ఇంతకు ఎవరీ అనార్కలి!

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

 

1.
అనార్కలి మొఘలాయి సుకుమార రాజకుమారుడు సలీం ప్రేయసి. భార్య కాదు.

ఇంతకీ అసలు ఈ అనార్కలి ఎవరు?

చరిత్ర లో ఎక్కడా అనార్కలి ప్రస్తావన లేదు.అనార్కలి కేవలం కవులు సృష్టించిన ఒక కాల్పనిక పాత్ర మాత్రమే.

చరిత్ర లో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో అని వెదికాను, చాలా మంది ప్రముఖ చరిత్రకారులను అడిగాను. ఒక్క ఆధారమూ దొరకలేదు.

ఈ కాల్పనిక పాత్ర మాత్రం భారతీయ సినిమా చరిత్రలో శాశ్విత స్థానం పొందినది.

తెలుగులోనూ అనార్కలి, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలు వొచ్చాయి.ఆడాయి. కాసులూ గల గల మనిపించాయి.పాటలూ జోరు జోరుగా పలికాయి.

2.
హిందీ తెరపై ముఖ్యగా రెండు అద్భుత సినిమాలు వున్నాయి.రెండీటి కథా వొకటే. పాత్రలూ అవే ఆక్బర్, సలీం,అనార్కలి.

1.అనార్కలి

2. మొగల్-ఎ-ఆజం

 

ముందు అనార్కలి సినిమ గురించి :


1953 లో వచ్చింది. ద బెష్ట్ టీం వర్క్ కి చక్కటి ఉదాహరణ అనార్కలి .

అక్బర్ గా ముబారక్, సలీం గా ప్రదీప్ కుమార్ , అనార్కలి గా బీనా రాయ్ ప్రాణం పోశారు. బీనా రాయ్ ప్రదీప్ కుమార్ హీరో హీరోయిన్లు. ఆనాటికి వాళ్ళిద్దరూ సూపర్ స్టార్లు. కథ నాశీర్ హుస్సైన్ .

సంగీతం ప్రసిద్ధ సంగీత దర్శకుడు సి.రామచంద్ర .గొప్ప సంగీతాన్ని అందించాడు. మొత్తం 11 పాటలు . 11 కి 11 ఆణిముత్యాలే. యే జిందగీ ఉసీకి హై జో కిసీక హో గయా (తెలుగు లో జీవితమే మధుర్ము ప్రేమ సుధా భరితము , జిక్కి పాడారు.) రోజుకు వొక్క సారైన ఇప్పటికీ ప్రేమికుల మనసును తాకుతూనే వుంటుంది.

దర్శకుడు నందలాల్ జస్వంత్ లాల్ చాలా ప్రతిభావంతుడు.

నిర్మాణం ఫిల్మిస్తాన్. చాలా విజయవంతమైన నిర్మాణ సంస్థలలో ఫిల్మిస్తాన్ మొదటిది.

సినిమా సూపర్ హిట్ .ఆ తరం వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసారు. మంచి టీం వర్క్ కి ఉదాహరణ ఆ సినిమా. అన్ని మసాలాలు సమపాళ్ళలో రంగరించి వొదిలిన విందు భోజనమే. మంచి సినిమా అనడం లో ఎటువంటి సందేహం లేదు.కానీ ఇంకా ఏదో వుంది ఇంకా ఏదో వుంది అనుకొనే వారూ వున్నారు. వారి కోసం మొఘల్-ఎ-ఆజం సినిమా .


3.
అదే కథ తో వచ్చిన మరొ సినిమా మొఘల్-ఎ-ఆజం. 1960 లో వొచ్చింది. నిర్మాత-దర్శకుడు కే.ఆసిఫ్. ఈ సినిమా పూర్తి చేయడనికి 18 సంవత్సరాలు పట్టింది. కే. ఆసిఫ్ వొక కళా ఉన్మాది. పాగల్ అని అనేవారు.

దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్ . కానీ ఆసిఫ్ అతన్ని ఈసఫ్ అని పిలిచేవాడు. దిలీప్ కుమారే అతణ్ణి పగ్లా-ఎ-ఫన్ (కళా ఉన్మాది)అని నామకరణం చేశాడు.

అప్పటికి పెద్ద సినిమా అంటే 3-4 కాదంటే ఎక్కువలో ఎక్కువ 5 లక్షల్లో అయిపోయేది. అటువంటి రోజుల్లొ 3 – 4 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు.

