రెండు దేవుడి సినిమాలు

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

1. పాకిస్తానీ సినిమా – ఖుదా కేలియేKhuda kay liye

ఇది 2007 లో విడుదలైన సినిమా. షోయబ్ మన్సూర్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించాడు. సినిమాలో అత్యధి భాగం షికాగోలోను, మిగిలిన భాగం కరాచీలోనూ చిత్రీకరించారు.

9/11 తర్వాత జరిగిన పరిణామాల తర్వాత, దాని నేపథ్యంలో ఈ సినిమాను చూపించే ప్రయత్నంలో దర్శకుడు ప్రతిభ కనబర్చాడు. ముస్లిం సమాజాన్ని పాశ్చాత్యులు ఎలా చూస్తారు, మోడరేట్ ముస్లింల ఇస్లాం, ఛాందస ముస్లింల ఇస్లాం ఇత్యాది కోణాలను వాస్తవానికి దగ్గరగా చూపించాడు దర్శకుడు. కాకపోతే, ఈ సినిమాలో ఎంటర్టైన్‍మెంట్ లేదు.  అయితే సున్నితమైన సీరియస్ విషయాలను తనకున్న పరిమితుల్లో ఒక మంచి, మసాలులేని సినిమా ఇది. కవిత్వం, సంగీతం ఇష్టపడేవారు ఈ సినిమానూ ఇష్టపడతారు. కాకపోతే మొదటిసారి కంటే రెండోసారి సినిమా బాగా అర్థమౌతుంది.


2. ఓ మైగాడ్ (OMG)

OMGఇది మన కొత్త సినిమా!

పరేశ్ రావల్ హీరో, అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలు వేసారు. పక్కా మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా ఉండే మంచి ఎంటర్టైనింగ్ మూవీ ఇది. దేవుడి పేరు మీద జరిగే వ్యాపారాలను అపహాస్యం చేస్తూ, హాస్యంతో నింపిన సినిమా ఇది.

ఇప్పుడు మంచి సినిమాలు రావడం లేదని బాధపడేవారికి ’ఖుదా కేలియే’, ’OMG’ వంటి సినిమాలు మంచి బహుమానాలు. ఇలాంటి చక్కటి సినిమాలు తీసే మహానుభావులు ఇంకా వున్నారు. మంచి పాటలు రాసేవారూ వున్నారు. అలాగే సంగీతకారులు, గాయనీగాయకులు వున్నారు. కానీ మంచి ప్రేక్షకులు, శ్రోతలు వున్నారా అని అనుమానం.

మనం చూడకపోతే వాళ్ళు చెత్త సినిమాలు తీయడానికి ధైర్యం చేస్తారా??



Your views are valuable to us!