మన్ చాహే గీత్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది.

 

“మన్ చాహే గీత్” … మహమ్మద్ ఖదీర్ బాబు  వ్రాసిన హిందీ పాటలు-పరిచయాలు చాలా

మన్ చాహే గీత్

సరళంగాను, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సురయ్యా, షంషాద్ బేగం ,తలత్ మహమూద్, మన్నాడే నుండి రఫీ, లతా, కిశోర్ ల వరకు అందరి గాయకుల్ని, గొప్ప గొప్ప సంగీతదర్శకుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతంగా వుంది. అంతటి గొప్ప కళాకారులకి కేవలం రెండేసి పేజీలు ఎలా సరిపోతాయన్న సందేహాన్ని పుస్తకంలోకి ప్రవేశించగానే పటాపంచలు చేసేశాడు ఖదీర్ బాబు. సంగీతం గురించి చాలా సూటిగా చెబుతూనే అందరి సంగీతకారుల జీవిత కోణాల్ని స్పృశించిన పద్ధతి చాలా బావుంది.

పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత  ఆయా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకొని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో  అర్ధం చేసుకోవచ్చు.

సంగీతప్రియులు తప్పక షెల్ఫు లో ఉంచుకోవాల్సిన పుస్తకం.

* * * * *

మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు

రచన: మహమ్మద్ ఖదీర్ బాబు.

ప్రచరణ: కావలి ప్రచురణలు. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.

వెల: రూ:95/-

http://gksraja.blogspot.com

Your views are valuable to us!