బుర్ర బెమ్మిరాజు-నుయ్యి వెంగళప్ప అనబడే సచిత్ర విచిత్ర కథ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author.

 

 మొత్తం ఆంధ్రప్రదేశ్ కు  పరమ శుద్ధ అమాయకుడైన బుర్ర బెమ్మిరాజు ఇతడే.

 

 

ఇతను చిరంజీవి ఇంట్లో అయ్యగారికి వ్యక్తిగత సహాయకుడుగా కొత్తగా చేరాడు. ఒకరోజు చిరంజీవి, అల్లు అరవింద్లు గూడుపుఠాణీ గది (మీటింగ్ రూమ్)లో  ఉన్నప్పుడు, ఆ రూమ్ బైటే నిలబడి వాళ్ళెమైనా ఆర్డరేస్తే నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు…లోన….


చిరుః “ఏం బావా! ఎందుకా చిందు?”

అల్లుః “మనకి నాలుగు కోట్లు మిగిలింది బావా”

 

 

 చిరు (పొగబారి): “భుహ్హు! భుహ్హుహ్హు! అదెలా బావా?”

 

అల్లు[చిందేస్తూనే]: “నుయ్యి వెంగళప్ప పుణ్యం బావా!”

చిరు[పొగను ఊదుతూ]: “అంటే పనైపోయిన ప్రజారాజ్యం జెండాలు, టోపీలు వగైరాలు చేసినోడు కదా
బావా?”

అల్లు[చిద్విలాసంగా]: “అవును బావా! అతడు మొన్నొచ్చి నా బాకీ నాలుక్కోట్లూ ఇవ్వండని అడిగాడు. నేను ఎగాదిగా చూసి నువ్వెవడైయ్యా? రాంగ్ అడ్రెస్సుకొచ్చావా లేక పిచ్చెక్కిందా? అని అడిగా. అని అడగడమే కాకుండా ఒక్కసారి మేజర్ చంద్రకాంత్ స్టైల్లో”ఈ మువ్వన్నెల జెండా నువ్వు చేసావా? ఈ చేతి గుర్తును నువ్వు అచ్చుగుద్దావా? ఈ గాంధీలను నువ్వు తీర్చావా? ఎందుకురా నీకు కోట్లు కట్టాలి?” అని గాండ్రించా. అంతే! టైడ్ సోపైపోయాడనుకో!”

చిరు[కిసుక్కున నవ్వి]: “అవాక్కయ్యాడా! హి హి హి”

 

 

ఈ మాటలు విన్న బెమ్మిరాజుకు తల తిరిగింది. అన్యాయమనిపించింది. కిందున్న విట్రిఫైడ్ టైల్స్ పగిలిపోయినట్లు, పైన తిరుగుతున్న ఫ్యాను గబ్బిలమై అరిచినట్లు అనిపించింది.

 

 

చిరంజీవి రూమ్ బైటకొస్తున్నప్పుడు ఎదురెళ్ళి

 బెమ్మి: “సార్! పాపం నుయ్యి వెంగళప్ప గతి అంతేనా? కనీస మద్దతు ధరైనా ఇప్పించరా?” అని దీనంగా అన్నాడు.

 

దాంతో వొళ్ళు మండిన చిరంజీవి బెమ్మి గొంతును పట్టి తోసేసాడు.

 

 

 

ఉద్యోగం పోయిన బెమ్మికి ఇంట్లో అనేక అవమానాలెదురైయ్యాయి.

భార్య: “నెత్తిన చెంగేసుకొనేవొచ్చారా? రండి ఆ మూల ఖాళీగా వుంది కూర్చొని తగలడండి!”


తండ్రి: “ఈ బడుద్ధాయికి ఆ మూలెందుకు చూపుతావమ్మా! పెరట్లో వున్న మరుగుదొడ్డిలో అఘోరించమను”

పిల్లలు: “అక్కడెందుకు తాతా! వీధి మురుక్కాలవ పక్కనైతే బాగుంటుందేమో!”

 

ఈ మాటలు విన్న బెమ్మి బిత్తరపోయాడు. జుట్టు పీక్కున్నాడు. అలా పీక్కోడం చూసన్నా భార్యాపిల్లలు జాలి తలుస్తారేమోనని ఆశపడ్డాడు. బట్…నో చేంజ్. సేమ్ సీన్ కంటిన్యూడ్.

 

 

మరో ఉద్యోగం కోసం వీర ప్రయత్నాలు చేస్తానని, తనకున్న క్వాలిఫికేషన్స్ కు ఉద్యోగాలు ఊడిపడ్తాయని చెప్పి అప్పటిదాకా ఇంట్లో ఉండనిచ్చి పూటకో ముద్ద పెట్టమని బతిమాలుకున్నాడు.

