కాకులతో ఇంటీరియర్స్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

Kishore Kumarఅలనాటి ప్రముఖ హిందీ నేపధ్య గాయకుడు కిషోర్ కుమార్ వింత చేష్టలకు పెట్టింది పేరు.

ఓసారి ఇంటీరియర్ డిజైనర్ ఒకడు “నన్ను మీ ఇంటి డెకొరేటర్గా అపాయింట్ చేసుకోండీ” అని కిషోర్ కుమార్ వెంటబడి వేధించేవాడు.

ఎంతకాలమైనా కిషోర్ ఆ పని చేయకపోవడంతో ఆ డిజైనర్ కిషోర్ అన్న అశోక్ కుమార్ ను కలిసి రెకమెండేషన్ లెటర్ తీసుకొచ్చాడు.

అన్నగారి మాటను కొట్టిపారెయ్యలేక ఆ డిజైనర్ ను తన ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రతి గదీ చూపించాడు కిషోర్. చివరగా తన మాస్టర్ బెడ్రూం కు తీసుకువచ్చి “ఈ గదిని చచ్చిన కాకుల్తో డెకొరేట్ చెయ్యండి.” అన్నాడు.

దాంతో భయపడిన ఆ డిజైనర్ “బ్రతుకు జీవుడా!” అని బైటపడి మరింకెప్పుడూ కిషోర్ ను కాంటాక్ట్ చెయ్యలేదు.

నిజానికి కిషోర్ కుమార్ కు ఇష్టమైన పక్షి కావ్ కావ్ కినే!

Your views are valuable to us!