ఆల్మండ్స్ బాయ్

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4]

 

మాలతీ చందూర్

ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ రైలు బోగీలో తమకు జరిగిన ఓ అనుభవాన్ని గ్రంథస్థం చేసారు.

మాలతీ చందూర్, బెజవాడ గోపాల రెడ్డి ప్రభృతులు ప్రయాణిస్తూన్నారు. రైలు ఏలూరు దాటింది. సైడు బెర్తులో ఒక స్త్రీ, తన మూడేళ్ళ కొడుకుతో కూర్చుని ఉన్నది.

ఆమె తన కుమారునికి ఆల్మండ్సును తినడానికి ఇవ్వసాగింది. తల్లి తన చేతికి ఇచ్చిన ఆల్మండ్సులలో ఒకటి గోపాల రెడ్డి గారికీ, ఒకటి చందూర్‍కు ఇచ్చి,  ఒకటి తను తినేవాడు.

ఇలాగ రెండు మూడు సార్లు జరిగినది.

 పరిచయాలూ, పలకరింపులలో ఆ పిల్లవాడి అమ్మ కొన్ని వివరాలు మాలతికి జ్ఞాపకం ఉండి పోయాయి.

“మా బాబు పేరు పృథ్వి.”

“పృథ్వి స్త్రీ లింగము. అందుకని పృథ్వీ కుమార్….పృథ్వీ పుత్ర – ఇలాగ పృథ్వికి మరో పదాన్ని జోడించాలి.”అన్నారు బెజవాడ గోపాల రెడ్డి.

ఆమె “పృథ్వీ చక్రవర్తి అండీ.” అని అంది.

అందుకు జవాబుగా “వెరీ గుడ్! బావున్నది”అన్నారు గోపాల రెడ్డి గారు.

ఆ తర్వాత కబుర్లలో తెలిసినది, ఆమె రామదాసు మోటార్స్ చౌదరి మనుమరాలు అనీ, ఆ బాలుడు మూవీ ఆర్టిస్టు ఐన త్రివిక్రమ రావు కుమారుడు అనీ.

*****

కొన్ని సంవత్సరాల తర్వాత “డ్రైవర్ మామ” సినిమాలోని హీరో గా ఉన్న పృథ్వీ చక్రవర్తి తటస్థ పడ్డాడు. గడ్డం పెంచడము వలన చందూరు గుర్తు పట్టలేక పోయారు.

కానీ ఆమెను పృథ్వీ చక్రవర్తియే గుర్తు పట్టి, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఆనాటి ఆల్మండ్సు బాయ్ పృథ్వీ చక్రవర్తియే ప్రముఖ సినీ నటుడు “కళ్యాణ చక్రవర్తి“.

 

Your views are valuable to us!