బనాన సర్ప్రైజ్ (Banana Surprise)

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

   
కావలసినవి

పెద్ద అరటిపళ్ళు  2
చక్కెర  300గ్రాములు
కొరిన పచ్చి కొబ్బెరకోరు  1 కప్పు
నెయ్యి  1/2 కప్పు
ఆరంజ్ జ్యూస్  1 కప్పు
నేతిలో వేయించిన జీడిపప్పు  15

 

[amazon_link asins=’B07L34D7TX,1407562754,B00DID3VL6,B0165C53XU’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’596a8bd1-503c-4711-b9cc-e7832d28b393′]

చేసే విధానం 

ముందు అరటిపళ్ళు ముక్కలు చేసి వుంచాలి.(గుజ్జుచేసినా సరే). ష్టవ్ పై మూకుడు వుంచి అందులో 1/4 కప్ నీళ్ళుపోసిబాగా పొంగువచ్చాక అందులో చక్కెరవేసి కాస్త పాకం వచ్చాక, 2 స్పూన్స్ నెయ్యివేసి అందులో కట్ చేసిన అరటిపళ్ళు వేసి రంగు మారేవరకు వేయిస్తునే వుండాలి.

అందులోనే 1 స్పూన్ కొబ్బెర వెసి పచ్చివాసన పోయేవరకు కలిపి పక్కన వుంచుకోవాలి.

మూకుడులో 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఆరంజ్ జ్యూస్ వేసి బాగా పొంగు వచ్చాక అందులో అరటిపళ్ళు,మిగిలిన కొబ్బెర వేయించి ముక్కలు చేసిన జీడిపప్పు, వేసి కాస్త గట్టిపడేవరకు వుంచి తీసేయడమే.

ఇది bread కు, ice cream కు చాలా బాగుంటుంది. ఒక విధంగా హల్వా మాదిరిగా టేష్ట్ వస్తుంది.

మరి Friends! మీరూ చేసి చూడండి!


Your views are valuable to us!