత్వం. నిజంగా సినిమా గొప్ప కళాఖండమే. అయినా ఆడలేదు. ఎందుకు?

2000 లో ఒకసారి ఇదే మాట అక్కినేని గారిని అడిగాం. ముందు “ఏమో తెలీదు!” అని తర్వాత దానికి ఆయన కొంచెం చేసు ఆలోచించి ఇలా అన్నారు – “దిలీప్ కుమార్ సినిమా కథనం లో వేగం తక్కువ” అని.

*********

పైగా అప్పటికే అలాంటి ముగింపు వున్న చాలా సినిమాల్లో దిలీప్ నటించడం కూడా ఒక కారణం కావొచ్చు. కానీ సినిమా మాత్రం గొప్ప సినిమా. దానిలో సందేహం లేదు. అయినా కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో మరికొన్ని సినిమాలు ఎందుకు ’ఫట్’మంటాయో కారణాలు ఎవరు చెప్పగలరు?

ఒక్క దాసరి గారు తప్ప….

***********

ప్యాసా” సినిమా తీయక ముందు గురుదత్ దానిలో హీరో వేషం వేయమని దిలీప్ కుమార్ ని అడిగితే “ఇది గతం లో నేను వేసిన దేవదాస్ పాత్ర లానే వుంది…జనం చూడరు.” అని తిరస్కరించాడట. తర్వత గురుదత్ తనే హీరో గా చేశాడు. ఎంతటి ఘన విజయం సాధించిందో అనందరికి తెలుసు. ఇదే మాట ఎవరో తర్వత దిలీప్ కుమర్ ని అడిగితే “ఆ వేషం లో గురుదత్ ఉండబట్టి జనం చూసారు.. నేనైతే ఆడేది కాదు!” అని అన్నడట. అదేకాలంలో  దిలీప్ కుమార్ చేసిన ’రాం ఔర్ శ్యాం’ వంటి చెత్తా సినిమాలు చాలా హిట్ అయ్యాయి!!

చిత్రం భళారే విచిత్రం!


దొరల దొంగతనం

ఎంత అవునన్నా కాదన్నా క్రికెట్ మనకు ఈరోజు జీవితంలో ఒక భాగం. క్రికెటర్స్ దేవుళ్ళో దయ్యాలో అది వేరే సంగతి.

***********

ఒకప్పుడు ఇండియా, పాక్ ఆటగాళ్ళు బంతికి ఒకవైపు వున్న మెరుపుని మాత్రమే అరగదీసేవారు. కొన్నిసార్లు మెరుపు అరగేదాక తొడలపై రుద్దేవారు. కొన్ని సందర్భాల్లో ఒక వైపు మెరుకొన్ని సమయాల్లో కోల్డ్ డ్రింక్ బాటిల్ కార్క్ తో రూపు మార్చేవారమని ఇమ్రాన్ ఖాన్ వంటి వారు తమ ఆత్మకథలో రాసుకున్నారు. అలా చేయడం వల్ల బంతి అనూహ్య మెలికలు తిరుగుతుంది. బాట్స్‍మెన్ కి బంతి గమన స్వరూపం అర్థం కాక అవుట్ అయ్యేవాడు.అయితే అప్పుడు ఇంగ్లీష్ వారు ఈ పనిని ’చీటింగ్’ అని అలా చేసినవారిని ’చీటర్స్’ అనేవారు.

కాకపోతే అదే పనిని వాళ్ళు కూడా అంతకంటే నైపుణ్యంగా నేర్చుకున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు స్వింగ్ ని ’ఆర్ట్’ అని పిలుచుకుంటున్నారు.

ఇదీ దొరల జబర్దస్తీ దొంగతనం!

*******

Your views are valuable to us!