 

 

 

ఇంట్లో అందరూ వోకే అనగానే భయంగా, భారంగా నిట్టూర్చాడు. రోజూ ఉద్యోగ వేటకు వెళ్ళి, ఏదీ దొరక్క దొంగలా ఇంట్లోకి వచ్చేవాడు.

 

ఇలా కొన్ని రోజులు గడిచాక బెమ్మి ఈ జీవితం వద్దని డిసైడైపోయాడు. తనకిష్టమైన చావుతాళాన్ని వేసుకుంటూ రైల్వేలైను మీద తలపెట్టాడు.

 

ఇంతలో అక్కడకిద్దరు పెద్దవాళ్లు వచ్చారు.


మొదటి పెద్దాయన
[పిడుగుల్లాంటి చిటికెలు వేస్తూ]: “లే బెమ్మి లే! చిటికేసేలోపు చిత్తుచేసేయొచ్చు ఈ చెత్త సమాజాన్ని. ఖమాన్!”

 

 

 

 

 

రెండో పెద్దాయన[మెరుపుల్లాంటి పళ్ళు చూపిస్తూ, అరుస్తూ]: ముహాహాహా! ఈ పిరికిపంద సమాజం నిన్ను చూసి భయపడాలి బెమ్మీ! డామ్ డర్టీ  సొసైటీ! డోంట్ కేర్!!”

 


అదిరిపడి లేచిన బెమ్మి వాళ్ళ డ్రెస్సులు, మేకప్పులు, ఆర్భాటాలూ చూసి పిచ్చెత్తిపోయి వో తింగరి లుక్కేసుకొన్నాడు. బెమ్మి ఎన్ని తింగరి చూపులు చూసినా ఆ పెద్దోళ్ళు అరవడం, ఎగరడం మానలేదు. “తినగ తినగ డాల్డా నెయ్యిలా తోచును” అన్న తిక్క శంకరయ్య పద్యం మేరకు బెమ్మిలో మార్పులు రాసాగాయి.

 

తను కూడా ఆ పెద్దోళ్ళకు మల్లేనే వీరపోజులో ఇంటికి తిరిగొచ్చాడు. 

తిట్టడానికికొచ్చిన భార్యను “వన్ మినిట్!” అని ఆపి కరెక్టుగా వన్ మినిట్లో ఏరోప్లేన్ జడ వేసేసాడు బెమ్మి. ఆవిడ దిమ్మదిరిగిపోయింది.

దెప్పడానికికొచ్చిన తండ్రికి కూడా “వన్ మినిట్” చెప్పి ఎగ్జాట్లీ వన్ మినిట్లో షేవింగ్ చేసేసి, తలకు మీసాలకు రంగు పూసేసాడు. దాంతో ఆయన కూడా దిద్దిమ్మ తిరిగిపోయాడు.

తల్లికి, తాతకు సపోర్టు వచ్చిన పిల్లలను వాటేసుకొని చెరో అర నిముషంలో కొడుకు ఎడమ చెవికి చెవిపోగును, కూతురు కుడి భుజం మీద డ్రాగన్ టాటూనూ నొప్పి తెలీకుండా కుట్టేసాడు. దాంతో వాళ్ళు తైతక్కలాడేసారు. పెద్దోళ్ళ దయతో బెమ్మి వోవర్ నైట్ కంప్లీట్ మ్యాన్ గా మారిపోయాడు.

 

అలా ఫ్యామిలీతో హ్యాపీడేస్ గడిచిపోతున్నా బెమ్మిలో చిరంజీవి మీద కసి రగులుతూనేవుంది. 

బెమ్మి “గోడ మీద పిల్లి” అనే వాడ పత్రికలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చేరాడు. మారువేషాల్లో తిరగసాగాడు. ఎంత తిరిగినా సరైన బ్రేకింగ్ న్యూసు దొరక్క మలమల వాడిపోసాగాడు.

అలా తిరుగుతూ, తిరుగుతూ వోసారి నుయ్యి వెంగళప్పను అనుకోకుండా కలుసుకున్నాడు. లక్షా ముప్పై ఐదువేల నూటా పదకొండోసారి తన బాధను వెళ్లబోసుకున్నాడు వెంగళప్ప. తనని ఇన్సల్ట్ చేసిన మాజీ ప్రజారాజ్యం కామందును ఇరుకునపెట్టేందుకు ఇదే ఆయుధమని తలచుకొన్న బెమ్మి, నుయ్యి వెంగళప్పని ఇంటర్వ్యూ చేసి  ప్రజారాజ్యం మాజీ కామందు చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఆపై ప్రజారాజ్యం మాజీ కామందు దగ్గరకు ఒరిజినల్ వేషంలోనే డైరెక్ట్ ఇంటర్వ్యూ కెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూని “గుండు పిన్ను” ఛానెల్ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒప్పుకున్నారు.

 

చిరంజీవి చైర్లో కూర్చోగానే బెమ్మి జేబులోంచి పెన్ను తీసి “గన్ననుకున్నావా?” అని రిటార్ట్ ఇచ్చాడు. తనకు కాఫీ, టీలిచ్చిన బెమ్మి జర్నలిస్టై రావడం చూసిన మాజీ ప్రజారాజ్యం కామందు పొలమార్చుకొన్నాడు. బెమ్మి అడిగిన తూటాల్లాంటి ప్రశ్నలకు దీటైన సమాధానాలు చెప్పలేక తలదించుకొన్నాడు.

బెమ్మి: “చూడండి మిస్టర్ కామందు గారూ! మీ మాజీ పార్టీ జెండాలు, బ్యానర్లు, పాంప్లేట్లు అచ్చుగుద్దిన నుయ్యి వెంగళప్పకు మీరు నాలుగు కోట్లు బాకీ వున్నారు కదా! అదెప్పుడు తీరుస్తారని ఆంధ్రా జనాలు ఆతృత ఎదురుచూస్తున్నారు. వారికి మీ సందేశమేమిటి?”

కామందుః “మ్..మ్..మ్మ్…కొలకత్తాలోని మురికివాడల్లో బట్టల్లేని నిరుపేదలకు ఆ జెండా గుడ్డల్ని పంచిపెట్టేసాం. వంటగ్యాసు సరఫరా కాని అండమాను పల్లెల్లో మా లెటర్ ప్యాడ్లూ, పాంప్లెట్లూ ఇంటింటికీ పంచిపెట్టాం. కావాలంటే ఇదిగో ఈ వీడియోలు చూడండి.”

టీవీల ముందు కూర్చొన్న ప్రజలు అనబడే పప్పాయిలు చప్పట్లు కొట్టారు. బెమ్మిని శపిస్తూ ఎస్.ఎం.ఎస్ లు పంపారు.

బెమ్మి[దిమ్మదిరిగి]: “ఇదన్యాయం! నుయ్యి వెంగళప్పకు మీరు నాలుగు కోట్లు కట్టాల్సిందే!” అన్నాడు.

దానికి సమాధానంగా ప్రజారాజ్యం మాజీ కామందు – “ప్రజలారా! హిట్లర్లై, టాగోర్లై, ఖైదీ, రుస్తుం, మహారాజులై, టోటల్గా ఈ స్టేట్ రౌడీలై ఈ సన్నాసికి మీరే బుద్ధి చెప్పండి. నమస్తే” అని దండం పెట్టి వెళ్ళిపోయాడు.

 

రెచ్చిపోయిన పిచ్చిప్రజలు చిరంజీవి ఇంటి బైటకి రాగానే బెమ్మి పంబరేగ్గొట్టారు.

తనకు భార్య ఉందని, దయతల్చాలని బెమ్మి మొత్తుకున్నప్పుడు ఆడ హిట్లర్లు తుక్కు రేగ్గొట్టారు. ఇంటికి సంపాదనాపురుషుడు తనేనని చెప్పుకొన్నప్పుడు మమహారాజులు వాయించారు. చిన్నిచిన్ని పిల్లలున్నారని గోలపెట్టినప్పుడు పిల్ల స్టాలిన్లు దుమ్ము దులిపారు.

ఈజిప్టు మమ్మీలా తయారైన బెమ్మిని గుండుపిన్ను చానెల్ వాళ్ళే ఆస్పత్రి తీసుకెళ్ళి వైద్యానికి పాతికవేలు ఖర్చుపెట్టారు. [గుసగుస] బెమ్మిని తిడుతూ పంపిన ఎస్.ఎం.ఎస్ ల ద్వారా గుండుపిన్ను చానెల్ కు కోటి రూపాయలొచ్చాయట.

షేపులు మారిపోయిన బెమ్మి ఇప్పుడు ఎక్కడా కనబడ్డంలేదు.

 

బెమ్మిని నమ్ముకొని, ప్రజారాజ్యం మాజీ కామందు పై ఆరోపణలు చేసి ఇప్పుడు కోర్టులో పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న నుయ్యి వెంగళప్ప ప్రతిరోజూ బెమ్మి ఫోటోను చూస్తూ……….

Your views are valuable to us!