విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తూ, కోటి మంది ప్రజలతో, ఒక్క గోచీతో అర్ధనగ్నంగా నిరాహార దీక్ష చేయాలని బాబా రాందేవ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. సుసంపన్నమైన భారతదేశానికి ఈ నల్లధనం ఎంతవరకు అవసరం అని విచారిస్తూ… నల్లధనం కోసం వెంపర్లాడే ఇటువంటి దేశంలో పుట్టినందుకు రాహుల్ బాబు సిగ్గుపడుతుంటే, బాబాతో సిబాల్ సంప్రదింపులు జరపటం అమానుషం.
* * *
జన లోక్ పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానిని తీసుకురావాల్సిందేనని అన్నా హజారే పట్టుబట్టి కూర్చున్నారని తెలుసు కదా! రబ్బర్ ముద్ర ప్రధానిని గుంపులో గోవిందంలా తోసేస్తే నష్టమేముందని రాహుల్ బాబు చిదంబరం చెవిలో ఊదుతున్నాడట! రేపు తమరు ప్రధాని అయితే కధెలా నడుస్తుందని సిబాల్ చిందులేస్తే, సిగ్గు పడుతూ రాష్ట్రపతినౌతానన్నాడట రాహుల్ బాబు!
* * *
ఉగ్రవాదాన్ని ఏదో ఒక కోణం నుంచి కాకుండా అన్ని కోణాల నుంచి ఎడాపెడా ఎదుర్కోవాలని జర్మని ఛాన్సలర్ ఎదురుగా మన ప్రధాని కంకణం కట్టుకున్నాడని రాహుల్ సిగ్గు పడ్డాడట. సిగ్గెందుకు పడ్డారని ఆరాతీస్తే, ఇంతాకాలం తొడుక్కున గాజులు చాలలేదనా ఇప్పుడు కంకణాలు తొడుకున్నాడని ఎక్కెసెక్కాలాడాడట!
* * *