యియ్యాల్టి రామాయనం – రామ రాజ్యం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అప్పన్న :  ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన పేరుమీద మరి పరిపాలన సేయ్యరే!

రాజన్న : నీ మొగం.  పెమాన సీకారం నువ్వు సూడలేదా  గవర్నరు గారు సెప్పింది సెప్పి  దేవుడు మీద పెమానం సేసి కుర్సీలో కూసుంటారు. రావుడా
సోవుడా !!

అప్పన్న :  మరి ఎందుకు అలా సెపుతారు?

రాజన్న : అంటే రావుడిలా పాలిత్తాను అని  

అప్పన్న: ఎహే మళ్ళీ అదే మాట ఆడు రావుడు కాదు కదా

రాజన్న : ఎర్రి మొగమా నీకు ఇంకా తెల్దు. అవన్నీ రాజకీయాలు

అప్పన్న : ఏంటి రామరాజ్యం తెత్తం కూడా రాజకీయమేనా ?

రాజన్న : ఆ మాటకి  వత్తే దర్మం, నాయం, సట్టం,  పోలీసులు అన్నీ రాజకీయమే

అప్పన్న : ఏవో రా సెడ్డ  తిరకాసుగా ఉంది.  మొన్న రామాయనం ఆ సేగంటాయన  సెప్పినపుడు  బలే ఉందిరా. నేనైతే ఒక కలే కన్నాను ఏంటో  తెలుసా ?

రాజన్న: కలే ఏంటది ?

అప్పన్న: మొన్న అ జగన్ బాబు వచ్చి నా బుగ్గలు నిమిరి ఒదార్సాడు సూడు అప్పుడు వచ్చిన్దీకల.  అంతకు ముందురోజే ఆ   సేగంటాయన బరతుడు ఎంతో బక్తి తో అయోద్యని రాముడి సెప్పులు సూత్తూ పాలిత్తాడు అని  అలాగే నేను ఆ జగన్ బాబు సి ఎం అయితే ఆళ్ళ నాన్న సెప్పులు కుర్సీలో పెట్టి పూజ సేసి ఆటిని సూత్తూ పాలిత్తాడేమోనని అనుకున్నట్టూ,   మాకోద్దంటే మాకొద్దు ఈ  రాజ్యం అని రాములోరు ఆయన తమ్ముళ్ళు దెబ్బలాడుకున్నారట గదా.  అలాగే వచ్చే ఎన్నికల్లో మాకోద్దంటే మాకొద్దు ఈ సిఎం పదవి అని రాములోరి సెప్పుల కోసం ఆ సిరంజీవి, కిరను, జగను, బొత్స దెబ్బలాడుకుంటారేమో అని నీకు సెప్పుతున్నట్టూ కలొచ్చింది . ఏమైనా కుర్సీలో రాములోరి సెప్పులు పెట్టి పరిపాలించడం బలే ఇసయం!

రాజన్న :  కల కాదు ఇప్పుడు నిజంగానే నువ్వు నాకు సెప్పేసావు .  వురై నీకు రామాయణం బాగా తలకెక్కింది అందుకే నీకీ పిచ్చి కలలు.

అప్పన్న: కాదురా బా జ పా గెలిత్తే అలా అయోధ్య నుంచి రాములోరి సెప్పులు కురిసీ లో పెట్టి పాలిత్తారేమో రా నాకు మా చెడ్డ ఉబలాటం గా ఉంది అలా సూడాలని

రాజన్న : మరి సోనియా గాంది వత్తే

అప్పన్న : సోనియా సెప్పులు కురిసీలో పెట్టి రాహులు బాబు పాలిత్తాడు.

రాజన్న :  అంటే నీకు ఎవరో ఒకరు ఎవరో ఒకరి సెప్పులు కురిసీలో పెట్టి పాలించాలని ఉందన్న మాట.  నీకు పిచ్చి బాగా ముదిరి పోయిందిరోయ్. పద నీ ఇంటిది పిలుత్తుంది కూడు తిండానికి.  తిని తొంగో రేపు కలుద్దాం.

Your views are valuable to us!