రాజస మొప్పే బొమ్మల కొలువులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొలువులు కొలువులు; మేటి కొలువులివి,
రాజ కొలువులను మించినట్టివి;
రాజస మొప్పే బొమ్మల కొలువులు
 
బుల్లి ఊరును నిర్మిద్దాము
ఇది మన ఇల్లు; ఇది మన ఊరు
ఈ బొమ్మలు అన్నీ మన ఫ్యామిలీ!
 
మురికీ, మురుగు లేని దారులు,
వీధి లైట్లతోకళకళకళలాడే మార్గాలన్నిట
అన్ని వృత్తుల జన సమ్మర్దము!
 
అటు ఆఫీసులు, ఆసుపత్రులు,
రైల్వే స్టేషను, బస్టాండు, షాపులు;
ఇదిగో ఇక్కడ జూ, పార్కులలో,
మైదానాలలొ ఆడే పిల్లలు

Your views are valuable to us!