హేతువే లేని హేతువాదం – హిందూ ద్వేషం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

మత బోధకులు సైన్సు చదువుకుంటే మంచిది” – డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘అన్నీ వేదాల్లో ఉన్నాయష’- అని ఎవరైనా మాట్లాడితే వారివి పిచ్చి మాటలే అవుతాయి. ఆ కాలానికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం మాత్రమే అందులో ఉన్నాయి. తర్వాత, అత్యాధుని కంగా మనిషి అంతరిక్షంలో సాధిస్తున్న విషయాలు అందులో లేవు. గణితానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి జోడీ కుదిర్చి సమకూర్చుకున్న విజ్ఞానం -పురాణాలలోనూ, వేదాలలోనూ, ఇతర ఏ మత గ్రంథాలలోనూ లేదు. ఇది వాస్తవం. సమకాలీనంలో బాలబాలికలకు, సామాన్య పౌరులకు ఉన్న వైజ్ఞానిక అవగాహన ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు. ఆ సమాజాలకు వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు. కానీ నేడున్న మేధాశక్తికి వారు సరితూగరు. ప్రాచీనులు మనకు గౌరవనీయులు. వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే అయినా, ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది. అలాగని వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు.

సమాజం మారిపోయింది. సమాజ అవసరాలు మారిపోయాయి. ఆ రాజులూ, ఆ రాజ్యాలు, కత్తులు, బల్లాలు, గుర్రాలు, తోపులూ అన్నీ మాయమై పోయాయి. ఇక్కడ ప్రయోగిస్తే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాల యుగంలో ఉన్నాం. వందేళ్ల కిందట పొద్దున్నే లేచి అమరం చదివేవాడు, గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించేవాడు జ్ఞాని, పండితుడుగా చలామణి అయ్యాడు. ఇప్పుడవి పనికి రానివయ్యాయి. విద్యావంతుల సంఖ్య పెరిగింది. ఆలోచనాపరులు ఎక్కువయ్యారు. పిల్లల విజ్ఞానం, ప్రతిభ చూస్తుంటే పెద్దలే హడలిపోతున్నారు. నేను చూసిన కొందరు పిల్లలున్నారు. మొదట, టీచరు వారికి పదుల్లో 20 సంఖ్యలు చెప్పారు. ఆయన చెప్పడం ఆపగానే వారు ఆ సంఖ్యలు మొత్తం చెప్పేశారు. కాలిక్యులేటర్‌ నొక్కుతూ కూర్చున్న వాళ్లు సైతం అంత త్వరగా చెప్పలేరు. ఆ తర్వాత టీచర్‌ వందల్లో యాభై సంఖ్యలు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా వారు, వాటి మొత్తం టక్కున చెప్పేశారు. తర్వాత అదే కూడిక వేలల్లో జరిగింది. పలకా బలపం కానీ, పెన్నూ కాగితం కానీ ఉపయోగించకుండా, ఊరికే వింటూ మెదడులోనే కూడికలు చేసుకుంటూ చెప్పారా పిల్లలు. గణితంలో ఇంత అద్భుతమైన శక్తి పూర్వకాలంలో ఎవరికీ ఉన్నట్టు మనం వినలేదు. ఈ ఆధునిక కాలంలోనే శకుంతలా దేవి పేరు విన్నాం. కానీ పదేళ్ల పిల్లలో ఇంత ‘తెలివి’ ఉండడం మామూలు విషయం కాదు. వాళ్లు దేనికైనా ఘనం, ఘన మూలం కూడా చెప్పేశారు.

BUY: Writing Across a Cracked World: Hindu Representation and the Logic of Narrative

