మానవతకివి ఉషస్సులు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మబ్బుల మెడలో
చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో?
వానదేవుణ్ణి- డమడమ ఉరుముల
జడిపించేదది ఎవ్వరో?
జడి, వానధారల
చిక్కని- మెలికల –
దారుల నేర్పరచిన వారు ఎవ్వరో?
పుడమికి మేల్ కలనేత చీరలను
కట్టిన వారు ఎవ్వరో?
ఆ వలువల మడుగుల
అద్దపు బిళ్ళలు  కుట్టిన
ప్రజ్ఞా-వంతులు ఎవరో?
ఎవ్వరో? వారెవరో?

************

నదీఝరులలో అలల కొసలలో;
నురుగుల ముత్యాల్ చల్లినదెవరో?
ఎవ్వరో? వారెవరో?
పైరు పంటలకు
పచ్చని “పాటల వినిపించేది” ఎవ్వరో?
ఆ గాలిబాలలకు
చక్కని ఈ పని
అప్పగించినది ఎవ్వరో?
ఎవ్వరో? వారెవరో?
ఇన్నీ ఇన్నీ ఇన్నిన్నీ;
ఆ విధాతసృజనల కలిమి చిత్రముల
నిశితముగా గమనించగలిగిన వాడే కద,
ఈ మానవుడు!
ఈ మనిషి పెదవుల
చక్కని చల్లని-
నగవు వరముల నొసగినట్టి
ఆ దైవమ్మునకు
మేమిస్తాము బులిపించేటి బుల్లి వరమ్ములు,
అవే అవే!
ఈ “శత కోటి నమస్సులు”!
“మానవత”కివి మురిపాల ఉషస్సులు!

Your views are valuable to us!