ఆ చిన్న బాలుడు “విప్ర నారాయణ” సినిమాను చూసాడు. అప్పటి నుంచీ ”నేను విప్ర నారాయణుడ్ని చూడాలి, చూపించండి.” అంటూ అడగసాగాడు. ఒక షూటింగు జరుగుతూన్నది. ఆ సీనులలో అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నాడు. ఆ అబ్బాయిని అతని బంధువులు తీసుకుని వచ్చారు.
“ఇతనేరా నీ విప్ర నారాయణుడు; చూడరా చంటీ!” అన్నారు. అప్పుడు నాగేశ్వర్రావు ప్యాంటు, షర్టు ధరించి ఉన్నారు. ఫిల్లవాడి హృదయంలో అలనాడు తాను చూసిన యతి రూపమే ముద్రితమై ఉన్నది. “అరే! నామాలూ, పిలక లేవేంటీ!?” ఆశ్చర్యపడ్తూ అడిగేశాడు.
తనను భక్తుని రూపంలో కన్నులారా చూడాలనే అతని తహ తహకూ, ఉత్సుకతకూ హీరో నాగేశ్వర రావుకు ఎంతో ముచ్చట వేసింది. వెంటనే ఎత్తుకుని, చాలా సేపు తన ఒళ్ళోనే కూర్చో బెట్టేసుకున్నారు. “మీకు ఇబ్బందిగా ఉంటూన్నదేమో?” అని వాళ్ళు ఫీలౌతూ అన సాగారు. “ఫర్వాలేదండీ.” అంటూ ఆ అబ్బాయిని హత్తుకుని కూర్చో బెట్టుకున్నారు ఏఎన్నార్ గారు.
ఆ చిన్నవాడే “జంధ్యాల”. తరువాతి కాలంలో జంధ్యాల “అమర జీవి” సినిమా తీసారు. అందులో ‘విప్రనారాయణ’ ఘట్టాలను అంతర్నాటికగా ఉంచి, తన తీపి జ్ఞాపకములను సినీ ఆల్బం లో నిక్షిప్త పరుచుకో గలిగారు జంధ్యాల.
యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన అపురూపమైనది కదూ!
{youtube}j-gdwkZ0gVk{/youtube}{attachments}