ఇక కళల విషయానికొస్తే, యాభై యేళ్ల క్రితం, తన ఇరవయ్యోయేట ఓ ప్రసిద్ధ గాయని పాడిన పాటను ఇప్పుడు పదేళ్లలోపు పిల్ల అచ్చు అలాగే పాడగలుగుతోంది. అంటే కొత్త తరాలు ఎంత మేధోశక్తితో, కళా సంపత్తితో ఉన్నాయో మనం గమనించవచ్చు. నాకో అబ్బాయి తెలుసు. వాడికి నాలుగు సంవత్సరాలు. సుమారు డెబ్బయి దేశాల రాజధానుల పేర్లు చెబుతున్నాడు. గ్రహాలపేర్లు, ముఖ్యమైన వైజ్ఞానిక ఆవిష్కర్తలైన శాస్త్రజ్ఞుల పేర్లూ చెబుతున్నాడు. వార్తల కెక్కుతున్న ఇలాంటి చిన్నారుల్ని మనం టెలివిజన్‌ షోలలో కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రాథమిక సమాచారం, అవగాహన, ప్రవచన కారులకు ఏమైనా ఉందా? గమనించండి. వారి దగ్గరున్న పాత సామాను తెచ్చి మన దగ్గర ‘సరుకు’ చేసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల. రెండు- తల్లిదండ్రులిస్తున్న ప్రోత్సాహం వల్ల. మూడు- బాల్యంలో దొరికిన మంచి ఉపాధ్యాయుల వల్ల ఇలాంటివి సాధ్యం!! నేర్చుకోవడం, అభ్యాసం చేయడం, ఇది మానసిక ఆరోగ్యంలో భాగం. అంతేగాని ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, కరుణా కటాక్షాల వల్లనో కాదు. పిల్లలతో భారతం- భాగవతం పద్యాలు వల్లె వేయిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందేమో గాని, ఈ కాలానికి పనికొచ్చే లోకజ్ఞానం, అవగాహన పెరగదు.

ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం అంటూ జనాన్ని మోసగించే అన్ని మతాల మత బోధకులూ మామూలు మనుషులే! గతంలో సాయిబాబా బెడ్‌రూంలో మూడు హత్యలు జరిగి, ముగ్గురు యువకులు చనిపోతే ఆయన ఆత్మశక్తి ఏమైంది? పోలీసులెందుకు రావాల్సి వచ్చింది? విషయాలేవీ బయటికి పొక్కకుండా ఆయన తన రాజకీయ పరిచయాలను ఎందుకు ఉపయోగించుకోవాల్సి వచ్చింది? ఆయన తన ఆత్మశక్తితో విషయాలన్నీ వివరంగా ప్రజలకు చెప్పాల్సింది కదా? విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్న మానవుడికి ఈ మత బోధకుల రహస్యాలు విప్పడం ఒక లెక్కా? అసలైతే రహస్యాలేవీ లేవు. వారివి బూటకాలు, నాటకాలు కాబట్టే సామాన్యుల్ని సంశయంలో పడేస్తున్నారు. అన్ని మతాల మతబోధకులు కొంత ఖగోళ శాస్త్రం, కొంత జీవ శాస్త్రం, కొంత రసాయన శాస్త్రం, పరిణామ శాస్త్రంలోని కొన్ని ప్రాథమిక అంశాలు చదువుకొంటే బాగుంటుంది. అవి తెలుసుకోకుండా ఇప్పుడు వారు చెప్పేదేమీ లేదు. ఏదో చెప్పాలన్న ఉబలాటం గురువులకు, ప్రవచనకారులకు ఉంటే ఉండొచ్చు. అది వారి బలహీనత- సామాన్య జనానికి ఇప్పుడు వారికన్నా ఎక్కువ విషయాలే తెలుసు. మరోపని లేక ప్రవచన- కాలక్షేపానికి వెళ్లి కూర్చునే వారు కొందరైతే, ఆ పంతులు గారికెంత తెలుసో చూద్దాం అని వెళ్లేవారు కొందరు. పాత సారాని కొత్త సీసాలో ఏమైనా పోస్తున్నారా? పాత పురాణాలకు కొత్త ఆధునిక విశ్లేషణలేమైనా ఇస్తున్నారా? అని ఆలోచించే వారు కొందరు. ఇలా నానా రకాల వాళ్లుంటారు.

