దేవులపల్లి పాటకు రెండు గాత్రాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

‘ఉండమ్మా బొట్టు పెడతా’ సినిమా 1968లో విడుదలైన మంచి చిత్రం. ఈ సినిమాలో కృష్ణ, జమున, జానకి, నాగభూషణం, ధూళిపాళ, ఇత్యాది తారాగణం ఉన్నారు. సంఘానికి  పునాది కుటుంబమే కనుక కుటుంబీకులు అందరూ క్రమశిక్షణతో, ఏకతాటిపై నడవాలి; సామరస్యంగా, సౌభ్రాతృత్వ, అనురాగాలకు అగ్రాసనం ఇవ్వాలి; నీతి నియమాలకు జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యత పూలదండలో దారమువలె అంతర్లీనంగా ఉండేటట్లుగా వెండి తెరపై జరిగిన చిత్రీకరణ, దర్శకుని ఉత్తమ అభిరుచికి, ప్రతిభకు అద్దం పడుతున్నది.

ఆ చలనచిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాట 

“చాలులే. జాబిలి కూనా!
ఆ కలువ రేకుల కన్నులలో
తుమ్మెద లాడేనా?
ఆ సోగ కనుల రెక్కలలో 
తూనీగ లాడేనా?”

ఈ గీతాన్ని మొదట పి.సుశీల పాడారు. కానీ ఆ పాటకు జానకి చేత గానం చేయిస్తే, ఇంకా బావుంటుందని అనుకున్నారు. మర్నాడే ఎస్. జానకిని పిలిచారు. ఎస్.జానకి గాత్ర మాధుర్యంతో ఆ పాట మరింత వీనుల విందుగ తయారైనది.

“భావ కవీంద్రా! క్రిష్ణశాస్త్రి గారూ! మీ గేయానికి ఇద్దరి గొంతులు అవసరం అయ్యాయి కదండీ!” అన్నారు “వెంటనే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక పేపరుపై గబగబా ఏదో వ్రాసారు (కారణం – ఆయన అప్పటికే మూగవారు అయ్యారు). ఆ భావకవి కలం కాగితంపై చిలికిన ముత్యాలు ఇవిగో !….

“ఒక మూగపాటకు ఎన్ని మంచి గొంతులు!“ 

సున్నిత మనస్కులైన కవుల వేదనకు కూడా సుందర అక్షరమాలా పుష్పాలుగా విరబూస్తూంటాయి కదా!

“శిధిలాలయమ్ములో శివుడు లేడోయీ!
ప్రాంగణమ్మున గంట మోగ లేదోయీ!!!…..”

ఈ లలితగీతములోని లాలిత్యాన్ని వర్ణించడానికి ఎన్ని వివరణలు సరిపోతాయి?

 

Your views are valuable to us!