లొట్టలేయించే పాటలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

తెలుగువారికి భోజన రుచులు మెండు. “ఒడయ నంబి విలాసము” లో ఆంధ్ర దేశములోని  అందచందాలతో పాటు, షడ్రసోఏత భోజనాలలోని, రకరకాల పదార్థాలనూ, సాదకాలనూ, పిండివంటలనూ వివరించిన ఈ పద్యాన్ని చదివేస్తారా!?

“క్రొత్త బియ్యము, కాయగూరల్ బొబ్బట్లు-
దంపు బూరెలు, పంచదార,
యావ; వడలు  నల్లంబు, మీగడలు,
తియ్యని పెర్గు| కమ్మని సిరి వాలు గసగసాలు|

చిఱు సెన పప్పును తఱచు వీడ్యంబులు|
కంబళ్ళు, నంబళ్ళు, కంచుకములు|
ఇంగువ, జీలకర్ర నెనసిన మిరియంబు|
మదము వాసన నెయ్యి- మాట దురుసు| లనుచు-
సిరుల చెలగ నయ్యాంధ్ర| దేశంబు చెలువు గాంచి.

చిఱు సెనగపప్పు, నూనెయు|
గరము తీపైన పెరుగు, కడు సైదముతో|
దొరసిన ఖజ్జము లల్లము|
గురుతరముగ గుడించి రపుడు ఘూర్జరభూమిన్||” (ఒడయ నంబి విలాసము నుంి)

గుజరాత్ లోని “ఖర్జూరముల వాడుక” కూడా ప్రస్తావనలోనికి వచ్చినది.

“భోజనమ్ దేహి రాజన్!; ఘృత సూప సమన్వితం:
శరత్ చంద్ర చంద్రికా ధవళం చ!”


ఇలాటి శ్లోక, పద్య, కావ్య రచనలెన్నో,  పురాతన కాలము నుండీ మన దేశంలోని ప్రజలకు అనేక వంటలను వండుకోవడము- చేతనైన సంగతికి ప్రత్యక్ష ఉదాహరణలు!

ఈ ’భళారె భోజనా’ల సాహిత్యం కేవలం కావ్యాలు, పద్యాల్లోనే కాకుండా సినిమా గీతాల్లో సైతం విరివిగా దొరుకుతుంది. ఈమాట అనగానే మీ మనసుల్లో ఏ పాట టక్కున స్ఫురించిందో చెప్పనా? – “వివాహభోజనంబు”….కదూ!
ఈ సుప్రసిద్ధ గీతములో పింగళి వారి కలము వేసిన చిందులు, వివరించిన తెనుగువాళ్ళ అచ్చమైన ఆహారపదార్ధాల పట్టిక మొదలైనవి అబ్బో నోటిలో లాలాజలాన్ని జలపాతములా దూకిస్తాయి కదూ!

ఈరోజు వెరైటీకని ఈ భోజనగీతపు తమిళు వెర్షన్ చూద్దామా!




అహ్హహ్హహహ్హహ్హహ్హా.
అహ్హహ్హహహ్హహ్హహ్హా
అహ్హహ్హహహ్హహా…….. .  

కల్యణ సమయల్ సాదం అహహహహ
కల్యణ సమయల్ సాదం
కాయ్ కరిగళుం ప్రమాధం
అంద కౌరవ ప్రసాదం
ఇదువే ఎన్నక్కు పోదుం
కల్యణ సమయల్ సాదం
కాయ్ కరిగళుం ప్రమాధం
అంద కౌరవ ప్రసాదం
ఇదువే ఎన్నక్కు పోదుం    
అహ్హహహహహహ…


అందార బజ్జి అంగే
సున్సార సొజ్జి ఎంగే
అందార బజ్జి అంగే
సున్సార సొజ్జి ఎంగే
సందోషం మీరి పోంగ
అహ్హహహహహహ
ఇదువే ఎన్నక్కు తింగె
కల్యణ సమయల్ సాదం
కాయ్ కరిగళుం ప్రమాదం
అంద కౌరవ ప్రసాదం
ఇదువే ఎన్నక్కు పోదుం   
అహ్హహహహహహ….  

పుళియొతదరయిన్ సోరు
వెగు పొరుతమాయ్ సాంబారు
పుళియొథరైయిన్ సోరు
వెగు పొరుథమాయ్ సంబారు
పురి కిళంఘు పారు   
అహ్హహహహహహ  
ఇదువే ఎన్నక్కు జోరు
కల్యణ సమయల్ సాదం
కాఇ కరిగళుం ప్రమాదం
అంద కౌరవ ప్రసాదం
ఇధ్వే ఎన్నక్కు పోధుం   
అహ్హహహహహహ….


చూశారా! తమిళంలో కూడా అంత్యప్రాసల్ని ఎలా పొందించారో! పింగళివారి కలం మహిమ అలాంటిదన్న మాట.

మాయా బజారు విపణివీధులలో ఇన్నిన్ని వంటకాలను చూసాము కదా! మరి దీపావళి పండుగ సందర్భము ఇది. ఈ ఐదు రోజులూ ఇలాంటి ప్రాచీన ఆంధ్ర అభిరుచులను లొట్టలు వేసుకుంటూ తినాలి కదా!

ఆధునిక వనితలకు ఆట్టే ఇబ్బంది లేదు లెండి! ఓపిక ఉంటే బొబ్బట్లు, సొజ్జప్పాలు ఎట్సెట్రాలను గృహములోని రసోయీ ఘర్ లో గరిట తిప్పండి, కాకుంటే ఇంచక్కా “స్వగృహ ఫుడ్స్ సెంటర్” లలో కొనేసి, అందరితో కలిసి కూర్చుని, రుచులను ఆస్వాదించండి.


Your views are valuable to us!