“డామ్”క్రసీ! మరియు కొన్ని సెన్సేషనల్ స్టోరీలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author.

టీవీ సెట్ టాప్ బాక్సుల్లో దాచిపెట్టిన “Embedded Mad-O-Meter” ఫ్రీక్వెన్సీలు విపరీతంగా ఒడిదుడుకులకు లోనవ్వగానే మా టీవీ జీరో ప్రతినిధి బృందం హైదెరబాద్, విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, ముంబాయ్ మొదలైన ప్రాంతాల్లో మాస్ సర్వేలు నిర్వహించింది. 

టీవీ జీరో సర్వే సారాంశం ఇప్పుడు మీ కోసం…

  • ఈజిప్టులో, ట్యునీషియాలో, బహ్రైన్ లో….ఇలా మిడిలీస్టులోని మిడిల్ క్లాసు ప్రజలంతా ప్రజాస్వామ్యం కావాలని ఉరుకులెత్తడం చూసిన భారత ప్రజలు పిచ్చిగా నవ్వుకొంటున్నారు. 
  • “ప్రజాస్వామ్య ముబారక్ హో” అని ఈజిప్టు ప్రజలు ఒకరినొకరు అభినందించుకోవడం చూసిన పాకిస్తాన్ ప్రజలు వెర్రిగా ఆలోచిస్తున్నారు.
  • భారత ప్రధానిగా ఒక పాజీ ఉండబట్టే 2జీ కుంభకోణం సంభవించిందని పంజాబు తప్ప మిగతా రాష్ట్రాల మెజార్టీ ప్రజలు మొత్తుకొంటున్నారు.
  • బ్రిటన్ తెలుగువాళ్ళు తాము తయారు చేసిన ఆంధ్ర పద నిఘంటువు లోకల్ ఎడిషన్లో “ఖర్మ కాలి” అన్నదాన్ని “కల్మాడి” అన్న పదంతో రీప్లేస్ చేసారు.
  • కాంగ్రెస్ పార్టీలో “జగన్” అన్న పదం పేరులో ఉన్న విధేయ కార్యకర్తలు వెంటనే పేర్లు మార్చుకొంటామని, దానికి  అనుమతినివ్వాలని మేడమే సోనియా ఇంటి ముందు ధర్నా చేపట్టారు!
  • జగన్ కొత్త పార్టీ పేరులో “కాంగ్రెస్” ఎందుకని ఎదురు తిరిగిన కార్యకర్తలు “యాంటీ కాంగ్రేస్” పేరుతో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు.
  • తమకు పుట్టబోయే(తే) బిడ్డకు కొచ్చిన్ అని పేరు పెట్టి సచిన్ ను మించిన క్రికెటర్ను చేస్తామని శశి థరూర్ దంపతులు గురువాయూరప్ప ముందు ప్రతినబూనారు!

మరిన్ని సెన్సేషనల్ సర్వేలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం…ఇప్పుడో చిన్న బ్రేక్!

Your views are valuable to us!