ప్రకృతి పరిస్థితుల ప్రకారం అంటే నాచురల్ గా మనకు జుట్టు, గడ్డము, పెరుగుతుంది. మన బట్టలు మాసిపోతుంది. మన చెప్పులు అరిగిపోతుంది. మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి మనం మంగలి వాళ్ళను, చాకలి వాళ్ళను, చర్మకారులను, రైతులను, వాటికీ అనుబంధ వృత్తులను పోషిస్తున్నాం. అయితే వృత్తులు కాకుండా కొన్ని ప్రవృత్తులు వుంటాయి. వాటిని చాలా వృత్తుల వారు సైడుగా అంటే హాబీగా చేసేవారు గతంలో.
వృత్తుల వలన ఆదాయం వుంటుంది. ప్రవృత్తుల వలన ఆనందం వుంటుంది. వృత్తుల వలన ఇంట్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రవృత్తుల వలన మంచి ఇంటి బయట పేరు ప్రతిష్టలు వస్తాయి. వృత్తుల వలన మంచి తల్లితండ్రులు అని అనిపించుకుంటారు. ప్రవృత్తుల వలన మంచి సేవకుడు, నాయకుడు అని అనిపించుకుంటారు. అయితే, ప్రస్తుతం ప్రవృత్తులు కూడా వృత్తులై పోయాయి. అందులో కొన్ని వైద్యం, న్యాయం, చట్టం. ఇలా ఎన్నో . . . .గతంలోని ప్రవృత్తులు ఇప్పుడు వృత్తుల్లా వున్నాయి.
అంతే కాకుండా ప్రస్తుతం మానవుని అవసర రీత్యా ఎన్నో కొత్త వృత్తులు, ప్రవృత్తులు పుట్టుకొచ్చాయి. పైన చెప్పుకున్న మంగలి, చాకలి, చర్మకారుడు, రైతు, కుమ్మరి, కమ్మరి లాంటివారిని పోషించడానికి ఒక రీజన్ వుంది, కానీ, వైద్యులను పోషించడానికి ప్రజలకు జబ్బులు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటన్ చూడండి. అలాగే న్యాయవాదులు బ్రతకాలంటే మానవులకు సమస్యలు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగించి విజయవంతం అవుతున్నారు. కాబోయే లాయర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటెన్ చూడండి. అలాగే చట్టసభల్లో చట్టం చేసేవాళ్ళు బ్రతకాలంటే ప్రజలకు లేమి రావాలి. ఎలా అని కొందరు కొన్ని ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు.