యియ్యాల్టి రామాయణం – బాస

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అప్పన్న: ఊరే నిన్న బాస గురించి  సెప్పిన మాట సాల నచ్చిందిరా రామాయనం అని మనం అంటే ఆ పెద్దాయన కాదు రామాయణం అనాలి “అణ” అని బలే సేప్పాడు ఇప్పుడు మనం కనీసం రామాయనం అనకుండా రామాయణం అనగలుగుతున్నాం. అంటే రామాయణం ఇనగా ఇనగా మనకి తెలుగు బాస ఒక పక్క సంక్రుతం ఒక పక్క వచ్చేత్తయన్న మాట.


రాజన్న:
సంక్రుతం వత్తదో లేదో కాని తెలుగు బాగా వత్తాది.  నా మట్టుకు నాకు ఎన్నో తెలిసినట్టు ఉంది .

అప్పన్న: కానీ అలా పట్టి పట్టి మాట్టాడడం నాకు ఒకరకంగా ఉంది అసలు మాట పెగల్టలేదు.  మనం ఎప్పుడు ఎలా మాత్తాడతావో అలా మాట్టడితేనే నాకు ఈలుగా ఉంది.  

రాజన్న: సరే అంత సక్కగా మాట్టాడతారు కదా  ఈ మనుసులు ఎందుకు సిన్న సిన్న అబద్దాలు సెపుతారు ఒక్కోసారి నాకు సేన సిగ్గు గా ఉంటాది మొన్న ఆ తెల్ల పంచే పచ్చ జుబ్బ ఏసుకున్నాయన అదేరా రంగసామి మేట్టారు పట్టపగలు పెద్ద అబద్దం సేప్పేసాడు సాల సునాయాసంగా!

అప్పన్న: ఏ అబద్దం అది?

రాజన్న: నీకు తెల్సు అది.. మొన్న పెసంగం అయిపోయిన తర్వాత మనం ఇద్దరం రెండో ఆట సినిమాకి ఎల్తే ఆ మేట్టారు కూడా వచ్చాడు కదా ఆయన దందాపన లో ఆయన ఉన్నాడు కాని మనన్లి సూడలే కాని మనం సూసాం. కదా. 

అప్పన్న: ఔను.  ఓ సాగదీయక సెప్పెహే

రాజన్న: ఆ మేట్టారు ఇందాక ఒక పెద్దావిడతో అంటాడు  “నేను పెసంగం అయిపోయినాక ఇంటికి పోయి సెప్పిన దాన్ని దేనం సేత్తా నన్నాడు”

అప్పన్న: పెసంగాలు అందరూ ఇంటారు గాని ఆ పెసేన్గాల్లో సెప్పిన ఇసయాలు పాటించరు ఈ మేట్టారు కూడా అసుమంటి ఆయనే. బాస బాగుంటే సాల్దు  మనసు కూడా బాగుండాలే.

రాజన్న: ఇనగా ఇనగా బాస, మనసు కూడా బాగు పడతాయ్ అని ఆ పెద్దాయన సెప్పాడు కదా. 

అప్పన్న: నిజమే ఎంత ఇన్నా కొందరు బాగు పడరు.  ఆ ఇన్న దాన్ని కూడా వాడుకుంటారు!!

Your views are valuable to us!