హిమగిరి శ్రేణులు మకుటముగా
సుందర ప్రకృతి ప్రతీకగా
కుంకుమ పూత పరిమళ భరితమ్
నా కాశ్మీరం నా కాశ్మీరం
భరత మాత మకుటం
నా కాశ్మీరం నా కాశ్మీరం
భరతమాత గజ్జెల పదములు
మూడు సాగరముల లయ తాళములో
పచ్చని ప్రకృతి పరదాపై
నాట్యము సలిపే రాష్ట్రం
నా కేరళ రాష్ట్రం
త్రివేణి సంగమ తీర్థముగా
చరిత్రకెంతో ప్రసిధ్దిగా
రాముడు, కృష్ణుడు పుట్టిన రాష్ట్రం
రాజసాల నిలయం నా ఉత్తర దేశం
నా ఉత్తర ప్రదేశం
ప్రాచీన సౌంస్కృతి సంగమము
కళలకు నిలయం నా రాష్ట్రం
ఆది శంకరుని ఒడిలో నిడిన
దేవళముల రాష్ట్రం నా తమిళ నాడు
విశ్వ కవీంద్రుడు, సుభాష్ బోసు
ప్రసిధ్ద పురుషుల కన్నది బెంగాల్
సుందర వనములతో అలరారు
బెంగాల్ నా బెంగాల్
భరతమాత పచ్చని పయ్యెద
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
త్యాగయ్య గీతి, రాయల కీర్తి
ఖ్యాతిగన్న రాష్ట్రం
తెల్లవాని తుపాకి గుళ్ళకు
రొమ్మిచ్చిన అల్లూరిని కన్నది
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
భారతావనికి అన్నపూర్ణ
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
దేశ భక్తికి మాతృరక్షణకు
ప్రాశస్త్యం నా పంజాబ్
అమర వీరుడు భగత్ సింగుని
అర్పించిన నా పంజాబ్
పంచ నదులతో పునీతమైనది
పంజాబ్ నా పంజాబ్
తల్లి దాస్య విముక్తికి అసువులు బాసిన
మహాత్ముని కన్నది నా గుజరాత్
సబరమతి తీరంలొ ఈశ్వర్ అల్లా నాదంలా
ఘూర్ణిల్లిన నా గుజరాత్
ఘూర్ణిల్లిన నా గుజరాత్
మరుభూమిని మల్లెలు పూచిన రీతి
ఎడారిలో కళలను పెంచి
ప్రసిధ్ది చెందిన రాష్ట్రం
రాజస్థాన్ నా రాజస్థాన్
రాణీ పద్మిని, రాణా ప్రతాప్
శౌర్యానికి ఎనలేని రాష్ట్రం
రాజస్థాన్ నా రాజస్థాన్
మరాఠ కొదమ సింగముగా
వీరశివాజి వాసి కెక్కగా
వస్త్రోత్పత్తికి వరదానం
పూర్వ పశ్చిమల సంగమం
నా రాష్ట్రం మహరాష్ట్రం
చేయి చేయి కలిపి పాడుదాం
భరత మాతకు జయం జయం
భారత మాతకు జయం జయం
వేషం భాషా వేరే అయినా
జాతి మతము వేరైనా
అడుగు అడుగు కలిపి నడుద్దాం
ఏక కంఠమున పాడుదాం
ఏక కంఠమున పాడుదాం…..చేయి
ఆనందానికి ఆవేదనకు భాషతొ పనిలేదూ
భాషకు మూలం భావం కాదా
హావానికి యీ బేధమెందుకు …..చేయి
సత్యాహింసలె ధర్మముగా
నమ్మిన బాపూ మార్గములొ
భారత నవ నిర్మాత నెహ్రూ
కలలను సాకారము సేయుచును…..చేయి
భారత జాతి మా జాతి
ఐకమత్యమే మా మతమూ
మానవత్త్వమే మా ధనమూ
వేద్దాం ప్రగతికి సోపానం
వేద్దాం ప్రగతికి సోపానం…..చేయి
Super