ఈ తరం వారు యాబై ఏళ్లు వస్తేగాని ఎల్‌ఈడి టీవీ చూడలేకపోయారు. ఇప్పటి పిల్లలు పుట్టుకతోనే చూడగలుగుతున్నారు. విశ్వ విజ్ఞానాన్ని తమ స్వంతం చేసుకుంటూ ఎదుగుతున్నారు. మరి ఇంకా ఎందుకండీ రాముడి కథలూ, భీముడి కథలూ, అభూత కల్పనలూ? వ్యక్తిత్వ వికాసానికి విషయాలు కావాలంటే ప్రపంచ చరిత్రలో నీతిపరులు, నిజాయితీ పరులు, పోరాట వీరులు, త్యాగాధనులు ఎంతో మంది ఉన్నారు. పురాణ పురుషుల వ్యక్తిత్వాలు-చెప్పుకునేవారికి కాలక్షేపమేగానీ, వినే వారికి వాటివల్ల ఉపయోగం లేదు. ఈ కాలంలో పిల్లలు జై హనుమాన్‌ను సూపర్‌మ్యానులా చూస్తున్నారు తప్పితే, వెనకటి రోజుల్లో లాగా భక్తి భావమూ, తన్మయత్వమూ ఉండడం లేదు. ఇక ఈ ప్రవచనకారులు వారి ధోరణి మార్చుకుని, పర్యావరణ పరిరక్షణ గురించి, ధరిత్రీ దినోత్సవం గురించి మాట్లాడాలి. ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకోవాలి లాంటివి చెపితే సమాజానికి మేలు చేసినవారౌతారు. జన్మలు, పునర్జన్మలు, అతీంద్రియ శక్తులు, క్షుద్ర శక్తులు వంటివి బోధించకుండా విశ్వాంతరాళం గురించి అధ్యయనం చేసి జనానికి చెప్పాలి. మనం చెప్పుకునే పుక్కిటి పురాణాలకు, సైన్సు సిద్ధాంతాలకు ఎక్కడ తేడా వస్తోంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారెంత నెత్తీ నోరూ బాదుకున్నా ఆ పురాణ పాత్రల్లో ఏ ఒక్కటీ కూడా సజీవంగా ఈ ప్రపంచం లోకి రాదు-వారిని బొందితో స్వర్గానికి తీసుకుపోదు. అందువల్ల వారు కాస్త మనుషుల్ని మనుషుల్లా చూస్తు, తాము కూడా మానవమాత్రులమేనన్న వాస్తవాన్ని జీర్ణించుకోవాలి.

మత పెద్దలు ఒకప్పుడు సైన్సు ఎదగకుండా శాస్త్రజ్ఞుల్ని మట్టుబెట్టారు. వారి ఆధిక్యతను ప్రశ్నించినందుకు చంపేశారు. అదంతా గతం. ఇప్పుడు ప్రశ్న బలపడింది. జవాబులు చెప్పగలగాలంటే నిరంతర అధ్యయనం, పరిశీలన, పరిశోధన అవసరం. జ్ఞానానికి కూడా అర్థం మారింది. అందువల్ల మత బోధకులే మతాల అడ్డుగోడల్ని కూలగొట్టే పని ప్రారంభిస్తే మంచిది. అప్పుడు జనం స్వచ్ఛందంగా ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటారు. ప్రేమలు పెంచుకుంటారు. ఆత్మీయతను పంచుకుంటారు. ఆ ప్రయత్నంలో విశ్వ మానవ గీతికను పాడుకుంటారు.

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌)

*****

ఇది చదవటం మొదలుపెట్టగానే హేతువాదులకి చాలా ఉత్సాహం వేస్తుంది – “అబ్బో!మతవాదులని భలే చివాట్లు పెట్టాడు మనోడు” అని. సరే, మనోళ్ళు కూడా ఆయన పెడుతున్న చివాట్లకి గింజుకుంటూనే ఉంటారు. అయితే నాకు మాత్రం చదువుతూ ఉండగానే ఆయన వాదనలోని తప్పులు తెలిసిపోయాయి.ముఖ్యమైన “చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల” అన్న వాక్యం దగ్గిర ఇతని నిజస్వరూపం కళ్ళకి కట్టినట్టు గోచరించింది!

BUY: Academic Hinduphobia: A Critique of Wendy Doniger’s Erotic School of Indology
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే క్రైస్తవం పుట్టిన మూడు వందల సంవత్సరాల తర్వాత అది బలపడటం మొదలైన నాటి నుంచి వెయ్యేళ్ళపాటు ప్రపంచాన్ని కమ్మేసిన చీకటి యుగం తర్వాత జనం  తలుపులన్నీ మూసేసి కొడుతుంటే తిరగబడిన పిల్లిలా తయారై చీపురుకట్ట తిరగేసిన రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మోడర్న్ సైన్సుకి సూడో సైన్సు అనే పిలక కూడా ఒహటి ఉంది. నిజమైన సైన్సు కొడుతున్న దెబ్బలకి పునాదులు కదిలిపోకుండా రక్షించుకోవడానికి చర్చి తరపున కొందరు తయారై దీన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు “ఈజిప్షియన్ పిరమిడ్లని ఎవరు కట్టారు?” అనే ప్రశ్నకి “ఏలియన్సు కట్టారు!” అనే జవాబు చెప్పటం, ఆధారాలు ఉండవు గాబట్టి అనుమానమే ప్రమాణం అనే తరహా వాదనల్ని ఎత్తిపొయ్యటం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నిజమైన పరిశోధాన ఏదో చేసినట్టు హడావిడి చేసి ఆదాము ఎముక దొరికిందనో నోవా గారి పడవ ముక్కలు కనబడ్డాయనో వార్తా కధనాల్ని వడ్డించుతారు కూడాను. ఈ దేవయ్య గారు కూడా ఆ బాపతే – మన ఖర్మ కొద్దీ ఈయాన జూవాలజీ లెక్చరర్ అయ్యి ఇన్నాళ్ళూ మనోళ్ళని హడలగొడితే ఇవ్వాళ తన ఖర్మ కొద్దీ ఈ వ్యాసం చదివిన నాకు దొరికిపోయాడు!

నేను ఇప్పుడు తప్పులని అంటున్నవి సామాన్యమైన తప్పులు కావు. హిందూమతం పట్ల ఎంతో ద్వేషం ఉంటే తప్ప ఇలాంటి వ్యాసంను ఎవడూ రాయలేడు. ఈయన పేరు నాకు తెలుసు. సుప్రసిద్ధ సాహితీవేత్త పేరున ఈయన రచనలని పరిచయం చేస్తూ ఇతరులు రాసిన ప్రశంసలు చదివాను. అయితే నేను చదివిన మొదటి రచన ఇదే. దీని తర్వాత యోగాని విమర్శిస్తూ రాసిన మరొక రచన కూడా చదివాను. రెండు చోట్లా సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌ అనే ముక్కని తగిలించడం క్రెడిబిలిటీ కోసం వేస్తున్న ఎర అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఈయన చేసే కొన్ని తప్పుడు వాదనల్ని కనీసపు కామన్ సెన్సు ఉన్నవాడు కూడా చెయ్యడు – అవి కేవలం మితిమీరిన హిందూద్వేషం ఈయన కళ్ళకి మదం పొరల్ని కప్పించితే ఉఛ్చనీచాలు మరిచిపోయి చేస్తున్న వెటకారపు విసుర్లు.

తెలివితక్కువ వాదన1:

సమకాలీనంలో బాలబాలికలకు, సామాన్య పౌరులకు ఉన్న వైజ్ఞానిక అవగాహన ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు. ఆ సమాజాలకు వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు. కానీ నేడున్న మేధాశక్తికి వారు సరితూగరు. ప్రాచీనులు మనకు గౌరవనీయులు. వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే అయినా, ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది. అలాగని వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు.

నా ప్రశ్నలు:

1.”విద్యావంతుడు”, “మేధావి” అనే పదాలకి అర్ధం ఏమిటి?మొదట మీ అంతట మీరు గానీ ఆయన్ని అడిగి కానీ నిక్కచ్చి జవాబు చెప్పాలి – నిఘంటు అర్ధం సేకరించి ఇక్కడి సందర్భానికి తగిన ఒక్క అర్ధం చెబితే చాలు.

నేను అర్ధం చేసుకున్నది ఇది: ఇప్పటి కాలంలో కేవలం చదవడం రాయడం వచ్చినవాళ్ళు కూడా అప్పటి వైదిక ఋషుల కన్న తెలివైనవాళ్ళు, చాలా ఎక్కువ స్థాయిలో వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అని ఆయన చెబుతున్నారు. అవునా? ప్రవీణ్ మోహన్ అనే వ్యక్తి అగస్త్య సంహితని మక్కీకి మక్కీ ఫాలో అయ్యి ఎలెక్ట్రిక్ బ్యాటరీ తయారు చేశాడు. అది యూట్యూబులో వెతికితే దొరుకుతుంది. మీరూ చూడవచ్చును. మిమ్మల్ని కాదు ఆ దేవయ్య గారినే నేను ఛాలెంజి చేస్తున్నాను – ఒక అయిదో తరగతి కుర్రాడితో గానీ B.A Economics చదివిన విద్యాధికుడితో గానీ వోల్టాయిక్ సెల్ తయారు చేయించగలరా?

2.వ్యాసాలు మాత్రమే కాదు కదా, ఆయన కూడా కవిత్వం చెప్పారు, కధలు రాశారు. అయినా పురాణ కధలు కల్పితం అని తెలియకపోవడం విచిత్రంగా ఉంది! కాశీ మజిలీ కధల్లోనూ సైన్సు ఉండదు, భేతాళ కధల్లోనూ సైన్సు ఉండదు.  మరి పురాణకధలు రాసేవాళ్ళకి సైన్సు తెలియాల్సిన అవసరం ఏమిటి?

3.అగస్త్య సంహితలో వెతకాల్సిన సైన్సుని పుక్కిటి పురాణాల్లో వెతుకుతున్నారు, ఎంత పిచ్చివాళ్ళు మీరు! ఒక బ్రాహ్మడు, నల్లమేక, నలురుగు దొంగల కధల లాంటి నీతి కధలు రాయటానికి సైన్సు దేనికి?

ఆ చెప్పేది కూడా నిబద్ధం కాదు – “ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు”, “వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు” అనే వూహాగానాలు మళ్ళీ!

4.”ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది.” అని అంటూనే ఆ వెంటనే “ప్రాచీనులు మనకు గౌరవనీయులు. వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే, వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు” అని కూడా అనగలిగిన వారు శ్రీ దేవయ్యరాజు మహదేవయ్యరాజు వారు – హిందువులమేదో ఏడ్చిపోతామని జాలి కాబోలు!

తెలివితక్కువ వాదన2:

పిల్లల విజ్ఞానం, ప్రతిభ చూస్తుంటే పెద్దలే హడలిపోతున్నారు. నేను చూసిన కొందరు పిల్లలున్నారు. మొదట, టీచరు వారికి పదుల్లో 20 సంఖ్యలు చెప్పారు. ఆయన చెప్పడం ఆపగానే వారు ఆ సంఖ్యలు మొత్తం చెప్పేశారు. కాలిక్యులేటర్‌ నొక్కుతూ కూర్చున్న వాళ్లు సైతం అంత త్వరగా చెప్పలేరు. ఆ తర్వాత టీచర్‌ వందల్లో యాభై సంఖ్యలు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా వారు, వాటి మొత్తం టక్కున చెప్పేశారు. తర్వాత అదే కూడిక వేలల్లో జరిగింది. పలకా బలపం కానీ, పెన్నూ కాగితం కానీ ఉపయోగించకుండా, ఊరికే వింటూ మెదడులోనే కూడికలు చేసుకుంటూ చెప్పారా పిల్లలు. గణితంలో ఇంత అద్భుతమైన శక్తి పూర్వకాలంలో ఎవరికీ ఉన్నట్టు మనం వినలేదు. ఈ ఆధునిక కాలంలోనే శకుంతలా దేవి పేరు విన్నాం. కానీ పదేళ్ల పిల్లలో ఇంత ‘తెలివి’ ఉండడం మామూలు విషయం కాదు. వాళ్లు దేనికైనా ఘనం, ఘన మూలం కూడా చెప్పేశారు.

నా ప్రశ్నలు:


BUY: Rearming Hinduism: Nature Hinduphobia and the Return of Indian Intelligence
1.అలా టీచర్లని కూడా హడలగొట్టగలిగిన కుర్రాళ్ళు ఈ కాలంలోనే చాలా చాలా తక్కువమంది అని ఆయనకి తెలియదా?మరి, ఎక్కడో నూటికో కోటికో అలాంటి కుర్రాళని చూపించే హడావిడిలో వాళ్ళ క్లాసులోనే రెండు రెళ్ళు ఎంత అని అడిగితే దిక్కులు చూసే మొద్దబ్బాయిలు కూడా ఉండే ఉంటారు కదా! అయినప్పటికీ ఆ కొందరు కుర్రాళ్ళ తెలివితేటల్ని మొత్తం జనరేషన్ పిల్లలకి ఎట్లా దఖలు పర్చేశారు?

