రాజ్ కుమార్, వహీదా ప్రభృతులు నటించిన మూవీ, షత్రంజ్ ( Shatranj ) 1969 లలో విడుదల ఐనది. ఎస్.వాసన్ దర్శకత్వంలో 1969 లో వచ్చిన హిందీ చలనచిత్రం “షత్రంజ్”. ఈ సినిమాలో ఒక పాట ఉన్నది. ఆ పాటకు చెప్పుకోదగిన అనేక విశేషాలు ఉన్నవి. ఈ హిందీ మూవీలో తెలుగు పదాల అల్లరి చిలిపి పాట ఉన్నది. మహమూద్, హెలెన్ ల జోడీ ఈ పాటకు డ్యాన్సు చేసారు.
“బతుకమ్మ! బతుకమ్మ!బతుకమ్మ!
ఎక్కడ పోతావ్ రా?ఎక్కడ పోతావ్ రా?
ఇక్కడ్ ఇక్కడ్ రా! ……… ”
గలగలా సాగే ఈ గీతంకు మహమూద్, హెలెన్ చేసిన డాన్సు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అసలు సంగతి ఏమిటంటే – ఈ గీతిక పల్లవిలోని మొదటి పదాలు (తెలుగు మాటలు) విరివిగా మనకు కిత కితలు పెడతూంటవి. అదీ విశేషమన్న మాట.
హెలెనీయ బ్రేక్ డాన్సు సరదా సరదాగా క్లబ్ లో సాగుతుంది. ఎంకన్న (= వెంకన్న), బత్కమ్మ- లుగా వెండి తెర పైన నర్తించినారు.
మరో ముచ్చట:- ఈ గీత గాయని “శారద”. ఈమె – అనేక పురస్కారాలను అందుకున్నది. “జీవిత చక్రం” cinema లోని (ఎన్.టి. రామా రావు, వాణిశ్రీ తారాగణం)
“కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగ మనసులో మాట ఓ బావా…”
అనే పాటను శారద గానం చేసింది.