దిలీప్ కుమార్ , మధుబాల ,ప్రుథ్విరాజ్ కపూర్ ల ముగ్గురి నటనా విశ్వరూపానికి పరాకాష్ట ఈ సినిమా.

ఈ సిమిమాతో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి.

To buy Anarkali movie collection click above image

అప్పటికే ప్రేమలో విఫలం కావడంతో మధుబాల దిలీప్ ల మద్య మాటలు లెవ్వు. అయినా ఎంతో కళాత్మకంగా నటించారో మీరు సినిమా చూసి చెప్పండి.

సంగీత దర్శకుడు ది గ్రేట్ నౌషాద్ . 12 పాటలు వున్నాయి. 12 కు 12 మేలు జాతి వజ్రాలే.

ప్యార్ కియాతో డర్నా క్య హై పాట కోసం షీష్ మహల్ భారీ సెట్ వేయించారు. దానికోసం ముందు లండన్ నుండి అద్దాలని తెప్పించారు.ఎఫెక్ట్ సరీగ్గ రావడంలేదని దాన్ని తొలిగించి ఈ సారి అద్దలని ఫ్రాన్స్ నుండీ తెప్పించాడు ఆసిఫ్. ప్రుథ్వీరాజ్ కపూర్ మీసాలను జర్మనీ నుండి తెప్పించాడు.

ప్రుధ్వీ రాజ్ కపూర్ ఎలా వుంటాడంటే నిజంగా అక్బరే వచ్చి నేను అక్బర్ని అంటే పో పోవోయీ మా ప్రుథ్విరాజ్ కపూరే మాకు ఆక్బర్ అని అనిపించే అంతగా జీవించాడు.

అప్పట్లో శాస్త్రీయ సంగీతం, నేర్చుకొన్న గాయకులు సినిమాల్లో పాడటాన్ని నామోషీ గా ఫీల్ అయ్యేవారు.

బడే గులాం అలి సాబ్ తో వొక్క పాటైనా పాడిద్దామని నౌషాద్ ఆసిఫ్ తో అన్నాడు. ఆసిఫ్ ఎన్ని సార్లు ప్రాధేయపడినా బడే సాబ్ తిరస్కరించారు.

అప్పట్లో ఒక పాట పాడితే రఫీ, లతా లు రెమ్యూనరేషన్ గా 100 రూపాయలు తీసుకొనేవారు.150 ఇస్తే పండగ చేసుకొనేవారు.

అట్లాంటి సమయంలో బడే సాబ్ తప్పించుకోవడం కోసం ఒక పాట పాడటానికి 25000 డిమాండ్ చేసాడు.ముందే చెప్పాను కదా ఆసిఫ్ పాగల్ అని. పాతిక వేలు కాదు నీ ఇష్టం వొచ్చినంత రాసుకో అని బ్లాంక్ చెక్కు ఇచ్చి వచ్చాడు. ఇక బడే సాబ్ కు పాడక తప్పలేదు.

సినిమలో నెగెటీవ్ షేడ్స్ వున్న పాత్రని ధరించిన నిగార్ సుల్తాన నిజ జీవితంలో ఆసిఫ్ భార్యగా మారింది.అప్పటికే సితారా దేవి తో పీకల్లోతు ప్రేమ లో మునిగి వున్నాడు అసిఫ్.

ఆ సినిమా కథానాయకుడు దిలీప్ కుమార్ అక్కనూ ప్రేమించాడనీ , రహస్యంగా పెళ్ళి కూడా అయిందని పుకారు.అందుకే మొఘల్-ఎ-ఆజం ప్రీమియర్ షో కు దిలీప్ కుమార్ రాలేదు అట.

మొఘల్-ఎ-ఆజం సినిమా దర్శక నిర్మాత ఆసిఫ్ పరిస్తితి అనార్కలి సినిమా తీసిన ఫిల్మిస్తాన్ లాంటిది కాదు.

ఒకవేళ అనార్కలి ఆడక పోయినా ఫిల్మిస్తాన్ దగ్గర ఇంకా 10-20 సినిమాలు తీయదగ్గ దమ్ము ఉన్నవాళ్ళు.

ఇక ఆసిఫ్ కు మొఘల్-ఎ-ఆజం ఆడకపోతే సూసైడ్ ఖాయం.

