హైదరాబాదు బస్సెక్కాను. రాత్రల్లా ప్రయాణం. ఈ వాల్వో బస్సులు, విశాలమైన
రహదార్లు, వచ్చాక ప్రయాణాలు కాస్త హాయిగ ఉంటున్నాయి బస్సు బయలుదేరింది.
మనస్సు బరువుగా ఉంది.సినిమా మీద మనసు లగ్నం కావటం లేదు.
నా క్లాస్ మేట్ ఇక్కడే సూళ్ళురుపేటలో నర్సింగ్ హోం పెట్టిందని తెలిసి మొన్నామధ్య బయలుదేరా. నర్సింగ్ హోం చేరాక తెలిసింది, ఆమె చనిపోయి 15 సంవత్సరాలయిందని. మంచి హస్తవాసి గల డాక్టరు మొగుడు సినిమాల్లో చేరాలని వెళ్ళిపోయాట్ట. పుట్టింటికి పోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఏమిటో ఈ జీవితం.
హైదరాబాదు లో ఓ ఏలూరు మిత్రుణ్ణి పట్టాను వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ లో బాగా
పేరున్న నాయకుడు కాబట్టి కనిపెట్ట కలిగాను. ఫోను చేస్తే బోలెడు సంతోషపడిపొయాడు. వాడికి ఇంకా ఇద్దరు టచ్ లో ఉన్నారని, అందరు కలుద్దామంటేనే బయలుదేరా.
దాదాపు 40 ఏళ్ళ తరువాత కలుస్తున్నాం. సాయిత్రం వాళ్ళింట్లోనే డిన్నర్. వాడి భార్య మా కన్నా ఎక్కువ సంతోషపడింది. ఒరే ఒరే అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళ అబ్బాయి పక్క నే జోకులు..ఏట్లో ఇసుక దిన్నెల మీద దమ్ము కొట్టడం. ప్రొహిబిష న్ టైమ్ లో మందు ఎలా సేకరించామో..అన్నీ చెప్పుకుంటూ చిన్న చిన్న పిల్లలయిపోయాం.
అవన్నీ చెప్పి విసిగించదలచ లేదు. మొత్తానికి చాలా సరదగా గడిచిపోయింది. సెలవు తీసుకుంటూ మీరు రండి అంటే మీరు రండి అని అనుకున్నాం మునుపు కూదా అలాగే అనుకున్నాం అయిపోయింది 40 ఏళ్ళు అదే చెప్పా ఇలా కలవాలి అన్న కుతూహలం ఎందరిలో ఉంటుంది ? ఏ రోజు దినచర్య ఆ రొజే వాయిదా పడే రొజుల్లో.. అని అందరి మనసుల్లో.
రేపు విజయవాడ వెళ్ళాలి. అక్కడో ట్రైనింగుంది. బస్టాండులో డ్రాప్ చేసాడు కార్లో ఇంకో గంటుంది. మళ్ళీ కబుర్లు. ఏ సారి అక్కడ మాట్లాడలేని విషయాలు ఎన్నో చెప్పుకున్నాం బాధపడ్డాం ,నవ్వుకున్నాం ,జాలి పడ్డాం. ఇంతలో బస్సొచ్చింది. బస్సులోకూర్చొన్నా.
“గోపాల రావా ఇక్కడెవ్వరూ లేరే!”
“అడ్రస్సు ఇదేనా?”
“అవునండీ ఇదే అడ్రసు కాకుంటే పాతది.”
పెద్దవాళ్లెవరైన ఉంటే వాళ్ళకు తెలుసేమో వారి అమ్మాయి రోహిణి అని..చెప్తున్నా..మధ్యలోనే
“అస్సలిక్కడెవరు అలాంటి వాళ్ళు లేరండి…నాకు బాగా తెల్సు ఇక్కడ మేమే
ఉంటున్నాం.” ఇక దయచెయ్ అన్నట్టు చెప్పింది.
ఇంతలో “ఎవరే?” అంటూ ఇంట్లోంచి కేక.
“ఎవరోనే గోపాల రావు కావాలంట!”
“ఏ గోపాల రావూ? ఇక్కడెవరున్నారూ ?” అంటూ ఆవిడే వచ్చింది.
“నమస్కారమండి.. నాకు తెల్సినవాళ్ళు గోపాల రావు గారని వాళ్ల అమ్మాయి రోహిణి ఇదే అడ్రస్సు లో ఉండేవారు” అంటుండగానే రోహిణీ నా అంటూ ఎగాదిగా చూస్తూ అడిగింది.
“అసలు మీరెవరు ? ఈ అడ్రస్ ఎవరిచ్చారు?” అంటూ ప్రశ్నించారు.
“వాళ్ళే ఇచ్చారు..నేను తిరుపతి నుంచి వచ్చాను వీలయితే కలిసి పొదామని” అని నసిగాను.
“ఏమొనండి మాకెవరు తెలియదు”
వెనక్కి తిరిగాను..నిరాశాతో. అటు ఇటూ అడుగుదామన్న ఆలోచన చంపుకొని బస్సెక్కాను.
ఉంటా…మరి..
మంచి కంచి పట్టుచీర తీసిపెట్టు. ఘరానా గా చెప్పుకుంటా. ఉంటాను.. రోహిణి (ఇది నా కలం పేరు అని వేరే్ చెప్పక్కర్లేదనుకుంటా ..ట్యూబూ)”
ఉత్తరం చదివాక మనసంతా ఎంతో సంతోషం. నాప్రయత్నాలకి ఫస్ట్ మార్క్ కాకున్నా పాస్ మార్కొలొచ్చాయి. అప్పటిలాగే ఉంది..ఏ మార్పూ లేదు.. పిచ్చిపిల్ల..రొయ్యలంటే ప్రాణం..పట్టుచీర కొనాలి…. ఫోనందుకున్నా……