Like-o-Meter
[Total: 0 Average: 0]
ఇవే! ఇవే! ఇవేనండి! 

దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు
టపాసుల మోతలు
బాణసంచా ధ్వనులు
దీపావళి దేవికి
ఇంపైన గీతాలు
ఇష్టమైన రాగాలు ||ఇవే! ఇవే! ఇవేనండి! ||
కాకర పూ కడ్డీలు
వెన్నముద్ద తెలికాంతులు
సర్రుమని నింగిలోకి
దూసుకెళ్ళే రాకెట్లు ||ఇవే! ఇవే! ఇవేనండి! ||
వాడ వాడలన్ని
ప్రభల చిత్రలేఖనలు
ఆడ ఈడ అన్ని చోట్ల
అల్లుకునే వెలుగులు ||ఇవే! ఇవే! ఇవేనండి! ||