అప్పన్న: అంత తప్పు సేసేసిన ఆ రావనున్ని కూడా సెరనాగతి సేత్తే సేమిన్చేత్తనన్నడా రావుడు. ఎంత పెమాదం అది!
రాజన్న: పెమాదం ఎందుకు అలా సెరనాగతి సేసినోడు ఓడి పోయాడనే అద్దం. ఓడిపోయినాడు ఏన్జేత్తాడు?
అప్పన్న: అదే ఆ రాములోరికీ నీకు తెలియని ఇసయం. ఒకేళ ఓ కూనీ కోరు సెరనాగతి సేసేత్తే పోలీసోల్లు ఒగ్గేత్తారా ఆణ్ణి?
రాజన్న: ఇది కలి కాలం అలా ఒగ్గరు.
అప్పన్న: కలి కాలం ఏంటి రాములోరి కాలమేంటీ దొంగ దొంగే ఆణ్ణి సిచ్చించాలి
రాజన్న: కరష్టే కాని ఆడు ఇక నేను దొంగతనం, సంపటాలు సేయ్యను అని సెరనాగతి సేత్తే ఒదిలేయాలి.
అప్పన్న: నీకు పిచ్చా ఇప్పుడు సంగతి సెప్పు. అలా ఒదిలేత్తం కుదర్దు కదా ?
రాజన్న: కుదర్దు కాని సెరనాగతి అంటే అద్దం అది. అంటే మడిసి మారి పోతాడన్నమాట
అప్పన్న: మారినోన్ని ఒక్కణ్ణి సూపు అందరు కోర్టుకెక్కారు కాని మారలేదు
రాజన్న: అంటే నీ ఉద్దేసం ఏంటి ?
అప్పన్న: సెరనాగతి అంటే తప్పించు కోడం, పేనాలు కాపాడుకోడం తర్వాత దొంగదెబ్బ తీత్తం. ఒకిదంగా సూత్తే రావణుడు సాల నికార్సైనోడు అందుకే సెరనాగతి సెయ్యలేదు.
రాజన్న: అయితే నికార్సైనోల్లు సెరనాగతి సేయ్యరంటావ్?
అప్పన్న: ఔను.
రాజన్న: మరి ఇబీసనుడు మంచోడు కాదా?
అప్పన్న: ఆడు మంచోడే. మంచోడు మంచోడి దగ్గరకే ఒత్తాడు. అదే సెరనాగతి అంటే. ఒక సెడ్దోడు ఒక మంచోడికి లొంగిపోతేనే సిక్కు అది సెరనాగతి అనకూడదు రాజకీయం అనాలి
రాజన్న: కాదేమోరా సెరనాగతి ఎవరు సేసినా సెరానాగతే మళ్ళీ ఆ పెద్దయన్నే అడుగుదాం లే సందాల.
అప్పన్న: సరే అలాగే. కాని నాకు ఆద్దమైంది ఏంటంటే మన కాలంలో సెరనాగతి రద్దు సేసేసారు. దాని బదులు పోలీసులు కోర్ట్లు వచ్చాయ్.
రాజన్న: ఎందుకంటావ్?
అప్పన్న: ఎందుకంటే ఇప్పుడు యాడు సెడ్దోడో యాడు మంచోదో సెప్పలేం.
రాజన్న: నా గురించి కూడా సేప్పలేవా ?
అప్పన్న: సేప్పలేను ఎందుకంటే ఒకేళ నీకు ఒక కోటి లాట్రీ తగిలి బాగా డబ్బోచ్చిన్దనుకో ఇలా నాతొ ఈ బండమీద కూసోని మాట్టాడతావా?
రాజన్న: …………………