బిమల్ రాయ్ పెద్ద దర్శకుడు. అతను అడిగితే “నేను పాడ”నని ఏ గాయకుడూ అనేవాడు కాడు. ఆయన “సుజాత” అనే సినిమాను తీసారు. నూతన్, సునిల్ దత్, శశికళ, తరుణ్ బోస్, అసిత్ సేత్, లలితా పవార్ అందులోని నటీనటులు. ఎస్.డి. బర్మన్ సంగీతం. “సున్ మేరీ బన్దూరే” అనే పాట సూపర్ హిట్. ఈ పాట గాక మరో ఆరుపాటలున్నాయి. వాటిలో “జల్తే హై జిస్కే లియే” అనేది మంచిపాట. తలత్ మొహముద్ ఆ పాట పాడాడు. సునిల్ దత్, నూతన్‍ల పై చిత్రీకరించబడింది.
తన పాటను సునిల్ దత్ పై చిత్రీకరించడం తలత్ కు ఇష్టం లేదు. తలత్ పాట లేకుండా సినిమాను రిలీజ్ చేయడం బిమల్ రాయ్‍కు ఇష్టం లేదు. ఈ కారణం చేత 1959లో పూర్తైన ఈ సినిమా 1960 వరకూ విడుదల కాలేదు. దాదాపు ఆరు నెలలు ఆగిపోయింది. ఆ తర్వాత దిలీప్ కుమార్ జోక్యంతో తలత్ మెత్తబడినట్టు చెబుతాయి బాలీవుడ్ వర్గాలు. ఇలా ఓ పాట కారణంగా ఆరు నెలల పాటు సినిమా విడుదల కాకపోవడం. బహుశా ఇదే మొదటి మరియు ఆఖరి సారి కావొచ్చు!!
* * * * * * *
“అవున”నే చెప్పారు అతని తల్లిదండ్రులు.
ఆరోజుల్లో కె.ఎల్. సైగల్ నటించిన ’షాజహాన్’ చిత్రం అవిభక్త భారతంను ఒక ఊపు ఊపుతోంది. దానికి కారణం ఆ సినిమా సంగీతం మరియు సాహిత్యం. మరీ ముఖ్యంగా “జబ్ దిల్ హీ టూట్ గయా” అనే పాట. మన నౌషాద్‍జీనే! అప్పటికి అతను వయసు 22 యేళ్ళు.
అప్పట్లో సినిమావాళ్లంటే చిన్నచూపుండేది. నౌషాద్ తల్లిదండ్రులు ఒకమ్మాయితో సంబంధం ఖాయం చేసుకున్నారు. అబ్బాయి ఉద్యోగం గురించి మాత్రం అబద్ధం చెప్పారు. “మా నౌషాద్ బాంబేలో దర్జీ పని చేస్తున్నాడని” అని బుకాయించేసారు వారు. దానికి కారణం సినిమావాళ్ళంటే సంఘంలో తక్కువ చేసి చూడ్డమే!
ఇదే కాకుండా మరో చిత్రం కూడా జరిగింది. నౌషాద్ పెళ్ళికి ఆయన సంగీత దర్శకత్వం వహించిన ’షాజహాన్’ పాటల్ని వేసారట. ఆ పాటల్ని విన్న కాబోయే మామగారు సినిమావాళ్ళపై తిట్లకు లంకించుకున్నారట.
పై విషయాల్ని స్వయానా నౌషాద్‍గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొన్నారు.