నిమ్మపూరీలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

ఇవి తీపి పూరీలు. నిమ్మవాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటాయి. రుచిగా కూడా ఉంటాయి.

కావలసిన పదార్థాలు:

 

మైదాపిండి ఒక కప్పు
చక్కెర ఒక కప్పు
నెయ్యి ఒక కప్పు
నిమ్మకాయలు రెండు
ఉప్పు చిటికెడు
వెన్న నిమ్మకాయంత

 

[amazon_link asins=’B01LYBEFWP,B01ELN4AMA,B01KRIMNYK,B0742F4CVB’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’ffa03dfb-fb87-4d12-a55b-5edcc6528ef3′]

చేసే విధానం:

మైదాపిండిలో ఉప్పు, వెన్న, కొంచెం నీళ్ళు పోసి పూరీలపిండి లానే కలుపుకొని, పూరీలు వత్తి పెట్టుకోవాలి.

తర్వాత పంచదారలో కాసిన్ని నీళ్ళు పోసి తీగపాకం వచ్చేదాకా గరిటతో తిప్పుతూ అడుగు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. తీగపాకం వచ్చాక పాకం గిన్నెను దించి అందులోకి నిమ్మరసం పిండాలి. నిమ్మ వాసన ఎక్కువ కావాలనుకొనేవాళ్ళు లెమన్ ఎస్సెన్స్ చేర్చుకోవచ్చు.

బూర్ల మూకుడులో కప్పు నెయ్యి వేసి, అది మరిగాక ముందిగా చేసివుంచుకొన్న పూరీలను వేయించాలి. పూరీలు సరిగ్గా వేగాక వాటిల్ని పాకంలో వెయ్యాలి. అంతే…తీపి నిమ్మ పూరీలు తయార్!

వీటిల్ని చల్లబడ్డాక తినేకంటే వేడిగా తింటేనే మజా!

@@@@@

Your views are valuable to us!