2.”పొద్దున్నే లేచి అమరం చదివేవాడు, గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించేవాడు” రోజంతా అదే పని చేస్తూ కూర్చుంటాడా? దివారాత్రాల కున్న 24 గంటల్లో ఆరోగ్యవంతుడైన మనిషి 10 గంటల పాటు చురుగ్గా ఉండగలడు. పని త్వరగా పూర్తి చెయ్యాలన్న తొందర ఉంటే రెండేసి రోజూల పాటు కోడి నిద్రతో సరిపెట్టుకుని కూడా పని చెయ్యవచ్చును. ప్రాజెక్టుకి డెడ్ లైన్ వచ్చినప్పుడు నేనూ మా కొలీగ్సు కూడా అలాగే పనిచేసిన అనుభవం ఉంది – దేవయ్య గారికి అలవాటు లేదేమో పాపం!

అగస్త్యుడూ వరాహ మిహిరుడూ కేవలం పొద్దున్నే లేచి అమరం చదవడం వల్ల గానీ గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించడం వల్ల గానీ పేరు తెచ్చుకోలేదు. వారి జీవిత సాఫల్య కృషి వేరే ఉంది. అది ఆయనకూ తెలుసు! తమ నమ్మకాలకి విరుద్ధమైన నమ్మకాలు ఎదటివాళ్ళలో ఉండడమే భరించలేని సంస్కారహీనులు దేవయ్యరాజు మహదేవయ్యరాజు లాంటివాళ్ళు.

తెలివితక్కువ వాదన3:

చిన్నపిల్లలు ఇన్ని తెలివితేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల. రెండు- తల్లిదండ్రులిస్తున్న ప్రోత్సాహం వల్ల. మూడు- బాల్యంలో దొరికిన మంచి ఉపాధ్యాయుల వల్ల ఇలాంటివి సాధ్యం!!

నా ప్రశ్నలు:

1.చురుకైన పిల్లలు స్కూల్లో టీచర్లని హడలగొట్టగలగడానికి కారణం ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించడం అని చాలా చక్కటి రీజనింగు చెప్పిన వ్యక్తికి ఒకనాటి వారికి ఇప్పటివారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం లేదని నిర్ధారించడం ఎట్లా సాధ్యపడింది? మా చిన్నప్పుడు రేడియో తప్ప టెలివిజను లేదు. ఇవ్వాళ మా అమ్మాయి టీవీ చూడకుండా పెరగడం నీ తెలివితక్కువతనం అని నన్ను వెక్కిరిస్తే ఎట్లా ఉంటుంది – అది తెలివైన మాటేనా? ఏమిటీ పిచ్చ లాజిక్కు! అఫ్ కోర్స్ “ఉండి ఉండదు” అనే చెప్పారు కదా అని అనవచ్చు. కాబట్టి దీని శాస్త్రీయతను మీ విచక్షణకే వదిలేస్తున్నాను.

తెలివితక్కువ వాదన4:

ఈ తరం వారు యాబై ఏళ్లు వస్తేగాని ఎల్‌ఈడి టీవీ చూడలేకపోయారు. ఇప్పటి పిల్లలు పుట్టుకతోనే చూడగలుగుతున్నారు. విశ్వ విజ్ఞానాన్ని తమ స్వంతం చేసుకుంటూ ఎదుగుతున్నారు. మరి ఇంకా ఎందుకండీ రాముడి కథలూ, భీముడి కథలూ, అభూత కల్పనలూ? వ్యక్తిత్వ వికాసానికి విషయాలు కావాలంటే ప్రపంచ చరిత్రలో నీతిపరులు, నిజాయితీ పరులు, పోరాట వీరులు, త్యాగాధనులు ఎంతో మంది ఉన్నారు.

