అప్పన్న: ఒరేయ్ రాజన్న ఒక పని సేసి రమ్మంటే ఆ అనుమంతు కాల్సి వచ్చాడు కదా అది తప్పుకాద?
రాజన్న: తప్పేలాగా అవుద్దీ ఆయన ఎంతో మేలు సేసాడు గదా
అప్పన్న: కానొరే నాకు బాగా నవ్వొచింది ఏంటో తెల్సా
రాజన్న: ఏటది?
అప్పన్న: అనుమంతుడు సేప్పకుండానే ఆ కోతులన్నీ రాములోరి ముందుకొచ్చి లంక అలా ఉంది ఇలా ఉంది అనే ఆల్లే సూసి నట్టు తెగ సేప్పెసారు గదా అప్పుడు రాములోరు “నాగురించి సీత ఎవనుకుంటుందీ” అని అడగ్గానే అందరూ ఎనకమాల కూసున్న అనుమంతుని ముందుకి తోసేసారు సూడు అది.
రాజన్న: అదా నాకు నవ్వొచింది అది ఇన్నాక కాని నాకు ఒక ఇసయం గేపకానికి వచ్చింది
అప్పన్న: ఏవా ఇసయం ?
రాజన్న: మొన్నబస్సు పెమాదం జరిగింది గదా ఆ మర్నాడు మన ఎర్ర బస్సు డైవరు పవేటు బస్సు డైవర్ల కంటా ఎర్రబస్సు డైవర్లె గొప్పోల్లని సాల సేప్పాడు. అప్పుడు మన కేసినేని డైవరు వచ్చి దురేసుకున్నాడు అప్పుడు ఆ టీ కొట్టోడు ఒక మాట అన్నాడు “ఏ డైవరు అయినా నాకు మాత్రం డబ్బులీయడు” అని. మళ్ళీ ఒక్కడు మాట్టాడితే ఒట్టు . అంటే నికార్సైన పెస్న ఏత్తే అసలు సరుకు బయట పడద్ది. అలా మాట్టాడే వోడు నాకు అగుపించలే.
అప్పన్న: ఔన్రా ఇయ్యాల నాయకులం అని జెప్పి తెల్ల బట్టలేసుకొని తిరిగేవోల్లు అందరూ లోపల మురికి ఉన్నోల్లె
రాజన్న: మరి ఈయాల సూసి రమ్మంటే దాన్ని దాసి వచ్చేత్తారు ఆనక సక్కగా అమ్ముకొని డబ్బు సేసు కుంటారు.