Like-o-Meter
[Total: 0 Average: 0]
చుట్టూమూగినచిలకల్లారా!
చెట్టూచేమకుకథలేచెప్పి
వెంటనెవస్తారా?
మీరువెంటనెవస్తారా?
ఈమాపిల్లలవద్ద, మీరేసొంపగు; కథలునేర్చుకోండీ!
కంచికిపోవనికమ్మనిగమ్మత్తు; కథలనునేర్వండి ||
కొమ్మలవాలినకోయిలలారా!
చిగురుటాకులకుపాటలు నేర్పి,
వెంటనెవస్తారా?
మీరువెంటనెవస్తారా? ………..
ఈమాపిల్లలవద్ద, మీరేసొగసౌగానంనేర్వండి
మహతి, కచ్ఛపివీణలెరుగని; పాటలునేర్వండి ||
పూవులషికార్లతుమ్మెదలారా!
పుప్పొడిగ్రోలేమధుపములా! }
పూలకుతేనెలమాటలునేర్పి
వెంటనెవస్తారా?
మీరువెంటనెవస్తారా? ………..
ఈమాపిల్లలవద్ద, వాణీరాయంచశిష్యుడైనది ;
సుధామాధురినిమించినపలుకులుకమ్మగ నేర్వండి ||