“సన్యాసి” మొదటిభాగం
(రచయిత – ఐ.వి.ఎన్.ఎస్. రాజు) |
మాధవి తల్లిదండ్రులు ఇంకా సంభ్రమాశ్చర్యాలనుండి తేరుకోలేదు.వాళ్ళకూ, ఆ కుటుంబసభ్యులకూ ఒకింత భీతీ, లజ్జతో కూడిన బెరుకూ కలుగుతూన్నాయి. గత కొంతకాలముగా కేశవ పట్ల తాము ప్రవర్తించిన తీరు మనసులలో కలవరపెడ్తూన్నది.
వేకువ ఝామున తలుపు తట్టిన చపుడు……
ఎదురుగ్గా బావ గారు కేశవ. విసుగ్గా మొహం చిట్లించాడు.
అప్పటికి ఇంటిల్లిపాదీ లేచారు.అందరిలో ఒకే అభిప్రాయము మెర మెరలాడ్తూనది “ఇతని వలననే మాధవి లౌకిక ప్రపంచాన్ని వీడి మరలి రాని లోకములకు వెళ్ళి పోయింది” – అని.
“సాక్ష్యాలు దొరక్కుండా చేయదలుచుకున్న దారుణాలు చాలా చేస్తూన్నారు, చాలామంది, ఈ రోజులలో! నువ్వేమి చేసావో? నువ్వే మా మాధవక్క మరణానికి కారణం, మర్యాదగా చెప్పు! అసలేం జరిగింది? ఇంత అర్ధంతరంగా ఇంత ఘోరం జరిగిందీ అంటే నువ్వు ఏమీ చెయ్యని అమాయకుడివీ అంటే మేము నమ్మాల్సిందేనా?”
అందాల భరిణ మాధవి రూపు రేఖలు కళ్ళల్లో బొమ్మలు కట్టుకుని ఉన్నాయి. బామ్మ, తాతయ్య, ఇవే ప్రశ్నలను శరపరంపరగా కేశవ్ పైకి గుప్పించారు. బంధువులు కొందరు చెవులు కొరుక్కున్నారు. అందుకే ఇప్పుడు అతడికి ఇలాటి స్వాగత మర్యాద!
ఆమె నిన్ననే ఇంట్లో చిన్నపాటి మీటింగులో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మార్గాలను గూర్చి జరిగిన చర్చలో పాల్గొన్నది. ఆ సంభాషణలలో ఇతర విషయాలు అన్నీ దొర్లుకువచ్చేసాయి.
లోపాయికారీగా బామ్మ తన అభిప్రాయాన్ని చెప్పింది “కేశవ్ కి వాసంతిని ఇచ్చి చేస్తే…….!”
నెమ్మదిగా బామ్మ ఒపీనియన్ ని కూడా మార్చారు. తుది నిర్ణయాన్న్ని నిష్కర్షగా తేలుస్తూ “లోకములో ఎన్ని విపరీత ఘటనలు జరుగుతూన్నాయి. కేశవ్ కు ఆఫీసులో ఒక ఉద్యోగినితో స్నేహమూ, ప్రేమా దోమా ఉండి ఉండవచ్చును. కనుకనే భార్య అడ్డు తొలగించుకున్నాడు. ఇంట్లో తాను లేనప్పుడు, స్టవ్ వెలిగించేటప్పుడు మాధవి గాస్ ప్రమాదములో చిక్కుకున్నది.
అత్తవారింటి నుండి కేశవ్ నిరాశగా వెనుదిరిగాడు.
అక్కడి మండువాలో అరుగు మీద కాస్సేపు కూర్చున్నాడు. “మాధవి అనేక కబుర్లు చెప్పింది. ఆమె బాల్య స్మృతులూ, ఆటలు పాటలూ సాగినవి ఆ అరుగులూ, లోగిలి లోనే!”
“ఒకే ఊళ్ళో ఉంటున్నప్పటికీ కొరియర్ లో నగను పంపించాడు అల్లుడు. తాము ఎంత అవమానపరిచారు అతడిని? అతడు ఖరీదైన ఈ కంఠాభరణమును పంపించకున్నాఏమని? నిలదీసి, అడిగే వారు లేరు. కానీ కీర్తిశేషురాలైన అర్ధాంగి మాటలను వేదవాకులుగా మన్నించి, ఇలాగ పంపించాడు…..”
ఆ కుటుంబీకులలో పశ్చాత్తాపము కలిగింది.
ప్రతి చోటా వాళ్ళకు విన వచ్చిన మాటల సారాంశము ఇదే!
“కేశవ్ పదే పదే మాధవినీ, హాస్యోక్తముగా ఆమె జారీ చేసిన గృహ సామ్రాజ్య ఆజ్ఞలూ “ఇత్యాదులు కొలీగ్సుతో ముచ్చటిస్తూండేవాడు. ఆఫీసులో మహిళలు సైతం- ” తోటి స్త్రీలను ఎంతో గౌరవభావముతో మసులుకునే వాడు. వెకిలి చేష్ఠలు చేయని బుద్ధిమంతుడు. శ్రీరాముని లాంటి అలాటి పురుషుని భర్తగా పొందిన మాధవి గొప్ప అదృష్టవంతురాలు” ఇలాగ అందరూ కేశవ్ గొప్ప వ్యక్తిత్వాన్ని వర్ణించి చెప్పారు. ఆబాలగోపాలము నుండీ క్లీన్ సర్టిఫికేట్ పొందిన కేశవ్ ను అనవసరంగా అనుమానించినందుకు భరత్, ఫ్యామిలీ మెంబర్సు అందరూ బాధపడారు. వాసంతి సంగతి చెప్పనే అక్కరలేదు.
ఇప్పుడు సన్నిహితులూ, బందు వర్గీయులూ యావన్మ0దీ ఆత్ర్తతో ఎదురుచూస్తూన్నారు టి.వి. లలో పత్రికలూ వార్తావనినీ ప్రత్యక్షరమూ ఫాలో ఔతూనే ఉన్నారు. వారందరి ఎదురు తెన్నులూ ఇప్పుడు అతని పునరాగమనము కోసము….