పంచామృతం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

పండగల సీజను కదా! అందుకని, అందరికీ తెలిసిన “పంచామృతము” ఎలాగ తయారుచేయాలో చూద్దాము.

పూజాదికములలో ప్రసాదముగా స్వీకరించే పంచామృతములో అయిదు పదార్ధములను కలిపి చేస్తారు.

 

కావలసినవి :

  1. పాలు – 2 చెంచాలు
    చక్కెర – అర స్పూను
    బాగా స్మూత్ గా అయ్యే వరకూ కలియ బెట్టిన పెరుగు -1 చెంచాడు
    మంచి నెయ్యి – పావు స్పూను
    తేనె – అర్ధ పావు చెంచాడు

అవసరము అనిపిస్తే అరటి పండు, తులసి ఆకులు, కొబ్బరి తురుము మున్నగు వాటిని చేర్చ వచ్చును.

వెడల్పాటి బేసిను వంటి పాత్రలో జాగ్రత్తగా కలియబెట్టాలి. కేవలము ప్రసాదముగా మాత్రమే కాదు, దీనిని విడిగా చేసుకొనవచ్చును. ఇది రుగ్మతలను పోగొడ్తుంది. ఆరోగ్య వర్ధని అని పేర్కొన వచ్చును.

చాలా మందికి ప్రసాదమును గ్రోలిన తర్వాత దోసిళ్ళును తలకు రాసుకునే అలవాటు ఉన్నది. ఇందులోని “తేనె”వలన జుట్టు నెరిసే అవకాశము కలదు. కాబట్టి, జాగ్రత్తగా అర చేతులను కడుక్కోవడము మంచిది.

[amazon_link asins=’8189975749,9387944786,9380283377,8192976076′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’829a0351-f341-4a46-ade7-bad30af69c6d’]

Your views are valuable to us!