చింపాంజీ-సహజీవనం!

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

“ఏమండి!”

“ఏమండీ!”

“మన పాప…”

“కడుపునొప్పా? వుడ్ వర్డ్స్ పట్టూ…”

“అబ్బా ఆపండి వేళాకోళం. నేను చెప్పేది వినండి”

“అంతకంటే పనేముంది? చెప్పు”

“అదే..మన…పాప గురించి…ఇది చాలా తీవ్రమైన విషయం”

“అంటే హైలీ సీరియస్ ఇష్యూ అన్న మాట…చెప్పు చెప్పు”

“మన అమ్మాయి ఒక చింపాంజీతో సహజీవనం చేస్తుందంట!”

“వాట్? ఏమిటి? అంటే చింపాంజీని పెళ్ళి చేసుకొంటుందా?”

“అవునండీ…కాదండీ…”

“నాన్సెస్…ఏమిటా అవును కాదూ? సీరియస్ విషయాన్ని కామెడీ చెయ్యొద్దు. చెప్పూ”

“అమ్మాయి చింపాంజీని లవ్ చేసింది…అందుకు అవునన్నాను. కానీ పెళ్ళి చేసుకోదు…అందుకు కాదన్నాను”

“అగైన్ నాన్సెస్…లవ్ చేసీ పెళ్ళి చేసుకోకపోవడమేంటి?”

“అదేనండీ…పెళ్ళి కాదు కానీ దాదాపు అట్లాంటిదే..సహజీవనం చేస్తుందట”

“అదేమన్నా చేసి చావని…మొదట దీనికి ఆ చింపాంజీ ఎలా దొరికిందో చెప్పు. కామెడీల్లేకుండా…ఖబర్దార్…ఆయ్”.

“మొన్నామధ్యన మీరు స్కాముల్తో, స్వాముల్తో బిజీగా వున్నప్పుడు అమ్మాయి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ షోలో మొదట ఒక అబ్బాయిని చూపించి ఈ అబ్బాయిని కళ్ళకు గంతలు కట్టుకోని నడుచుకొంటూ వెళ్ళి ముద్దు పెట్టాలని చెప్పారంట. అమ్మాయి థ్రిల్ ఫీలయ్యి సరే అనింది. కానీ అమ్మాయికి కళ్ళగంతలు కట్టేసిన తర్వాత అబ్బాయిని మార్చేసి చింపాంజీని కూర్చోబెట్టారు..”

“వాట్…బట్…షిట్…తర్వాత?”

“అమ్మాయి సిగ్గుపడ్తూ…”

“ఏం పడ్తూ?”

“సిగ్గండీ…సిగ్గు పడ్తూ….”

“పెట్టుకోబోయేది ముద్దని…అందులోనూ పరాయి అబ్బాయినని తెలిసీ సిగ్గుపడిందా? ఓ గాడ్…సరే చెప్పు”

“అలా సిగ్గుపడ్తూ వెళ్ళి ఆ చింపాంజీని ముద్దుపెట్టేసుకొంది”

“యాక్…దీనికి మనిషి పెదాలకీ, చింపాంజీ పెదాలకీ తేడానే తెలీదా? ఓ గాడ్..వాట్ నెక్స్ట్?”

“పాపం చిన్నపిల్ల ఎలా తెలుస్తుంది? మన సంప్రాదాయాలు అవీ అమ్మాయిలకు లోకజ్ఞానం లేకుండా చేస్తున్నాయి కదా!”

“నీ లాజిక్కు మండినట్లేవుందిగానీ ఆ తర్వాతేమైంది?”

“ఏముంది! అమ్మాయి చింపాంజీతో లవ్వులో పడింది. ఇప్పుడు సహజీవనం చేస్తానంటోంది!”

“లవ్వు సరే ఈ సహజీవనం అంటే ఏమిటి? అర్థంకాక చస్తున్నా”

“పక్కింటి వీరవనిత గారితో కనుక్కొన్నా. నాకు తెలుసు సహజీవనమంటే ఏమిటో?”

“ఆహా! పక్కింటి వీరవనిత గారికి అంత నాలెడ్జ్ వున్నట్టు నాకు తెలీదే? ఇంతకీ ఆవిడేమి చెప్పారు?”

“కొన్నేండ్ల కిందట ఖుష్బూ ఆంటీ పెళ్ళికి ముంది సెక్స్ తప్పుకాదని స్టేట్మెంట్ ఇచ్చింది కదా! దాన్ని సమర్ధిస్తూ సుప్రీం కోర్టు వాళ్ళు కూడా పెళ్ళి కాకపోయినా ఒక ఆడ, ఒక మగ కలిసి సహజీవనం చేయొచ్చు అని చెప్పారు.”

“సరే! సుప్రీం వాళ్ళు చెప్పింది ఆడా, మగా గురించి. కానీ మన అమ్మాయి కేసులో మగ లేదుగా?”

“చాల్లేండి పాపం! ఎంత చింపాంజీ ఐనా మగ మగే కదండీ!”

“అంటే! ఏమిటీ నీ ఉద్దేశం? చింపాంజీ మగది కాబట్టి, మన అమ్మాయి అమ్మాయి కాబట్టి…అంటే ఒక మగ, ఒక ఆడా కాబట్టి…షిట్..నో…హెల్…నో…”

“మీరెన్ని ఇంగ్లీషు పదాల్ని అరిచినా విషయం మారదు. మనం ఈ సహజీవనానికి ఒప్పుకోకతప్పదు”

“ఓహో! ఏమిటీ నీ దబాయింపు? ఆయ్…అమ్మాయి బుద్ధిలేని పనిచేస్తుంటే సరిదిద్దాల్సింది పోయి సమర్ధిస్తావా?”

“తప్పకుండా సమర్ధిస్తాను! అమ్మాయి నిజమైన చింపాంజీతో సహజీవనం చేయబోతోంది. కానీ నేను పెళ్ళే చేసేసుకొన్నాను!!”

“వాట్….షిట్…బట్…నో….ఓ గాడ్!”

 

* * * * *

 

Your views are valuable to us!