వన భోజన వేళాయెను

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పొగడల, పొన్నల చెట్ల నీడలలొ;
పొడలు పొడలు ఆ నీడలలోన;
వన భోజనముల సందడి సందడి
 
పిల్లలు, పెద్దలు అందరునూ;
దడులను కట్టి, తడికలు నిలిపిరి;
శిబిరములేసిరి;వంటలు చేసిరి:
కార్తీకముల సందడి సందడి

దడబిడ వచ్చి, చేతులు కలిపి:
పంటలు వేసీ, ఆటల పైరుల చప్పట్లు;
లోక జ్ఞానం ముచ్చట్లు
మంచు మాసముల మంచి కబుర్లు
 
బుడ బుడ ప్లేటుల; ఫలహారాలు,
విందు భోజనము రుచుల హేలలు;
నల భీముల పాకములివండి !
వన భోజనముల సందడి సందడి


గడబిడ  గంతులు, క్రీడల హోరు;
సంతోషాలు మిన్నుల తాకెను:
నింగికి కూడా హుషారు కోరిక;
తాను కూడా ఇట పాల్గొనాలని

Your views are valuable to us!