మొగల్ ఎ ఆజమ్ కు అరవైయేళ్ళు

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.3]

1.
గత 100 సంవత్సరాల హిందీ సినిమాల్లో బెస్ట్ 10 చెప్పండి అన్నప్పుడు తప్పనిసరిగా మొగల్ ఎ ఆజమ్ , ప్యాసా, నవరంగ్, మదర్ ఇండియ లు ఉంటాయి.
మొగల్ ఎ ఆజమ్ లో పాపాజి (పృధ్విరాజ్ కపూర్), దిలీప్ కుమార్, మధుబాల, దుర్గా ఖోటే ఇంకా ఎంతమంది గొప్ప కళాకారులు ఉన్నప్పటికీ ఇది దర్శకుడు కె.ఆసిఫ్ సినిమా.
2.
అనార్కలి కు సంబందించి 1922 లో రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి. సయ్యద్ ఇంతీజ్ అలి తాజ్ ప్రముఖ ఉర్దూ నాటక రచయిత. లాహోర్ నివాసి. 1922 లో తన ఫిక్షన్ అనార్కలి ని ముద్రించాడు.
1922 లోనే ఒక ఉన్మాద కళా దర్శకుడు కె. ఆసిఫ్ జన్మించాడు.
3.
అనార్కలి ఆధారంగా కె.ఆసిఫ్ దేశ విభజనకు ముందే నర్గిస్ కథానాయికిగా మొగల్ ఎ ఆజమ్ ను మొదలుపెట్టాడు. దేశ విభజనతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. స్వతంత్రదేశం లో తను కథను కొన్నిమార్పులతో ఈసారి కొత్త కళాకారులతో రెండొసారి మళ్ళీ మొదలుపెట్టాడు.
4.
సినిమా మొదలు పెట్టేనాటికి ఆసిఫ్ ఆర్థిక పరిస్థితి ఏమిటంటే తను తాగే సిగిరెట్ల కోసం కూడా అప్పు చేసేవాడు. ఆ రోజుల్లో ఒక సినమా నిర్మాణం 5 లక్షలు. అట్లాంటిది మొగల్ ఎ ఆజమ్ నిర్మాణం కోసం అక్షరాలా 6 కోట్లు ఖర్చుపెట్టాడు. మరి తన దెగ్గర ఒక్క పైసా లేదు కదా! 6 కోట్లు ఎక్కడివి? అని అనుమానం రావొచ్చు.
ఆసిఫ్ చక్కటి స్టొరీటెల్లర్. ఎదుటి వారిని తన కథనం తో ఆకర్షించగలడు.
షాపూర్జి మంచి వ్యాపారవేత్త. ధనవంతుడు. కానీ, అతనికీ సినిమాలతో కానీ ఇతర కళలతో గానీ ఎటువంటి సంబంధం లేదు. అటువంటి షాపూర్జి గారిని తన సినిమా గురించి చెప్పి ఫైనాన్సర్ గా ఒప్పించాడు ఆసిఫ్ మహాశయుడు.
మొహమ్మద్ రఫి,లతా దీదీ వంటి వారు ఒక పాటకు 100-150 తీసుకొనే రోజుల్లో ఉస్తాద్ బడే గులాం అలి ఖాన్ గారికి 25,000 రూపాయలనిచ్చి ఒక పాటను పాడించారు. “ప్యార్ కియాతో డర్నా క్యా…” పాట కోసం సెట్టింగ్ లో ఉపయోగించిన అద్దాలను ముందు ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. సరీగ్గా లేవని వాటిని తీసేసి ఈసారి బెల్జియం నుండి తెప్పించారు. సినిమా నిర్మాణానికి 13 సంవత్సరాలు పట్టింది.
“కేవలం షూటింగే 6 సంవత్సరాలు పట్టిం”దని దిలీప్ కుమార్ వ్యాఖ్య.
సినిమా నిర్మించే అన్ని దేశాలనించి దర్శక -నిర్మాతలు వచ్చి సెట్టింగ్స్ ను చూసి ఆసిఫ్ పనితనాన్ని పొగిడి వెళ్ళేవారట. ఈ సినిమా లో సెట్టింగ్స్ , పాటల తర్వాత డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. కమాల్ అమ్రోహి తో కలిసి జీనత్ అమాన్ తండ్రి అమాన్ రాసారు.
ఈ సినిమా షూటింగ్ రోజులనాటికి దిలీప్ కుమార్ – మధుబాల ల మధ్యల మాటలు లెవ్వు. దిలీప్ కుమార్ – కే.ఆసిఫ్ ల మధ్య కూడా సత్సంబంధాలు లెవ్వు. దుర్గా ఖోటే అందరినీ ఒక తాటిపై తెచ్చే బాధ్యత తీసుకొన్నారు.
“మోహే పంఘట్ పె నందలాల్” అనే పాటలో ఉపయోగించిన కృష్ణుడి ప్రతిమ నిజంగానే బంగారంతో తయారు చేసినది. ఈ సినిమాలోని అనార్కలి, శిల్పి రెండు పాత్రలూ చరిత్రలో ఎక్కడా కనిపించవు. రెండూ కల్పితాలే.
షోలే సినిమాలో మెహబూబా మెహబూబా అనే పాటలో అభినయించిన జలాల్ ఖాన్ ఈ సినిమాలో బాల సలీం గా నటించాడు. ముందుగా ఈ పాత్రకోసం ఇప్పటి ప్రముఖ తబ్లా ఉస్తాద్ జాకిర్ హుస్సైన్ ను సంప్రదించారట.
ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి.మొత్తం చెప్పడానికి సుమారు 100 పేజీలు అవుతుంది. వీలు ఉన్నప్పుడల్లా ఇలా కొంచెం కొంచెం మీకోసం…

Your views are valuable to us!