చిటపటలు 02 – “చంటబ్బాయ్ ఛాలెంజ్”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొత్త కాంగ్రెసోడు కాకాల బాకా ఆపడని కొత్త సామెత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పంచెలూడదీసి పరుగెత్తిస్తామన్న పులి, ఈరోజు కాంగ్రెస్ కండువాలో దూరి కేక పుట్టిస్తున్నదని కడపలోని ప్రతి గడప కోడై కూస్తున్నదట.

జగన్ పై భీకరంగా విమర్శలు గుప్పిస్తూ…ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తానన్న జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడట చిరంజీవి. నువ్వు ఆరు నెలల్లో కూలదోస్తే, నేను ఆరు నెలల్లో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని తొడలు కొట్టి మరీ ఎవరెవరికో పూలు పెడుతున్నాడని అభిజ్ఞవర్గాల భోగట్ట.

ఆయనే ఉంటే మంగలెందుకని సామెత. ప్ర.రా.పా. కాంగ్రెస్ లో కలిసిందన్న ధీమాతోనే కదా జగన్ కు కాంగ్రెస్ కు చెక్ పెట్టింది.

పదారు మంది ఎమ్మేల్యేలతో నిలబడలేకే కదా కాంగ్రెస్ బాకాలా మారింది, ఇక ఒకవేళ జగన్ కూలదోసాడనే అనుకుందాం, అస్తు పిస్తు 16 మంది ఎమ్మెల్యేలతో ఈయన నిలబడేదేముందిట, నిలబెట్టేదేముందిట!

రాజకీయాల్లో తనింకా “చంటబ్బాయే” అని చిరంజీవి మాటిమాటికి నిరూపిస్తూనే ఉన్నాడు.

Your views are valuable to us!