వర్షాకాంక్ష

వాన వెలిసిన తరువాతి స్వచ్చతలా మనసు అపుడపుడూ లలితంగా మారుతుంది. భానుడి కిరణాలలోని ధూళి కణాలుగా భయం, రాగం, ద్వేషం మళ్ళీ మనసును కలుషితం చేస్తే  మళ్ళీ వచ్చే వర్షం కోసం ఎదురు చూసే లతలా మనసు నీ మృదు భాషణ…

అపురూపం

మబ్బువెండి రంగుల పాటల్నేవో చల్లుతో పోతోంది కోకిలవొంటరి పాటని వొకే స్వరంలో పాడుతోంది పువ్వువుత్తరపు గాలిలో కదులుతోంది సాలీడునిశ్శబ్దపు గూడు కట్టుతోంది ఆకాశందాచిపెట్టిన లంకెబిందె మెరుస్తోంది ఈ యింద్రధనుస్సునిభద్రంగా దాచుకొని కాపాడుకోవాలి

రెండేసి పూలు…

అలా వొక కిటికీ రెక్క ఓరగా తెరిచి వుంచి శబ్దాన్నీ, నిశ్శబ్దాన్నీ విను ఆకాశంలో మేడ కట్టుకున్నా, నువ్వుండేది ఓ మురికి మూల గది అయినా.   ఇవాళో రేపో ఇప్పుడో అప్పుడో అటు వెళ్ళే వొక గాలి తరగని కాసేపు…

నిష్ఫల జీవితం

నీళ్ళు నిండిన గుంతలాలోతెరుగని మనసుతోయెన్నాళ్ళిల్లా బతికేది? చెప్పాపెట్టకుండా కురిసే వాననుగుప్పిట్లో బంధించాలనే వో జీవితకాలపు వాంఛనిరెప్పలకి అంటించి తిరిగినాఫలించని ఆశ. ఎన్నిసార్లు దాటినా అదే మైలురాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటుంది ఉసూరుమనే ప్రాణాలు ఆ పక్కనే వున్న చెరువులో బుడగల్లా…

ఈ ఎడారిలోనూ ….

ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెలఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా గడిచిపోయి బ్రతికొచ్చే గతకాలపు సౌఖ్యంలా జలతారుల చిరు కదలికలో మెరుపు పూల మాలికలా ఏకాంతపు రాత్రికి జలపాతం అలికిడిలా చల్లగాలి వీవెనలా మల్లెపూల గమకంలా   ఈ ఎడారిలోనూ…

నల్లమబ్బులు

ఆషాఢం వలువల్లోఆకాశం హొయలుపోతూనల్లటి సమ్మోహనాస్త్రాలుసంధిస్తూంటుంది. గుండె లోతుల్లో ఎండిపోయాయనుకున్న భావాల విత్తులు క్షణాల్లో మొలకెత్తికన్నుల్లో విరబూసి నింగి ఒంపుల్లో ప్రతిబింబిస్తూంటాయ్     గ్రీష్మం నిర్మించిన నిర్లిప్తపు ఆనకట్ట తెంచుకునిపరవళ్ళు తొక్కుతున్న  దాహపు సెగల మధ్యఒక్క భావాన్నైనా ఘనీభవించాలనిఆకాశమంత దోసిలి పట్టుకునిమనసు తెల్లకాగితమై…

విహ్వలత

ఒకానొక ఆత్మన్యూనతా శూన్య స్వర్గంలోస్వప్నలోలాక్షి మనోగవాక్షం పైపక్షిలా వాలుతుంది మనసు. దీర్ఘస్మృతుల సచిత్రమాలికలో అక్కడక్కడా చిక్కుకొన్ననిర్గంధ కుసుమాల మృతకళేబరాలతోమర్మభాషణం చేస్తుంది మనసు. వధ్యశిలపై వంచబడ్డ శిరస్సునిస్సహాయ నిగూఢ రోదనలోంచిచటుక్కున్న రాలిపడ్డ బాష్పకణజాలాల్లోఈదులాడుతుంది మనసు. అధో జగతి అనంత జీవన పథ సంచలనాలతోకూడి,…

మనసుకూ ఆరు ఋతువులు

మనసుకూ ఉన్నాయి సమయ సందర్భంగా ఆవిష్కరించుకునే ఋతువులు ఎక్కడో అదృశ్యంగా  అంతరాంతరాళాల్లో . సన్నని చారల్లా తలలెత్తిన సస్య శ్యామలత పుష్పక విమానాల్లో పూల సొబగులనూ పుప్పొడి రాగాలను రంగుల తుళ్ళింతలనూ నిలువెల్ల పరచుకునే ఘడియలు మళ్ళీ మళ్ళీ మరలి వస్తూనే…

నిన్న రాత్రి

నిన్నరాత్రి వెన్నెలలా మంచుపూల స్వప్నాలు ఎద వాకిట రాలి పడే పరిమళాల పుప్పొడులు ఏకాంతపు వీధులలో ఏనాటివి జ్ఞాపకాలు అడుగడుగున వినిపించే సరాగాల సవ్వడులు ……… అటు ఇటూ ఊయలూగు తలిరాకుల తపనలో ఒదిగి ఒదిగి ప్రవహించే  వలపుల చమరింపులో ఆవిరయే…

ఆశ-బెంగ

  వాన వెలిసింది తలపు తడిసింది తోడు నీడై ఈడు జొడై జీవితాంతం కలసి ఉండే మగడు దొరుకుతాడో లేడోనని పెదవి అదిరింది మనసు బెదిరింది   దుర్భాషలు దూషణలు దురాగతాలు దుర్బుద్ధులు వంచనలు దండనలు మద్యం మత్తులో మగాళ్ళు చేసే…