1.
ఒకప్పుడు కవిత్వం గొప్పది అనేవారు.తర్వాత పద్య కవిత్వం గొప్పది అనేవారు.క్రమంగా వచన కవిత్వం గొప్పదా పద్యకవిత్వం గొప్పదా అని ప్రశ్నించేవారు. తర్వాతేమో వచన కవిత్వం గొప్పది అనేవారు. మరి రేపో?
మిత్రులారా! ఏమంటారు?
ఏది గొప్పది?
2.
గడచిన మంగళవారం….వొర్షం…బెంగళూరు…గాలి…వొక దుమారం!
ఆ మంగళ వారం రోజు నాకు వారాంతపు సెలవు. అలా ఇచ్చిన కంపెనీ వాళ్ళకు కృతజ్ఞతలు.
తీరుబడిగా టీవీ చూస్తున్నా. చిన్నస్వామి స్టేడియం కనబడుతోంది. అప్పుడే వర్షం వెలిసింది.
కానీ మరో వర్షం మొదలయింది. రెండో వర్షానికి తోడునిచ్చింది ఓ సుడి “గేల్” తోడు. అసలు పేరు క్రిస్ గేల్.
************
బెంగళూర్ మంగళ వారానికి రుణపడ్డాను.
కేవలం 65 బంతుల్లో 175 పరుగులు. 17 సిక్సులు. 13 ఫోర్లు .
గేల్ బ్యటింగ్ విన్యాసానికి ప్రేక్షకులు ఫీల్డర్లు గాను, ఫీల్డర్లు ప్రేక్షకులు గానూ మారారు.అనేక సార్లు బంతి మైదానం దాటిపోయింది. తాగిన వాడీకి తాగిన మత్తు గిదింది. తాగని వాడికి తాగని మత్తు ఎక్కింది.గేల్ ఆట చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. అందుకే అతన్ని మా బెంగళూరు వాళ్ళు గేల్ స్ట్రోం, గేల్ ఫోర్స్, మాష్టర్ స్ట్రోం అని ముద్దుగా పిలుచుకుంటారు.
***********
6.3 అడుగుల ఈ తుఫాను గాలి గేల్ 21-09-1979 లో జమైకాలో పుట్టాడు. మన గురజాడ గారు పుట్టిందీ 21/9 యే. మెలొడీ క్వీన్ పుట్టిందీ అదే తారీఖు. మీకు కోపం రాదంటె … నా పుట్టిన రోజోఓ 21/9.
3.
మా ఆవిడ బలవంతగంగా ఈ మధ్య ఓ సినిమా చూపెట్టెంది. అయిష్టంగానే చూడటం మొదలుపెట్టాను, గానీ క్రమంగా సినిమా చాలా సీరియస్ గా నన్ను ఆకర్షించింది. నగెష్ కుకునూర్ దర్షకుడు. సినిమా పేరు “డోర్“. 2006 లొ రిలీజ్ అయింది. ఆయెషా టకియా, గుల్ పనాగ్, గిరీష్ కర్నాడ్, శ్రేయస్ తల్పాడె ఇందులో నటించిన ప్రముఖ నటులు.
సినిమాలో హింస లేదు, చెత్త పాటలు లేవు.మోటు సరసాలు లేవు. మానవీయ విలువలమీద కథనం ఈ సినిమా. బైరూపి(నిజానికి బహురూపియ)గా శ్రేయస్ చాలా బాగా చేసాడు. నిజానికి ఆయెషా టకియా వంటీ గ్లామర్ డాల్ ఇంత బాగా నటించగలిగిందంటే నమ్మ బుద్ధి అవ్వడంలేదు. మంచి సినిమాలు రావడంలేదు అని బాధపడే వారికి చక్కటీ సినిమా ఇది. తప్పకుండా చూడండి.
Thank you so much Mr. Nagesh Kukunoor.
PS: Dear friends! one more good movie named “IQBAL” directed by Nagesh Kuknoor.