ఇద్దరు మిత్రులు
1.
అక్కినేని “ఇద్దరు మిత్రులు” సినిమా 1961లో వచ్చింది. అక్కినేని ద్విపాత్ర చేసిన మొదటి సినిమా అది.
మా దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా కూడా ఇద్దరు మిత్రులు. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినసొంపుగానే వుంటాయి. ఒకటి రెండు కాదు పాటలన్నీ హుషారు గొలుపుతూ ఖుషే ఖుషీ చలాకి గా వుంటాయి.
అక్కినేని దాశరథిల స్నేహం కొంచెం మధురమైనదే అని అంటారు.
అందుకేనేమో దాశరథి తన గాలీబ్ గీతాలు అనువాదాన్ని అక్కినేనికి అంకితం ఇచ్చారు.
కరుణానిధి, యం.జి.ఆర్
2.
కరుణానిధి, యం.జి.ఆర్ లు కూడా మొదట్లొ మంచి మిత్రులేనట.
రాజ్ కపూర్ ముకేష్ లు చిరకాల మిత్రులు..ముకేష్ చనిపోతే రాజ్ కపూర్ నా ఆత్మ చచ్చి పోయిందని రోదించాడట.
నెహ్రూ, మొదటి తరం బాలీవుడ్ దర్శకుడు మహబూబ్ ఖాన్ – వీరిద్దరిదీ చెరో దారి రాజకీయ దృక్పథం.
మహబూబ్ వామపక్షీయుడు!
మదర్ ఇండియా, సన్ ఆఫ్ ఇండియా, అందాజ్ వంటి చిత్ర్రాలను నిర్మించాడు. ఐనా మహమూద్, నెహ్రూలు చాలా ఆప్త సన్నిహితులు. వారి వారి దృక్పథాలు వారి స్నేహానికి అడ్డంకి కాలేదు.
నెహ్రూ మరణానంతరం ఆ వార్త విని గుండెపోటుతో మహబూబ్ ఖాన్ కూడా మరణించాడు.
చాలా మంది అంటుంటారు, ఈరోజుల్లో స్నేహం ఎక్కడ వుంది? అని. అసలు కండీషనల్ స్నేహం ఎప్పటికైనా తెగిపోతుంది. అవసారార్థ స్నేహమూ ఎక్కువ కాలం నిలవదు. నమ్మకం లేని స్నేహమూ వుండదు.
అందుకే టి.యస్.ఎలియట్ పదివేల వాక్యాలతో రాసుకున్న ’వేస్ట్ ల్యాండ్’ ను తీసుకొని వెళ్ళి ఎజ్రా పౌండ్ చేతిలో పెడితే దాన్ని 470 వాక్యాలకు ఎడిట్ చేసాడు. దాన్నే ప్రచురించాడు ఎలియట్.
ఈ విషయంలో నేను అతిపెద్ద లక్కీ అలీని. చాలామంది ఆప్త మిత్రుల స్నేహం దొరికింది.
*****