యియ్యాల్టి రామాయనం – పాయోపవేసం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

రాజన్న : సచ్చిపోతానికి పాయోపవేసం ఎందుకురా ?  నాకు బొత్తిగా తెలియలే ??

అప్పన్న: పాయోపవేసం అంటే సచ్చిపోడానికి పడుకోడం !

రాజన్న : సచ్చిపోడానికి పడుకుటే సచ్చిపోతారేటి?  అలాగైతే మా పెద్ది గత నాలుగు మాసాలు పడుకొనే ఉండేది. తినేది కాదు తాగేది కాదు సరిగ్గా.  మరి సచ్చిపోలేదే?

అప్పన్న: మీ పెద్ది అడివి లో పడుకోలేదు కదా.

రాజన్న: ఓహో, అయితే అడివిలో పడుకుంటే పాయోపవేసం అన్నమాట

అప్పన్న: ఔను, అలా పడుకుంటే ఏ పులో వచ్చి తినేత్తే సచ్చిపోతం అన్న మాట

రాజన్న: కాని ఇప్పుడు ఎవరూ పాయోపవేసం ఎందుకు సేసుకోరు?

అప్పన్న: సేసుకుంటారు.

రాజన్న: ఎలా ?

అప్పన్న: అన్నీ ఒగ్గేసి ఊరుకుంటే పాయోపవేసమే !!

రాజన్న: ఓ సాగాదియక సరిగ్గా సెప్పు !

అప్పన్న: సెజ్జులు అని సెప్పి మొన్న ఆ ఎంకయ్య బూమి తీసేసుకోలేదు అప్పుడు ఆడు అన్ని ఒగ్గేసి ఆల్లిచ్చింది తీస్కోని ఊరుకోలేదు అదే పాయోపవేసం.

రాజన్న: ఇంకా ఇవరంగా సేప్పెహే .

అప్పన్న: నిన్ను ఏవీ సేయ్యలేనోన్ని సేసేసి నీకున్నాది లాక్కొని నిన్ను పెనాలతో ఒదిలేత్తే   పాయోపవేసం ఈ పెజాసామ్మేమ్లో

రాజన్న: అంటే మనం ఏవీ సెసుకొఅక్కలెదన్న మాట పాయోపవేసం అదే అయిపోద్దా.

అప్పన్న: ఔను

రాజన్న: ఇలా సాల ఇసయాలు తెలుత్తున్నై రామాయనానికి ఎల్తే

అప్పన్న : మొన్న ఆరోగ్గేశ్రీ లో ఒక ఆస్పటల్లో మా ఈది శివర ఇంట్లో ఉండేటోడు   ఎల్లి బెడ్డు మీద పడుకున్నాడట. ఆ బెడ్డు మీదే పది రోజులు ఉంచి 11 రోజు పోయాడు తీసుకుపోమ్మన్నారట అదీ పాయోపవేసమేనా

రాజన్న : నీకు బాగా అద్దమైన్దిరా అదే పాయోపవేసం.  నీల్లకావిడి ఎసుకోవాలే ఎల్లోత్తా.

Your views are valuable to us!