అవునా , నిజమేనా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎక్కడ చూసినా ఒక అంతూ పొంతూ లేని రొద.

జన సముద్రం నడిమధ్యన, చోటు దొరకని ఇరుకు గల్లీల్లో , తలుపు తెరిచినా తలపు తెరిచినా వీధిలో పడే పరిస్థితి. అయినా ఇది అని చెప్పలేని మానసిక దౌర్భాగ్యం. అంతరంగిక బహిష్కరణ. అన్యమనస్కంగా అడుగులు వేస్తోంది శమంత. “నేనొక్కదాననే ఇలా ఆలోచిస్తానా? మిగతా అందరూ నాలానే వుంటారా? ఎందుకిలా జనాల మధ్య ఇమడలేకపోతున్నాను… లోపం నాలోనేవుందా?” స్వయం పరిశీలన అనాలోచితంగానే ఆరంభమైంది.

చిన్నప్పటినుండీ ఇదేవరస. శమంతకు బాగాగుర్తుంది. అప్పుడు బహుశా ఆరో తరగతిలో కామోసు …ఆర్నెల్ల పరీక్షలో్…ఏడాదివో అంతగా గుర్తులేదు. చదువుకుని వెళ్ళడం వల్ల చక చకా రాసేస్తూ మధ్యలో దేనికో తలెత్తి చూస్తే ఏముంది ఆపక్కా ఈ పక్కా కూర్చున్న ఎస్సెల్సీ అబ్బాయిలు చిట్టీలు పెట్టుకుని మరీ రాసేస్తున్నారు. శమంత మనసుడికిపోయింది. ఎంత అన్యాయం! ..ఎంత ధైర్యం! ఉహు! సహించేది లేదు.

వెంటనే లేచి నిల్చుని గదికి మరోమూలన ఇన్విగిలేషన్ చేస్తున్న మేష్టారిని పిలిచింది “సార్”. వెంటనే ఎక్కడినించి పిలిచిందీ తెలీక అటూ ఇటూ చూసాడాయన. “ఏంకావాలి …మేం చెప్తాం ” పక్కన అబ్బాయి ప్రలోభ పెట్టాడు. అతనివంక కోపంగా చూసి మొండిగా లేచి నిల్చుని పిలిచింది.

“సర్”

దగ్గరకు వచ్చిన మాస్టారు పేపర్ కావాలేమోననుకున్నారు.

“సర్, ఈ ఇద్దరూ కాపీలు తెచ్చి రాస్తున్నారు” నిండా పదేళ్ళయినా లేని తను ఈ మాట అంత ధైర్యంగా మాస్టారికి ఎలా చెప్పగలిగిందో ఇప్పుడు ఆలోచించుకుంటే ఆమెకే అర్ధం కాదు.

ఎప్పటిమాట ఇది, పాతికేళ్ళు దాటి పోయింది. మధ్యలో ఎన్ని ఎదురీతలు ఎన్ని పోరాటాలు. ఆదర్శాలకు నిలబడీ ఎదురుకొన్నవి ఎన్ని ఆటుపోట్లు! ఒకటా రెండా…

డిగ్రీ పరీక్షలు ఇలా జరగ్గానే అలా ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాక గాని లోకం తీరు తెలిసిరాలేదు.”నిజమే అమ్మాయి తెలివైనది. కాలేజి ఫస్ట్ వస్తుంది …మాకా నమ్మకముంది… అప్లై చెయ్యమనండి లాబ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఖాళీ గా వుందని” తెలియగానే ఉద్యోగం వచ్చినట్టే పొంగిపోయింది. అప్లికేషన్ ఇవ్వడం దాని కోసం రాత్రీ పగలూ ఎదురు చూసాక , కాలేజి ఛెయిర్మెన్ ని అడుగు సెక్రెటరీని అడుగు అంటూ మరో మూడు నెలలు తిప్పుకుని మరెవరికో అది ఇచ్చేసాక మధ్యవర్తులు చెప్పారు-“అంతా ప్రిన్సిపల్ గారి చేతిలోనే వుంది.

“ఆవిడకో పట్టుచీరా ఒక బియ్యం బస్తా ఇచ్చుకుంటే సరిపోయేదని” అవి ఇవ్వగలిగే స్థితిలో వుంటే ఉద్యోగానికి వెళ్ళడం ఎందుకుఅంటూ తోసిపుచ్చింది.

ఇలా ముక్కుకు సూటిగా పోవడం తప్ప మరోదారి తెలీదు శమంతకు. అందుకే జరిగేవి

జరుగుతున్నవి జీర్ణించుకుని నిశ్శబ్దంగా వుండటం దుర్భరంగావుంది.

* * * * * * * * * *

 

Your views are valuable to us!