నా ప్రశ్నలు:

1. నిన్నటి తరం వాళ్ళు యాభయ్యేళ్ళ వయస్సులో గానీ చూడలేనివి ఈనాటి పిల్లలు పుట్టుకతోనే ఎట్లా చూడగలుగుతున్నారు? ఆ తరం వాళ్ళు తయారు చెయ్యడం వల్లనే కదా! నాకు ఇబ్బంది కలిగించిన విషయం నా తర్వాత తరానికి కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక తరం తయారు చేసిన వస్తువులు తర్వాత తరానికి ఉనికిలోకి రావడం అనాది కాలంనుంచీ జరుగుతూనే ఉన్నదనే కామన్ సెన్సు కూడా లేదా మీకు? ఇవ్వాళే మీరు కనుక్కున్న అద్భుత సత్యంలా ఆవిష్కరిస్తున్నారే!

2. చివరలో చదివిన లిస్టులోని మహావీరులూ, త్యాగధనులూ వారి చిన్నతనంలో వారి పెద్దలు పరిచయం చేసిన పురాణ కధలు చదివి ఆయా పాత్రలతో తాదాత్మ్యం పొందడంవల్లనే ఆయా ఘనకార్యాలు చేశామని వారే చెప్పుకున్నారు కదా!వాళ్ళతో సరిపెట్టేసుకుని కొత్తగా ఎవరూ గొప్పవాళ్ళు కానక్కరలేదనా మీ ఉద్దేశం?

అశాస్త్రీయమైన వాదన1:

చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల.

నా ప్రశ్నలు:

హిట్లర్ మరియు కొందరు జాత్యహంజారులు తమ జాతికి చెందినవారు పుట్టుకతోనే తెలివైనవారు కాబట్టి ఆచంద్రతారార్కం తామే అధికారంలో ఉండటం తప్పు కాదు అని చెప్పుకోవడానికి భారీ పెట్టుబడులు పెట్టి అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు సమకూర్చి మంచి మంచి జీతాలు ఇచ్చి కెరీరిస్టు/రేసిస్టు సైంటిష్టుల్తో ఇలాంటి సిద్ధాంతాల్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు.

శాస్త్రప్రపంచంలో దీనికి అధికారికమైన గుర్తింపు లేదు. ఆయన కొందరు శాస్త్రజుల వాదన అని కూడా అనటం లేదు. జన్యుపరమైన వారసత్వం వల్ల కొందరు పిల్లలు ఎక్కువ తెలివితేటల్ని ప్రదర్శించడం సహజమైనదే అని అంటున్నారు. పురాణాలు వ్రాసేవారికి సైన్సు తెలియాలని ఉచిత బోడిసలహాలు ఇస్తున్న ఈ దేవరజు మహారాజు గారికి తను సమర్ధిస్తున్నది రేసిస్టు సైన్సు అని ఎందుకు తెలియడం లేదు? క్రైస్తవ జాత్యహంకారుల లాబీయింగ్ వల్ల దీనికి గుర్తింపు లభించినప్పటికీ నేను దీన్ని వొప్పుకునే ప్రసక్తి లేదు. మరి మీ సంగతి యేంటి? ఆయనతో ఏకీభవిస్తున్నారా? దీన్ని మీరు వొప్పుకుంటే హిందువులు బ్రాహ్మణులకి ఆధిక్యతని కట్టబెట్టటాన్ని కూడా మీరు సమర్ధించాల్సి ఉంటుంది, కనీసం వ్యతిరేకించకూడదు – ఆలోచించుకోండి!

హాస్యాస్పదమైన వాదన: మత పెద్దలు ఒకప్పుడు సైన్సు ఎదగకుండా శాస్త్రజ్ఞుల్ని మట్టుబెట్టారు. వారి ఆధిక్యతను ప్రశ్నించినందుకు చంపేశారు.

నా మాట: ఈ దరిద్రానికీ హిందువులకీ ఎలాంటి సంబంధమూ లేదు.ఇది అబ్రహామిక్ మతాలు, ముఖ్యమైనవి క్రిస్టియన్, ముస్లిం మతాలు చేశాయనేది వాస్తవం.మాకు సంబంధం లేనిదాన్ని మాకు అంటగట్టటం అన్యాయం.

P.S: యోగాకి సంబంధించి కూడా ఇటువంటి తెలివితక్కువ వాదనలే చేశారు.మరీ ఇసిత్రం! యోగాసనాలు వేస్తే వెన్నుపాము విరిగిపోయి పక్షవాతం వొచ్చి జనం మంచాన పడతారంట,నిజమా?

*****

Your views are valuable to us!