ప్రేమలు పలు రకాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొన్ని కంపెనీలు ఒక పెద్ద physical serverని అనేక logical సర్వర్లుగా partition చేసి ఒకే సెర్వర్ లోని అనేక logical servers ని విభిన్న customers కి అద్దెకి ఇస్తుంటారు. అటువంటప్పుడు Hyperviser అనే ఒక software వాడుతారు. తెలిసో తెలియకో ఇదే technique ని ఈరోజు మనం అనుసరిస్తున్నాం.

ఎలాగా అనంటారా?

అవసరార్ధం మనల్ని మనమే logical గా విభజించుకున్నాం. మన కాలాన్ని మనమే ఒక అత్యాధునికానంతర టైం టేబుల్ వేసుకొన్నాం. మనలో మనమే అనేక అరల్ని సృష్టించుకున్నాం. మన ప్రేమల్ని కూడా విడదీసుకొన్నం కదా! ముందు దేవుడికి కొంత భాగం, డబ్బుకి కొంత భాగం, సినిమాలకు, క్రికెట్ కు, భార్యకు, బిడ్డలకు, ప్రియురాలికి మన ప్రేమను పంచేసాము. ఒక జోన్ లోని విషయాన్ని మరో జోన్ లోనికి జొరనివ్వము. చాలా రహస్యంగా మన రహస్యాలను రచించుకొంటాం. అన్ని విభాగాల్లొనూ చాలా ఉదారంగా ఉంటాం. కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి చాలా పిసినారులమౌతాం!

జీవిక కోసం ఊరు/రాష్ట్రం/దేశం విడిచి వెళ్ళక తప్పదు. కానీ ఊళ్ళలోని అమ్మానాన్నల కోసం మనలో ఎంత స్పేస్ ఇచ్చాం? ఇస్తున్నాం? ఇవ్వగలం? కనీసం రోజుకి ఒకసారి ఫోన్ చేసి పలకరించి “అమ్మా ఏం వండుకున్నావు?”.  “నాన్నా మందులు వేసుకున్నావా?” అని అడుగుతే వాళ్ళకు చివరిదశలో జీవితం పట్ల మమకారం పెరుగుతుంది. వాళ్ళు అడగకముందే వారి ప్రీపెయిడ్ మొబైల్ లో వంద రూపాయల కరెన్సీ వేసినట్టు చెబితే వెయ్యిరెట్ల ఆనందం పొందుతారు.

కొన్ని చిన్నచిన్న పలకరింపులు సైతం ముసలితనంలో గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది. లేకపోతే మన వేమన గారు చెప్పినట్లు… ’

తల్లిదండ్రుల మీద దయ లేని పుత్రుడు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా

విశ్వదాభిరామ వినుర వేమ!

  • మిత్రులారా! యస్.జానకి గారు ఒక తెలుగు సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అదే సినిమాకు ఎస్పీ బాలు సహాయ సంగీత దర్శకుడు. ఆ సినిమా పేరు ఏమిటి?
  • హిందీ వ్యతిరేకి కరుణానిధి ఒక హిందీ సినిమాలో నటించారు. అదే సినిమాలో జెమినీ, కిషొర్, మీనాకుమారి, జమున హీరో హీరోయిన్లు. ఆ సినిమాయేదో చెప్పండి!


ఒకసారి రష్యా అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నాడు. భారత రహదారులపై ప్రయాణిస్తుండగా ఒకచోత రోడ్డు పక్కన నిలబడి ’ఈల’ (విజిల్ కాదు మరొకటి) వేస్తుండగా చూసిన రష్యనుడు మన ప్రధానితో “ప్రధానీజీ! ఇదే మా దేశం లో అయితే అతన్ని శిక్షించే వాళ్ళం” అని అన్నాడు. భారత ప్రధాని గారు చిరునవ్వు నవ్వు ఊరకున్నారు.

కొంతకాలం తర్వాత మన ప్రధాని రష్యాను సందర్శించే సమయాన ఒకే పనిగా రో్డ్డు పక్కన చూడడం మొదలుపెట్టారు. ఎలాగైతేనేమి చివరికి ఒక చోట ఒక పెద్ద మనిషి దారి పక్కన హాయిగా నిలబడి ’ఈల’ వేస్తుండం కనబడించి. దాన్ని చూపించి పక్కనే ఉన్న రష్యా అధినేతను దెప్పిపొడిచారు. రష్యా అధినేత తన సైనికులను పిలిపించి వాణ్ణి పట్టుకొని రమ్మని ఆర్డర్ వేసాడు. 

అలా పట్టుకొని రాబడిన ఆ ’ఈల’ పెద్దమనిషి యొక్క పుట్టు పూర్వోత్తరాల్ని పరీక్షించి చూడగా ఇండియన్ తేలింది. మన ప్రధాని గారు కళ్ళు తేలవేయడమూ అయిందని చాన్నాళ్ళ నుండీ ఒక రూమర్ ప్రచారం లో వుంది. 

రూమరో, హ్యామరో, ఏదియేమైనా “రోమ్‍లో కూడా నేను భారతీయుడిగానే ఉంటాను.” అన్న నేతాజీ మాటల్ని ఇలాంటివాళ్ళు అవహేళన చేస్తున్నట్టుగా అనిపించడంలేదూ!

Your views are valuable to us!