వీరీ వీరీ ఓనమాలు; వీరి గురువులు ఎవ్వరు?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

1) దేవతలకు గురువు- “బృహస్పతి “

2) రాక్షస గురువు:- “శుక్రాచార్యుడు”.

3) శుక్రాచార్యుల శిష్యరికము పొందిన వాడు – కచుడు

4) భక్త ప్రహ్లాదుని ఉపాధ్యాయులు – చండామార్కులు, (చండ, మార్క/అమరక= రాక్షస గురు శుక్రాచార్యుని కుమారులు)

**********

1) మహాకవి వాల్మీకిగా- (నిషాదుడు రత్నాకరుడిని) మార్చిన మంత్రము ఏది?

సమాధానము: శ్రీరామ తారక మంత్రము

2) శ్రీరామచంద్రులకు భక్తితో తాను రుచి చూస్తూ, ఎంగిలి పళ్ళు ఇచ్చినది శబరి-  ఎంగిలి ఫలములను ఇచ్చినప్పటికీ, భక్తితాదాత్మ్యతలకు పరాకాష్ఠగా – నిలిచినది ఆమె. ఆ శబరి యొక్క గురువు ఎవరు?

సమాధానము: మతంగ మహాముని.

3) శ్రీకృష్ణుడు, సుధాముడు (కుచేలుడు) గురువు పేరు ఏమిటి?

సమాధానము: సాందీపనీ ముని

4) ద్రోణుడు, ద్రుపదుడు గురువు ఎవరు?

సమాధానము: అగ్నివేశుడు

5) భీష్ముడు- బాలకులైన పాండవులకు, కౌరవులకు విద్యాబోధనకై ఎవరిని ఆహ్వానించాడు?

సమాధానము: ద్రోణుని.

********

6) “జగద్గురువు” అని ప్రఖ్యాతి గాంచిన వారెవరు?

సమాధానము: ఆదిశంకరాచార్య

7) ఆయన గురువు ఎవరు?

సమాధానము: గోవింద భగవత్పాదులు

(ఇక్కడ చిత్రమేమిటంటే – ఈయన వేంకటేశుని “గోవింద” నామధారి, అవగా శంకరాచార్యులు శివ నామధారుడు.)

8) ఆదిశంకరాచార్యుల శిష్యులలో ఒకరు:- ఫద్మపాదుడు; వీరిరువురి బంధము – “గురు శిష్య పరంపర” కు నిదర్శనము.

9) శ్రీ రాఘవేంద్ర స్వామి (వేంకట నాధుడు- పూర్వ నామమ) గురువు

సమాధానము: సుధీంద్ర తీర్ధులు 

10) శ్రీ రామనుజాచార్యుల శిష్యులు:-

సమాధానము: వరదాచార్యులు, యజ్ఞేశులు; తీర్ధ

********

1) శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానములోని “భువనవిజయము”. అందులో అష్టదిగ్గజములు ఉండేవారు. ఆ కవివరులలో ఒకడు “నంది తిమ్మన”. ఈయనే “ముక్కు తిమ్మన”, ఈయన యొక్క గురువు “అఘోరశివ”.

2) అయ్యలరాజు రామభద్రుని గురువు:- “ముమ్మిడి వరదాచార్యులు

3) వరాహమిహురుని గురువు

సమాధానము: తండ్రి ఆదిత్యదాసు

4) ఛత్రపతి శివాజీ గురువు

సమాధానము: సమర్ధ రామదాసు

5) శ్రీరామదాసు (కంచర్ల గోపన్న – అసలు పేరు) కు తారకమంత్రమును బోధించిన మహా వ్యక్తి ఎవరు?

సమాధానము: భక్త కబీరు దాసు

7) వివేకానందుడు (గదాధరుడు- తొలి పేరు) గురువు ఎవరు?

సమాధానము: శ్రీరామకృష్ణపరమహంస

*********

One thought on “వీరీ వీరీ ఓనమాలు; వీరి గురువులు ఎవ్వరు?

Your views are valuable to us!

%d bloggers like this: