వసంత కోకిల – 2

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

శ్రీనివాస్ తలుపు తెరుచుకొని లోనికి వెళ్ళగానే ఒక యువకుడు నవ్వూతూ నమస్కరించి ఖాళీ గా ఉన్న టేబుల్ వైపు సాదరం గా ఆహ్వానిస్తూ “సర్ మీరు ఒక్కరేనా మీతో ఎవరైనా వచ్చార?” అని మృదువైన స్వరం తో అడిగాడు 

“నాకు రెండు సీట్స్ కావాలి”

ఓకే సర్ అని ఒక కార్నర్ టేబుల్ వద్దకు తీసుకొని వెళ్ళాడు.

కొంచం సేపటికి శ్రీనివాస్ డ్రైవర్ రాజు వచ్చాడు.

“సర్, ఈ హోటల్ చాల డిఫరెంట్ అన్ని విధాల. రెట్లు కూడా చాల న్యాయం గా ఉంటాయి.”

“ఔనా” అని అనే లోపున ఒక యంగ్ సర్వర్ వచ్చాడు.

“మీరు ఇలా లోనికి వచ్చారు అప్పుడే మా లక్ష్మి మేడం గారు కిచెన్ నుంచి బయటకు వచ్చి కిందకు వెళ్లి పోయారు ఆమె మా అందరి పాలిటి నిజంగానే శ్రీమహాలక్ష్మి”

“చాల సంతోషం బాబు” అని టిప్ గా ఒక 10 అదనంగా రూపాయలు ఇచ్చి బయలు దేరాడు.”

ఆ టిప్ ఆ సర్వర్ ఒక బాక్స్ లో జారవిడిచాడు శ్రీనివాస్ చూస్తుండగానే.  అ బాక్స్ పారదర్శకం గా ఉండడం తో అప్పటికే సమకూరిన చాల ధనం కనిపిస్తుంది. ఆ బాక్స్ పై “ఆలంబన” అని వ్రాసి ఉంది లోగో తో సహా!!

శ్రీనివాస్ వదనం లో ఒక విచిత్రమైన మార్పు కనిపించింది.

 

***

 

కవిత గారు వెల్కమ్.

కుర్చీలో కూర్చొంటూ “ఇక్కడ ఒక ISB  ప్రొఫెసర్ ఉంటారు ఆయన ఇంటికని వచ్చాను వాళ్ళ మనుమరాలిని చూడడానికి. అప్పుడు గమనిస్తే మీ ఆఫీస్ ఇక్కడే చూసా అందుకే ఇంత షార్ట్ నోటీసు లో మిమ్మల్ని కలిసాను”

“మీరు చెప్పే ప్రొఫెసర్ కృష్ణ మూర్తి గారు కదూ” 

“ఓహ్ వరల్డ్ ఇస్ సో స్మాల్ ఆయనే వసంత గారు”

ఆయన మా “ఆలంబనపై ఒక కేస్  స్టడీ వ్రాసారు అందుకు నేనే కావలసిన డేటా ఇచ్చాను”

“ఇప్పుడు ఆయన మా సంస్థపై ఒక కేస్  స్టడీ వ్రాస్తున్నారు అలా పరిచయమింది ఆయనతో నాలుగు నెలల .క్రితం ఆయన చాల మంచి మనిషి”

“ఔను నాలుగు నెలలో మీరు ఆయన మనుమరాలిని చూడడానికి వచ్చారంటేనే తెలుస్తుంది ఒక మంచి పరిచయం ఆయనతో మీకు ఏర్పడిందని.”

“ఔను ఆయన ఒక మంచి గురువు కూడా”

 

“మీ ఆఫీస్ చాల బాగుంది”  కవిత 

“చాల ఆశ్చ్యరం గా ఉంది మీ సంస్థ పని తీరు” వసంత 

ఒక్కటి మాత్రం నిజం  మనం రెండు మంచి సంస్థల్లో పనిచేస్తున్నాం : కవిత 

ఔను ఆ సంతృప్తి జీవితంలో చాల ముఖ్యమైనది. మీ మేడం గార్ని  చూడగానే చాల ప్రశాంతత కలిగింది. మీరు నిజంగా అలాంటి వారి దగ్గర పనిచేయడం మీరు చేసుకున్న పుణ్యం. మీ మేడం పని తీరు,ఆలోచనా విధానం చూస్తుంటే చాల ఉత్తేజం కలుగు తుంది ఒక స్ఫూర్తి ని పొందుతాం కూడా: వసంత :

 ఔను మీరన్న మాటలే చాల మంది అన్నారు ఈ మాటలు విన్నపుడు నాకు నా పై ఉన్న విశ్వాసం ఎక్కువ ఔతుంది ఎందుకంటే మాకు మా మేడం పై ఉన్న విశ్వాసం  నిజానికి ఆమె చెప్పినట్లు మాకు మా పై ఉన్న విశ్వాసమే: కవిత

వెల్ సెడ్. మీ రన్న మాటలో చాల అర్ధం దాగి ఉంది.  మీరు ఏమీ అనుకోనంటే నాకు మీరు మీ మేడం గురించి చెబుతారా?:వసంత 

కవిత: ఆ ఒక్కటీ అడగొద్దు. ఆమె ఒక మాట అన్నారు మాతో. నిజానికి ఒక మాట తీసుకున్నారు మా నుంచి.  “నా గురించి మీరు తెలుసుకోవలసింది ఏమి లేదు ఎందుకంటే నేను ఒక సాధారణ స్త్రీని. పెద్ద చరిత్ర ఉన్న దానను కాను నేను ఏపని చేయడాని మొదలు పెట్టానో అదే  ఈ వ్యాపారం. అది తెలుసుకొంటే నన్ను తెలుసుకున్నట్లే” అని చెప్పారు.  అదుకే మేము ఎవ్వరం ఇక ఆ విషయంపై ఆమెను ఇబ్బంది పెట్టలేదు పెట్టబోము కూడా. 

 

ఒక్క సారిగా వసంత మదిలో ఎదో తెలియని భావం మెదిలింది. ఈ లక్ష్మి భాగ్యలక్ష్మి అయితే అని ఒక ఆలోచన, ఆశ. మళ్ళీ తనలో తానె నా పిచ్చి కాని ఇది సాధ్యమా  అని కూడా.  ఇదే మాట వసంత ఇంటికి వెళ్లి తన భర్తకు (మోహన్) చెప్పింది. మోహన్ కూడా అలానే ఆశ పడ్డాడు. ఒక్క వసంత కు తన భర్త మోహన్ కు తక్క ఎవ్వరికీ తెలియదు శ్రీనివాస్ “ఆలంబన” అనే సంస్థకు అజ్ఞాత మార్గదర్శి అని. 

 “మనకు తెలుసు శ్రీనివాస్ గారు ఎంతటి ఉన్నతమైన వ్యక్తో అలాగే మనకు తెలుసు ఆయన జీవితంలో ఏది కోల్పోయారో. ఇది మనకు సహజం ఆయనకు మంచి జరగాలని అనుకోవడం. కాని ఎట్టి పరిస్థితుల్లోను మనం శ్రీనివాస్ గారి గురించి ఎవ్వరికీ ఇసుమంత కూడా చెప్పకూడదు.  మాటల్లో నాకు చాల సార్లు నాలుక చివరి వరకూ ఆయన పేరు వస్తుంది కాని నేను అలాగోలా  కంట్రోల్ చేసుకుంటాను.  శ్రీనివాస్ గారు చెప్పినట్లు కలి  కాలంలో తనది కాని ధనాన్ని ఇతరులకు ఇస్తూ తనది ఇచ్చినట్లుగా పేర్లు ఫొటోలతో పేపర్లకు ఎక్కే కుహనా నాయకులున్న చోట ఆసలైన నాయకులు ఉండరు అని.  అందుకే నేను నీకే మొత్తం వ్యవహారాలు వదిలిన ఒక నిమిత్త మాత్రుని గా నా విధులు చేసుకొని పోతున్నాను.  శ్రీనివాస్ గారు ఈ మధ్య భగవద్గీత ను బాగా అధ్యయనం చేస్తున్నట్లు ఉన్నారు ఆయన తరచూ దానిలో దాగిన అద్భుతమైన చాల సరళమైన విషయాలను, నియమాలను చెబుతున్నారు. ఆయన మనకు దొరకడం మనం చేసుకున్న పుణ్యం సుమీ” అని ఒక్క సారి కళ్ళు మూసుకున్నాడు మోహన్.”

 

వసంత మోహన్ భుజంపై తన తలను ఆన్చింది… నిశ్శబ్దం ఎన్నో ఊసులు చెప్పింది. 

 

***

 

“గత 5 సం  లు గా “ఆలంబన” పనిచేస్తూ కోట్ల కొలదీ ధనాన్ని కార్పస్ ఫండ్ గా సమకూర్చుకొంది. అది ఒక బంగారు బాతు.

మనం “ఆలంబన” సొసైటీ లో సభ్యులు గా చేరదాం, మనం కూడా కొంత కార్పస్ ఫండ్ దానికి ఇద్దాం. ఆ సంస్థ వ్యవహారాలపై మనం కూడా ఇష్టత చూపుతూ మమైకమైనట్లే ప్రపంచానికి రుజువు చేసి  దాన్ని వశం చేసుకుందాం.  ఆ వసంత-మోహన్ లను తొలగిద్దాం.  ఈ చాప క్రింద నీరు తరహానే మనకు సబబైనది.” స్థానిక ఎం ఎల్. ఎ . తన మనసులో మాట తన మిత్ర బృందం తో చెప్పేసాడు.  ఆ మిత్రం బృందం లో ఉన్న ఒకాయన తమ్ముడు  “సాత్విక్ ఆహారం” 100 వ బ్రాంచ్ లో అకౌంటెంట్.

 

“ఒక్క మాట “ఆలంబన” నిజంగానే చాల చిత్తశుద్ధి తో పనిచేస్తున్న సంస్థ దాని విషయంలో మనం ఆచి తూచి అడుగు వేయాలి.  ఆ సంస్థ సభ్యులు ఎవ్వరూ విలాస వంతమైన జీవితం గడపరు. సాధారణ జీవితం చీకు చింత లేకుండా గడుపుతారు. పైగా వాళ్లకు అందరకూ పెన్షన్ పాలసీ ఉంది.   ఆర్ధిక స్వావలంబన ఆ సంస్థకే కాదు అందులో పనిచేసే  ప్రతివారికి అలవడిన ఒక సూత్రం. అందుకే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడే రిటైర్ ఔతారు.  అందువల్ల మనం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయవలసి ఉంటుంది” అని మరొక మిత్రుడు  సుధాకర్ అన్నాడు. ఆయన ఒక బ్యాంకు జనరల్ మేనేజర్. 

 

“సరే రేపే మన సుధాకర్ తన బ్యాంకు ద్వారా ఒక డొనేషన్ అందచేస్తాడు మెల్లిగా కోటలో పాగా వేస్తాడు” అని నవ్వుల మధ్య చెప్పాడు ఆ స్థానిక ఎం. ఎల్. ఎ. 

 

***

 

“లక్ష్మి గారు మీకు నా అభినందనలు”  అవతలి వ్యక్తి  పరిచయం కూడా చేసుకోకుండా చెప్పాడు ఫోన్ లో 

“ధన్యవాదాలు మీకు, మీరు ఎవరో తెలుసుకో వచ్చా అలాగే ఎందుకు నన్ను అభినందిస్తున్నారో కూడా ?”  లక్ష్మి చాల శాంతం గా అడిగింది. 

 

“నేను నిన్న మీ “సాత్విక్ ఆహరం” లో ఒక చక్కని ఉమ్పా పెసరట్టు తిన్నాను.  వెళ్ళగానే నాకు మీ స్టాఫ్ ఇచ్చిన ఆదరణ చాల ముచ్చట గొలిపింది. మీరు మంద్రంగా వినిపించిన ఘంటసాల భగవద్గీత లోని “అహం వైశ్వానరో భూత్వా …., బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: …… యుక్తాహార విహారస్య ….., అన్న సూక్తం… వింటూ నేను మీ సాత్విక ఆహారాన్ని ఆస్వాదించాను.  కలియుగంలో ఇంత చక్కని ఆతిధ్యం, మర్యాద, శుచి సౌచం తో కూడిన వంట విధానం, చక్కని ఆహారం అదీ సాత్వికమైనది దొరకడం ఒక అద్భుతం. అందుకే మీరు 100 శాఖలు గా విస్తరించగలిగారు. అందుకు మీకు అభినందనలు.  నా పేరు శ్రీనివాస్” అని చక్కని స్వరం తో పలికిన ఆ పలుకులు భాగ్యలక్ష్మి ని మంత్రముగ్ధురాలిని చేసాయి.

“చాల సంతోషం శ్రీనివాస్ గారు” అని చెప్పి ఫోన్ పెట్టలేదు.

“మరొక్క మాట ఇలా కూడా వ్యాపారం చేయవచ్చు అని నిరూపించారు. అలాగే “ఆలంబన” లాంటి సంస్థ కు చక్కని చోటు మీరు ఇచ్చారు. నేను కూడా “ఆలంబనకు” నాకు తోచిన సహాయం చేస్తుంటాను.  మీ సిబ్బంది మొహం లో ఉన్న ఆనందం మీ నాయకత్వ లక్షణాలకు దర్పణం” అని శ్రీనివాస్ అనే సరికి భాగ్యలక్ష్మి మరొక్క సారి నవ్వుతూ “మీకు మా సంస్థ నచ్చడం మీ మంచి మనసుకి తార్కాణం. ధన్యవాదాలు” అని చెప్పింది 

“మై ప్లెషర్” అని చెప్పి శ్రీనివాస్ ఫోన్ పెట్టేసాడు.

ఒక్క క్షణం భాగ్య లక్ష్మి లో మౌనం అందంగా తన మోముపై ప్రతిఫలించింది.  లౌడ్ థింకింగ్ లా “శ్రీనివాస్ అంటే శీనే అని అనుకోవడం నా పిచ్చి. కాని, ఈయన మాట ఎక్కడో విన్నట్లే ఉంది అనుకోని ఒక్క సారి తను  చూసిన “కలల్లో ని శీను” ని మనసులో నిమ్పుకొంది.

మరలా నిశ్శబ్దం రాజ్యం ఏలింది.

శ్రీనివాస్ తన ముందే ఉన్న ఐ పాడ్ లో “సాత్విక ఆహరం” అని టైపు చేస్తే ఒక న్యూస్ పేపర్ లింక్ కనిపించిది అది హిందూ పేపర్ లో పడిన వ్యాసం ఓపెన్ చేసి చూస్తె భాగ్యలక్ష్మి ఫోటో కనిపించిది.  శ్రీనివాస్ ఉద్వేగం కట్టలు తెంచుకొని కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తూనే ఉంది .  ఒక్క సారిగా చేష్టలుడిగి అలానే ఉండిపోయాడు శ్రీనివాస్.  వ్యాసం ఆసాంతం చదివాక తెలిసింది భాగ్యలక్ష్మి అవివాహిత అని. 

వెంటనే  మోహన్కు ఫోన్ చేసి “మోహన్ నీతో మాట్లాడొచ్చా అని అడిగాడు”  

తప్పని సరిగా సార్  అని మోహన్ అన్నాడు . 

ఏమీ లేదు ఈ “సాత్విక ఆహారం” గురించి తెలుసుకోవాలి అని ఫోన్ చేసాను.

“ఓహో నిన్న మీరు అక్కడ ఉప్మా పెసరట్టు తిన్నరన్న మాట”.

ఔను 

సార్  ఆ సంస్థ గురించి మీకు బాగా తెలిసే ఉండాలే.

తెలుసు కాని ఈరోజే నెట్ సెర్చ్ చేస్తే వివరాలు తెలిసాయి.

సార్  సాత్విక ఆహారం ఎక్కువ గా ప్రకటనలు మీడియా లో ఇవ్వదు. కేవలం వాళ్ళు అందించే క్వాలిటీ వలెనే ఆ సంస్థ చాల పేరు సంపాదించింది. 

మీరు హోటల్ ఫుడ్ తినరు కనుక మేము అంతగా దీని గురించి చెప్పలేదు. పైగా అన్నాన్ని అమ్ముకోవడం అవైదికం అని మీరు ఖరాఖండి గా చెప్పడం తో నేను చొరవ చూపలేదు.

సాత్విక్ ఆహారం ఎం.డి గారి పూర్తీ పేరు ఏమిటి?

లక్ష్మి గారనే అందరికీ తెలుసు. 

ఓకే. 

వాళ్ళ అమ్మ నాన్న గారు ఎవరు?

నాకు తెలియదు సార్  కాని తెలుసుకొని చెప్పగలను 

ఏమీ లేదు ఈమె నాకు తెలిసిన వారి తాలూకు మనిషి అని ఒక అనుమానం అందుకే దాన్ని నివృత్తి చేసుకోవడానికి అడుగు తున్నాను. 

మోహన్ కి మొదటి సారి శ్రీనివాస్ కొంచం తడబడుతూ మాట్లాడుచున్నట్లు అనిపించింది. 

సంభాషణ ముగిసిన వెంటనే తన మిత్రుడు – సాత్విక్ ఆహారం 50 వ బ్రాంచ్ లో పనిచేస్తున్న రమణ కు ఫోన్ చేసాడు 

రమణ: హే  మోహన్ చాల కాలం తరువాత గుర్తుకి వచ్చానే!

మోహన్ : ఔను రా ఎలా ఉన్నావ్. పిల్లలు ఎలా ఉన్నారు 

రమణ: చాల హ్యాపీ గా ఉన్నాం మా ఎం. డీ చలవ అంతా.

మోహన్ : ఔను మీరు నిజంగా అదృష్టవంతులే. మీ ఎం. డీ గారి పూర్తీ పేరు ఏమిటి?

రమణ : లక్ష్మి గారనే అందరికీ తెలుసు. ఆమె దగ్గర పనిచేసే కవిత గారికి మాత్రమె ఆమె వివరాలు తెలుసు.  చాల సార్లు ఆమె అంటుంటారు పేరులో ఏముంది పని లో నిజమైన పేరుంది అని. అందుకే మేము ఆమె వ్యక్తిగత  విషయాల పట్ల అంత ఉత్సుకత చూపము.

మోహన్ : నిజం రా పేరులో కాదు పని లో పేరు ఉంటుంది. సరే మళ్ళీ కలుద్దాం.

వెంటనే తన భార్య వసంతకు ఫోన్ చేసాడు. 

ఔను నిన్ను మొన్న కవిత అని ఒకామె సాత్విక్ ఆహారం నుంచి కలిసింది అన్నావు కదా. నీకు ఆమెతో బాగా పరిచయమేర్పడింది అని కూడా అన్నావు. ఆ లక్ష్మి గారి పూర్తి  పేరు ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోగాలవా ?

ఎందుకు సడన్ గా ఈ ప్రశ్న అడుగుతున్నారు 

మన సార్  “సాత్విక్” ఆహరం తిన్నాక ఈ వివరాలు అడిగారు 

అలానా సరే నేను ట్రై చేస్తాను రేపు నేను వెళ్ళే కాన్ఫరెన్స్ కు ఆమె కూడా వస్తున్నారు రోజంతా ఇద్దరం అక్కడే ఉంటాం వీలు చూసుకొని అడుగుతాను. 

సరే.

 

***

 

నమస్కారం వసంత గారు.   నా పేరు సుధాకర్ నేను యు బ్యాంకు జి.ఎం ని. మా బ్యాంకు CSR కార్యక్రమాల ద్వారా మేము ప్రతి ఏడూ ఒక కొంత మొత్తాని మా బ్రాంచ్ నుంచి చక్కని సామాజిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తాము  ఈ సం .రం. మీ ఆలంబన ద్వారా ఏదైనా కార్యక్రమం చేద్దా  మని అనుకుంటున్నాము.  ఈ విషయంపై మిమ్మిల్ని కలవాలి.

 

తప్పక రండి సార్. మీకు ఎప్పుడు వీలుంటుందో అప్పుడే మాకూను.

థాంక్స్ వసంత గారు 

వచ్చే శనివారం సాయంత్రం 4.గం.లకు వస్తాను 

వెల్కమ్ సర్. 

***

కాన్ఫరెన్స్ లో ఒక వక్త చాల గంభీరం గా ప్రసంగిస్తున్నారు.  ఆయన చెప్పిన ముగింపు మాటలతో కాన్ఫరెన్స్ ముగిసి పోయింది.

వసంత కవిత పక్క పక్కనే కూర్చున్నారు.

హై టీ కి జాయిన్ అవమని విన్నపం రావడం తో వాళ్ళిద్దరూ హాల్ కి ఆనుకొని ఉన్న లాన్ వైపు కి నడిచారు.

వసంత :  మిమ్మల్ని మళ్లీ  కలవడం చాల సంతోషం గా ఉంది 

కవిత : ఆ మాట నేను చెప్పాలి ఎందుకంటే వ్యాపారం కంటే సేవ ఉన్నతమైనది ఎప్పటికీ.

వసంత : మీది కూడా సేవే ఎందుకంటే లాభం మీ ముఖ్యోద్దేశ్యం కాదు కనుక 

కవిత: ఔను ఇదే మాట మా లక్ష్మి గారు కూడా అంటారు 

వసంత : మీ లక్ష్మి గారి పూర్తీ పేరు ఏంటి?

కవిత : భాగ్యలక్ష్మి 

వసంతలో ఒక్కసారిగా ఉద్విగ్నత పెరిగిపోయింది… సంయమనం తో మరలా సాధారణంగానే మాటలు కొనసాగించింది.

కవిత:  మా లక్ష్మి గారు ఒక విలక్షనమైన వ్యక్తి. ఆమె మాట్లాడుతుంటే అలా చూస్తూ వింటూ ఉండిపోతాను.

వసంత: లక్ష్మి గారు అవివాహితగానే ఉండిపోయారు ఎందుకు? మీకు అభ్యంతరం లేదంటేనే చెప్పండి.

కవిత : మన మనసులు ఇంత గా కలిసాక నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడం లో భద్రత ఉంటుందనే భరోసా ఎప్పుడో కలిగింది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది ఆ వ్యక్తి ఆమె కలలకే పరిమితమైన వ్యక్తీ అందుకే వివాహం చేసుకోవడం కుదరలేదు కనుక అవివాహితగానే ఉండిపోయారు!

వసంత:  ఓహ్! 

కవిత : నేను మీకు చెబుతున్న విషయాలు లక్ష్మి గారు నాపై నమ్మకంతో చెప్పినవి. ఆమెకు ఈ విషయాలు ఇతరులకు తెలియడం తద్వారా ఇతరుల నుంచి సలహాలు మొ.నవి పొందడం ఇష్టముండదు.

వసంత : అర్ధమైంది. నాపై భరోసాతో చెబుతున్న ఈ మాటలు నాతోనే ఉండిపోతాయి. ఇది నా మాట మీకు.

కవిత : నాకు తెలుసు అందుకే మీకు చెప్పదలచాను. గతంలో ఒకాయన ఆమెను వివాహం చేసుకుంటాను అని ముందుకు వచ్చాడు. చాల ప్రయత్నం చేసాడు కూడా చివరకి లక్ష్మి గారు ఆయనతో ముఖతః మాట్లాడి ఆయన్నే కన్విన్సు చేసి ఆయనతో నమస్కారం పెట్టించుకొనే స్థితికి చేరారు .   అది మా ఆఫీసు లోనే జరిగింది . అప్పటి నుంచి ఎవరూ ఇక అటువంటి ప్రయత్నం చేయలేదు.

గతం మర్చిపోయిన వ్యక్తిగా మరొక వ్యక్తితో ఒక విచిత్రమైన కాలం గడిపి, మరల గతం స్మృతికి వచ్చి ఆవ్యక్తితో గడిపిన కాలం కలలు గా మారి ఆమెను ఒక వింతైన పరిస్థితి లో ఉంచాయి. 

 

వసంత : ఒక్కసారిగా ఉత్కంఠ కు గురియైంది. ఒక్క సారిగా ఆమెకు గత ఆదివారం రాత్రి  తన భర్త మోహన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

ఆ మాటలు అలవోకగా ఆమె పలికింది…

భగవంతుడు ఘటనాఘటన సమర్ధుడు, అత్యద్బుత సమన్వయ కర్త మనుషుల కర్మలను వాటి ఫలితాలను ఏక కాలంలో అనూహ్యమైన రీతిలో జోడిస్తూ ఎన్నో జీవుల జీవితాలను ప్రతి క్షణం ప్రభావితం చేస్తూ అంతటా ఉంటూ అన్నీ  నడిపిస్తాడు  అందుకే ఆయన సర్వోత్తముడు.  ఇది ఈ క్షణం మరొక్క సారి ఋజువైంది.

వసంత మాటలు వింటూ కవిత నిస్చేష్టురాలై ఉండిపోయింది.

మళ్ళీ వసంతే మాట్లాడుతూ…. కవిత గారు  ఈరోజు మన సంభాషణ ఒక అధ్బుత మైన కార్యానికి ఒక వింతైన  కలయిక కు  నాంది పలికింది . మనం ఆ జగన్నాటక సూత్రధారి కి పనిముట్లుగా మరి ఒక మంచి కార్యాన్ని జరుపబోతున్నాము. మీ లక్ష్మి గారి కలల  ప్రేమికుడు మా నాయకుడు శ్రీనివాస్ గారు. మీ లక్ష్మి గారే మా శ్రీనివాస్ గారి భాగ్యలక్ష్మి. 

ఈసారి కవిత ఇంకా ఆశ్చర్య పోయింది. 

నా భర్త పేరు గోపాల్ ఆయన ఒక మంచి న్యాయవాది కేవలం డబ్బే పరమావధి గా కాకుండా న్యాయం కోసం పని చేస్తాడు.  నేను సంపాదిచిన దానితో మా కుటుంబ పోషణ చాల చక్కగా జరిగి పోతుంది. అందుకే ఆయన కొన్ని కేసులకు కేవలం ఖర్చులు మినహా ఫీజు తీసుకోకుండా పనిచేస్తాడు. చాల సార్లు ఆయన వాళ్ళ కేసులు నెగ్గిన వాళ్ళు వాళ్లంతట  వాళ్ళే తమకు తోచిన పారితోషికం ఇస్తారు కొందరు చిన్న చిన్న  ఇస్తారు .  ఆయన చాల పదిలంగా చూసుకుంటారు. మా కప్ బోర్డు లో అలాంటివి చాల ఉన్నాయి. ఆయన కూడా ఇదే మాట అంటారు.

మనమంతా ఆ భగవంతుని పనిముట్లము అని. మీ వారు కూడా అదే మాట అన్నారు.    నిజాలు ఇలానే ఉంటాయి కదా.

వెంటనే తన సహోద్యోగికి ఫోన్ చేసి ఈరోజు నేను బయట పని ఉండి వెళ్తున్నాను రేపు సంతకాలు చేస్తాను అని చెప్పింది. 

వసంత గారు ఇప్పుడు మనం  మా ఇంటికి వెళ్ళాలి  అర్జెంటు గా అని ఆమెను బయలుదేరతీసింది. వసంత కూడా యాంత్రికం గా ఒక సంభ్రమాని కి లోనై  చాల సంతోషం తో “అలాగే” అని కూడా నడిచి కార్ ఎక్కింది. వసంత తన డ్రైవర్ కి ఈరోజుకి నీకు ఇక పనిలేదు ఇంటికి వెళిపో  అని చెప్పి తనే డ్రైవ్ చేసింది 

కార్ లో వసంత మీరు అనుమతిస్తే నా భర్త మోహన్ ని కూడా పిలవాలి శ్రీనివాస్ గారి కి ఆయన అనుంగు శిష్యుడు . తప్పక కుండా కాల్ చేసి రమ్మనండి అని చెప్పి వసంత తన భర్త గోపాల్ ఒక మంచి న్యాయవాది కేవలం డబ్బే పరమావధి గా కాకుండా న్యాయం కోసం పని చేస్తాడు.

***

భాగ్య లక్ష్మి ఎప్పటిలా సాదా సీదా దుస్తుల్లో  తయారై కవిత చెప్పిన చోటుకి వచ్చింది అది విశాఖ సముద్ర తీరం భీమిలి కి కొంచం దూరం లో ఉన్న ఒక చిన్న పొదరిల్లు లాటి కాటేజీ. సాయం సంధ్యా సమయం అక్కడే అప్పటికే వచ్చి ఉన్నాడు శ్రీనివాస్ అక్కడ – సముద్రం  వైపుకి ఉన్న బల్లపై కూర్చొని. 

కవిత, వసంత మోహన్ గోపాల్ కూడా వచ్చి ఉన్నారు. భాగ్యలక్ష్మి రాగానే ఆమెను తోడ్కొని శ్రీనివాస్ ముందుకు తీసునోని వచ్చింది కవిత. 

శ్రీనివాస్ పైకి లేచి చేతులు జోడిస్తూ అచేతనం గా భాగ్యలక్ష్మి వైపు చూస్తూ ఉండి  పోయాడు. భాగ్య లక్ష్మి శ్రీనివాస్ వంక చూసి తనూ అచేతనం గా ఉండి పొయిన్ది. 

కవిత, వసంత, గోపాల్, మోహన్లు అక్కడినుంచి నిష్క్రమించారు. 

ఒక అల చాల సౌమ్యగా వడ్డు ని తాకింది. 

ఒక్క క్షణం గాలి స్తంభించింది ఇరువురి నడుమ.

భాగ్యలక్ష్మి ముందు గా తేరుకొని శ్రీనివాస్ చేతిని తన చేతిలోకి తీసుకొని “ఎక్కడి కి వెళ్లి పోయావ్ శీను ” అని ఎంతో బేలగా అడుగుతూ ఆనందం దుఖం కలసి పోయి కన్నీరు మున్నీరైంది. 

శ్రీనివాస్ “భాగ్యం” అని సుతారంగా దగ్గరకు తీసుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు. 

ఏడుపు ఇప్పుడు వాళ్ళకు వేలుపు !!

 

//శుభం //

Your views are valuable to us!