తెలుగు బాలలకై పద్యాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మా చిన్ని కృష్ణుని
మళ్ళీ మళ్ళీ పిలవండి
గోవిందా గోవిందా

గోపాల బాలునికి
గోరుముద్దలు పెట్టండి
గోవిందా గోవిందా

మా ముద్దుల కొండకు
నెయ్యీ  అన్నం పెట్టండి
గోవిందా గోవిందా

మా వెన్న దొంగకు
పప్పు బువ్వ పెట్టండి
గోవిందా గోవిందా


మా కొంటె కన్నయ్యకు
బెబ్బు అన్నం పెట్టండి
గోవిందా గోవిందా
 

***


అమ్మ చేతి బువ్వ
కమ్మనైన ముద్ద
“ఆమ్” అని తినేసి
ఆడుకో కన్నా

***

 

చెట్టు మీద పిట్ట

చక్కనైనదంట  
చుట్టూతా చూసి
ఎగిరిపోయేనంట

***

వాన వాన వచ్చింది
వాకిలి అంతా తడిసింది
వడిగా నీరు పారింది
పడవ సాగి పోయింది

***

ఆకాశంలో ఇంద్రధనుస్సు
ఆహ్లాదం గా ఉంది మనస్సు
ఆశలు తీరా చేయి తపస్సు
నీ ఆనందమే నీకు యశస్సు

***

చల్లని గాలి వీచింది
చక్కలిగిన్తలు పెట్టింది
చక్కని ఊహ తెచ్చింది
చుక్కల కేసి ఎగసింది

***

చెట్లు మాకు  చుట్టాలు
నీడను ఇచ్చే నేస్తాలు
పక్షులకవే ఇళ్ళు
ఫలాలు ఇచ్చే దాతలు

***

దేవుడమ్మ దేవుడూ
గుడిలో ఉండే దేవుడూ
బడిలో కూడా ఉంటాడు
అమ్మ ఒడి గా మారి దేవుడూ
అందరినీ ఆడిస్తాడు
నాన్న భుజమై ఉండి దేవుడూ
లోకాన్నే చూపిస్తాడు

***

Your views are valuable to us!