యియ్యాల్టి రామాయనం – రాజబోగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అప్పన్న : కంటి సూపుతో సంపెత్త అన్న మాట రామయనంలో నే ఉన్న దంట  నీకు తెల్సా

రాజన్న: నాకు  తెల్దు, నువ్వు రామాయనానికి ఎల్తం మొదలెట్టాక నాకెందుకో రాడానికి కుదరట్లేదు

అప్పన్న: లకస్మనుడు సుగ్రీవుడి కొమ్పకొచ్చి సుర సుర సూపులు సూసాడట అప్పుడు వాల్మీకోరు ఎలా సూసాడో  సేబుతూ అన్నారట ఆ మాట

రాజన్న: అంటే మన బాలయ్యకు రామాయనం బాగోచ్చన్నమాట!

అప్పన్న: ఔనోరే ఒకేళ మనం ఈ సినిమాల్లో ఇంటన్నా డవిలాగులు అన్నీ రామయనంలోయే నేమో అని నాకు అనుమానం.

రాజన్న: కామోసు.  సరే  ఇంకేవిన్నావ్?

అప్పన్న: మందు తాగితే ఆడదాన్ని కూడా సుకపెట్టలెం అని అదే పని గా మందు తాగుతున్న సుగురీవున్ని సూసి వాల్మీకోరు రాసారట అంటే బెల్టు షాపులు
అప్పుడూ సాల ఉన్దేవన్నమాట కిస్కిన్దలో

రాజన్న: ఎన్టీ బెల్టు షాపులు కిస్కిన్దలో ఉన్నాయా!  మా సెడ్డ సిత్రంగా ఉందోరే. నువ్వు సేప్పుతున్న తీరు సూత్తే నాకు కల్లముందు రామాయానం జరుగు తున్నట్టుంది.  ఎందుకంటే జగను బాబు మేడలు, మన పెదాని ఇమానం లో రాజబోగాలు  ఇదేసాలకు ఎల్లినప్పుడు, మర తూనీగలేక్కిన వై ఎస్ బాబు, పెజాసామెం లో కూడా ఇన్ని  రాజబోగాలు ఉన్నాయంటే సూడు రామాయనం కల్ల ముందు జరగట్లేదా ?

అప్పన్న: ఔను అప్పుడు ఒక్కడే రావుడు ఇప్పుడేమో రాష్ట్రానికో రావుడు దేశం మొత్తానికి మరో రావుడు ఎంతమంది రావుల్లో

రాజన్న : ఒకో రాష్ట్రంలో ఒకో కిస్కింద కూడా. కాని రాష్ట్రానికో సోనియా ఎందుకు లేదు?

అప్పన్న: అది రాజకీయం మనకర్దంగాదులే, మా బుడ్డోడు పిలుత్తున్నాడు మల్లోత్తా ……..

Your views are valuable to us!