ఎందుకంటే సినిమా కోసం ఆసిఫ్ నిగార్ కాళ్ళకు వున్న వెండి మెట్టల్ని సైతం అమ్మించాడని గుసగుస. అది కాకపోయినా తన జీవితం మొత్తాన్ని ఫణంగా పెట్టాడని చెప్పక తప్పదు.
ఎలాగోలా చివరికి సినిమాని రిలీజ్ చేసాడు.సూపర్, బంపర్ అనే మాటలు చాలా చిన్నవి.

అటువంటి సినిమా అంత హూందా తనాన్ని మళ్ళీ ఆసిఫ్ సైతం తీయలేడని నిరూపించాడు. ఈసారి పాగల్ పన్ గెలిచింది.

అనార్కలి కి ఆర్థికంగా రూపయి కి పది వస్తే ఆసిఫ్ మొఘల్-ఎ-ఆజం కు 10 కాదు ఇరవై కాదు రూపాయికి 100కు పైగా తెచ్చిపెట్టిందని అంటారు. రూపాయల్ని బస్తాల్లో మూటలు గా కట్టి యెడ్ల బండల్లొ తీసుకెళ్ళాడు ఆసిఫ్ అని చెబుతారు.

ఈ రెండు సినిమాల్ని చూడని వారు జీవితంలో కొంత భాగం కోల్పోయినట్లే . అందుకే చూడని వారు దయచేసి చూడండి.
మీ జీవితంలోని వెలితిని కొంత అయినా పూరిస్తుందని నా హామీ. అయితే ఒక సలహా.ముందుగా అనార్కలిని చూడండి. తరువాత మొఘుల్-ఎ-ఆజంని చూడండి. లేకపోతే ముందుగానే మొగుల్-ఎ-ఆజంని చూసి తరువాత అనార్కలి ని చూస్తే గనుక మీరు అనార్కలి పట్ల నిరుత్సాహ పడే అవకాశం వుంది.

అనార్కలి లో మిస్ అయిన ఆత్మ ను మొఘల్-ఎ-ఆజం లొ దొరుకుతుంది.

అనార్కలి సినిమా నిర్మాణం లాంటి జీవితం లో రిస్క్ లేదు.మినిమం గ్యారంటీ వుంది. ఎవరైనా బతకాలంటే నా సలహా అనార్కలి నిర్మాణం లానే బతకండి అని చెబుతాను.

ఇక నా విషయం అంటారా …. నాది ఆసిఫ్ మార్గం. అది కవిత్వం లోనైనా జీవితంలోనైనా …

రిస్క్ తీసుకోకపోతే జీవితం మనలను శాసిస్తుంది. రిస్క్ తీసుకొంటే జీవితాన్ని మనం శాసించగలం అని నా నమ్మకం.

ఇక కనీసం ఆ రెండు సినిమాల పాటలను అయినా వినండి.

మొగల్-ఎ- ఆజం పాటలు
*********************************
1. https://gaana.com/song/pyar-kiya-to-darna-kya-3
2. https://gaana.com/song/teri-mehfil-mein-kismat-azmakar-1
3. https://gaana.com/song/mohe-panghat-pe
4. https://gaana.com/song/bekas-pe-karam-kijiye-1
5. https://gaana.com/song/ae-mohabbat-zindabad
6. https://gaana.com/song/prem-jogan-ban-ke
7. gaana.com/song/yeh-dil-ki-lagi-kya-hogi
8. https://gaana.com/song/shubh-din-aayo-raj-dulara
9. https://gaana.com/song/ae-ishq-yeh-sab-duniyawale
10. https://gaana.com/song/khuda-nigheban-ho
11. https://gaana.com/song/humen-kash-tumse-mohabbat
12. https://gaana.com/song/ye-dil-ki-lagi-kam-kya-hog

అనార్కలి పాటలు
****************************
1. https://gaana.com/song/yeh-zindagi-usiki-hai-2
2. https://gaana.com/song/jaag-dard-e-ishq-jaag
3. https://gaana.com/song/aaja-ab-to-aaja
4. https://gaana.com/song/yeh-zindagi-usiki-hai-part-2
5. https://gaana.com/song/aa-jaan-e-wafa
6. https://gaana.com/song/zindagi-pyar-ki-do-char-ghadi
7. https://gaana.com/song/dua-kar-gham-e-dil
8. https://gaana.com/song/ae-baad-e-saba-ahista-chal
9. https://gaana.com/song/mujhse-mat-poochh
10. https://gaana.com/song/zamana-yeh-samjha
11. https://gaana.com/song/o-aasmanwale

Your views are valuable to us!